Tuesday, 29 August 2017

బలమెవ్వడు?

బలమెవ్వడు?

గాలీవానా వస్తే చిగురుటాకులా వణికిపోతాడు

కాలికింద భూమి కంపిస్తే.. నిలువనీడలేనివాడు.

అగ్ని ప్రజ్వలిస్తే....దారి తెన్నూ తెలియనివాడు.

అంతెందుకూ కంటికి కనుపించని సూక్ష్మజీవులు దాడి చేస్తే పిట్టల్లా రాలిపోవడం తప్పించి... ఇంతబలహీనుడైన  మానవుడు అంతా నేనే చేశాను,చేస్తాను అంటాడు. కష్టంలో వేదనలో దిక్కుతోచక అలమటిస్తాడు..కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారు వేదన అనుభవిస్తుంటే ప్రేక్షకునిలా చూస్తూ ఉండడం తప్పించి వేదన తప్పించలేనివాడు.....బలమెవరూ?

బలయుతులకు దుర్బలులకు, బలమెవ్వడు నీకునాకు బ్రహ్మాదులకున్
బలమెవ్వడు ప్రాణులకును, బలమెవ్వం డట్టి విభుడు బలమసురేంద్రా!


కష్టంలో రక్షించేవారెవరు?


అమ్మ!  అమ్మ!! అమ్మ!!!.






11 comments:

  1. మీరెవర్ని నమ్ముకొన్నారో వారే, అమ్మే!!

    ReplyDelete
  2. కష్టంలో కూడా శ్రీహరిని స్మరిస్తున్నారు, మీరు త్వరగా బయటపడతారని ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. అన్యగామి గారు,

      అమ్మని నమ్మితే పీకలోతు కష్టం మోకాలి లోతులో దాటిపోతుందండీ. గత కొద్ది రోజుల అనుభవమే అది.
      తమ దయకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
      నెనర్లు.

      Delete

  3. ఏమండీ కష్టే ఫలే వారు,

    కుశలమే నా?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబి గారు,

      అమ్మ దయుంది.
      తమ దయకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
      నెనర్లు.

      Delete
  4. శర్మ గారికి నేను ఫోన్ చేసి కుశలం వాకబు చేశాను. పైన శర్మ గారు "కట్టుకున్నవారు, కడుపున పుట్టినవారు వేదన అనుభవిస్తుంటే ....... " అన్నారు చూసారా, అదే వారింట్లో ప్రస్తుత పరిస్ధితి అని తెలిసింది. ఆ అనారోగ్య బాధలనుండి త్వరగా ఉపశమనం లభిస్తుందని ఆశిద్దాము.

    ReplyDelete
    Replies
    1. VNR sir, Thank you for the update. I wish for Guruvu garu & family the best blessings of the Mother.

      Delete
    2. విన్నకోటవారు,
      మన చేతిలో ఏం లేదండి, అనుకున్నది అనుకున్నట్టుగా జరుగాలంటే అమ్మ దయ కావాలి.మీతో మాటాడిన తరవాత అలా జరగలేదు! ఆ రాత్రి పెద్ద ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు కష్టం మోకాలి లోతులో ఉంది.
      తమ దయకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
      నెనర్లు.

      Delete
    3. YVR's

      విన్నకోటవారు,
      ఇంతమందిలో అమ్మ నా గురించి, నా కుటుంబం గురించి ఆలోచించింది. ప్రస్థుతం బండి నడుస్తోంది.
      తమ దయకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను.
      నెనర్లు.

      Delete
    4. విన్నకోట వారు, మీకు గురువు గారిని పలకరించే వీలుందని అర్థం అయ్యింది. వారికి కూడా మీ ఆనుపాను తెలిసే ఉంటాయి. తరచూ మీరు చక్కటి వ్యాఖ్యలు పెడతారు కానీ వేళకి చూసుకోకపోవటంతో మీకు సమాధానమివ్వలేకపోతున్నాను. ఈ విషయములో మీ సహాయానికి, గురువుగారి విషయం పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

      Delete