Sunday 27 August 2017

కష్టేఫలి


Gatlin&Usen Bolt

వందమీటర్ల పరుగుపందెం.

మొన్ననీ మధ్య జరిగిన అంతర్జాతీయ పోటీలో నెగ్గిన గాట్లిన్  మూడవ స్థానంలో నిలచిన పూర్వ విజేతకు కాలు వంచి వీరనమస్కారం చేశాడు. విజేత, పూర్వ విజేతకు అనగా ప్రత్యర్ధికి నమస్కారం చేసిన అరుదైన సంఘటన.

వంద మీటర్ల పరుగు అంటే, గాలికంటే వేగంగా పరుగెత్తే ఉసేన్ బోల్ట్ పేరు ప్రపంచంలో తెలియనివారుండరు. ఇతను ఎంతో కాలంగా ఈ పరుగులో విజేత. ఇక నమస్కారం చేస్తున్న గాట్లిన్, ఉసేన్ బోల్ట్ తో తలపడి ఓడిపోతూ గెలుపుకోసం ఉత్ప్రేరకాలు వాడి పట్టుబడి నిషేధం ఎదుర్కున్నవాడు. మొన్నటిసారి మళ్ళీ తలపడ్డారు. అప్పుడు ఉసేన్ మరొకరు పక్కపక్కన పరుగుపెట్టేరు, ఈ గాట్లిన్ దూరంగా పరుగు పెట్టేడు. పరుగయింది, ఉసేన్ ఓడినట్టు పక్కతను నెగ్గినట్టుగా కనపడింది, కాని దూరంగా పరుగుపెట్టిన గాట్లిన్ ని విజేతగా ప్రకటించారు. జనం గాట్లిన్ ని హేళన చేశారు కూడా, అతని పూర్వ చరిత్ర తెలిసి. నిర్వాహకులు గాట్లిన్ విజేతగా ప్రకటించారు. ఆ తరవాత జరిగినదీ సంఘటన. గాట్లిన్ తన చిరకాల ప్రత్యర్ధి ఉసేన్ బోల్ట్ కి ఇలా వీర నమస్కారం చేసేడు. ఎందుకు చేసేడు ఈ నమస్కారం?

నీ మీద నెగ్గాలని తప్పు దోవన పడ్డాను, నిన్ను చూసి, నీ కఠిన పరిశ్రమ చూసి స్ఫూర్తి పొంది విజేతనయ్యా! నీవు నిజంగా వీరుడివి అన్నదే ఈ నమస్కారానికి అర్ధం . కష్టేఫలి, విజయానికిదే దగ్గర దారి.

8 comments:


  1. కష్టే ఫలీ! జిలేబీ !
    స్ప్రష్టంగా విజయమునకు సంవరణమదే!
    ఇష్టంగా పని జేయ న
    భీష్టము లెల్ల నెరవేరు బిగువుల తోడన్ !

    జిలేబి

    ReplyDelete
  2. జిలేబి గారు,
    స్ప్రష్టంగా :) :)
    నెనర్లు

    ReplyDelete
    Replies

    1. స్పష్టంగా మరీ తెలిసి పోతావుంది "ర" గడల కాల మని :)

      నెనర్లు సవరణకు :)

      నారదా ! రగడస్య రగడః
      జిలేబి నామ్యా జగణః :)

      చీర్స్
      జిలేబి

      Delete
    2. Zilebiగారు,
      జగణమూ కాదు,జగడమూ కాదు, జాణతనం
      నెనర్లు

      Delete
  3. ఇదెంతో ముదావహం‌ శర్మ గారూ. మర్యాదలు లోపిస్తున్న ఆధునిక సమాజంలో ఇటువంటి సంఘటనలు అమూల్యమైనవి, ముఖ్యంగా యువభావితరాల వారికి.
    కం. వీరత్వపు విలువేమో
    వీరునకే తెలియు గాన వీరుడు గాట్లిన్
    వీరాగ్రణి బోల్టున కీ
    తీరున తా మ్రొక్కి నాడు దేవుడు మెచ్చన్
    సంతోషం.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారు,
      బాధలోనూ వేదనలోనూ ఉన్నా!
      ఆకటి వేళల అలపైనవేళల ఓ పినంత హరినామమేదిక్కు మరి లేదు.

      గాట్లిన్ ఎందుకు ఓడిపోయినవాడికి, ప్రత్యర్ధికి నమస్కారం చేశాడో తెలియాలంటే సంస్కారం కావాలి. గొప్పతనన్ని గుర్తించడానికి కూడా ఎంతో కొంత గొప్పతనం కావాలి :) అదేలోపిస్తున్నరోజులు :)
      నెనర్లు

      Delete
  4. సంస్కారంతో పాటు పబ్లిక్ గా అటువంటి పని చేసే ధైర్యం కూడా ఉండాలి. అవి రెండూ గాట్లిన్లో పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అతన్ని అభినందించాలి 👏.

    ReplyDelete
    Replies
    1. మిత్రులు విన్నకోటవారు,

      ఉసేన్ నుంచి నేర్చుకున్న సంస్కారంలో భాగమే కనక ధైర్యంగా అందరిలో వీర నమస్కారం చేసి, ఉసేన్ గొప్ప చాటేడు, తనగొప్పా చాటుకున్నాడు. :)
      నెనర్లు.

      Delete