1, సెప్టెంబర్ 2020, మంగళవారం

రామ నామ తారకం


రామ నామ తారకం
భక్తి ముక్తి దాయకం
జానకీ మనోహరం
సకల్లోక నాయకం

శంకరాది శ్రవ్యమాన 
పుణ్య దివ్య  నామ కీర్తనం

తారంగం తారంగం
తాండవ కృష్ణ తారంగం
వేణూ నాదా తారంగం
వెంకట రమణా తారంగం

హరి యను రెండక్షరములు  
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరియని బొగడంగ వశమె హరి శ్రీకృష్ణా



5 కామెంట్‌లు:

  1. శ్రీరామ రఘుకుల నందన సీతాపతి
    ~!!!~
    °|°
    -'-

    రిప్లయితొలగించండి
  2. అదె!చక్రాయుధధారి, మాధవుడు బాహాబాహియౌధ్ధత్య సం
    పద గన్పట్టగ నేకచక్రమున తా బాలించు బ్రహ్మాండమున్
    గదయున్ శార్ఙ్ఞము చక్రమున్ బొదివిశంఖంబూది రూపించెడిన్
    మదినిండాపరమాత్మయై మెదలు రామా ! నీకు కైమోడ్చితిన్ .

    రిప్లయితొలగించండి
  3. ఆ కోదండము పట్టు ఠీవి , కనులం దార్తావన జ్యోతులున్
    రాకాశోభలు గుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
    లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
    కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కం గల్గు సర్వార్థముల్ .

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజావారు,
      శ్రీరామ రామ రామేతి
      రమే రామే మనోరమే
      సహస్ర నామ తత్తుల్యం
      రామనామ వరాననే


      తొలగించండి