Wednesday 1 February 2017

అరణ్య న్యాయం

అరణ్య న్యాయం

అదో పెద్ద అరణ్యం,పులొకపక్కా,సింహమొకపక్కా రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నాయి. వీటిది చిరకాల వైరం,కారణం ఎడ్డెం అంటే తెడ్డెం అనడమే! ఇద్దరిదీ ఒకమాటే చిన్నవాళ్ళ దగ్గరకొచ్చేటప్పటికి. ఇదంతా అధికారం కోసం పెనుగులాటే అనేది చిన్న జంతువులకి తెలుసు, కాని నోరిప్పి చెప్పలేవు. సింహం పక్క కొన్ని నక్కలు,చిరుతలు,తోడేళ్ళు ఉన్నాయి. అలాగే పులికిన్నీ!

ఏమైందోగాని, అందరూ పల్లకీ ఎక్కేవాళ్ళే, మోసేవాళ్ళు లేక పులి రాజ్యంలో కలకలం పుట్టింది, రాజ్యం ముక్కలైంది, ఐనా పులి పులిగా కాకుండా పంథా మార్చుకు బతుకుతోంది. ఏమైనా పులి ప్రాముఖ్యాన్ని సింహం గుర్తించకాపోలేదు.

సింహం రాజ్యంలోకి ఎలకలు ప్రవేసిస్తున్నాయని సింహం కట్టుదిట్టం చేస్తున్నట్టు హడావుడి చేస్తోంది,దీనికి పులి సలహా, సహాకారాలున్నాయని పుకారు. కాదు పులి,సింహం రెండూ కలిసిపోయాయనే ఒక వాదు.

ఈ మధ్యలో ఒక ఏనుగు,దీనికి నల్లమందు పట్టెక్కువ, నిద్రలోంచిలేచింది ఈ మధ్యే!అరణ్యాన్ని తన అధీనంలోకి తెచ్చుకోవాలనే కొత్త ఆశ. దీనికి పక్కనే ఒక చిరుత. చిరుతకీ ఏనుక్కీ పడిచావదు చాలా కాలంగా.

అసలు పులి,సింహం ఎందుకు కలుస్తున్నాయి? ఇదీ అసలు సంగతి. ఎలుక అటు సింహాన్ని,ఇటు పులినీ కూడా చికాకు పెడుతోంది.ఎలుక అరణ్యాన్ని ఏలేద్దామనుకుంటోంది,ఎలుక ఎలుకలా బతకకపోవడంతో ఈ తిప్పలొచ్చాయి, ఒక్క సారిగనక ఎలుకని బొరియలోంచి బయటికి లాగితే పులికి సింహానికి దాన్ని మట్టి కరించడం తేలిక. అలాచేస్తే ఎలుక బొరియలో ఉన్న అపార ధనరాశిని ఇద్దరూ పంచుకోవచ్చు.  ఏనుక్కి సావకాశం ఉంటుందా అన్నదే మిలియన్ డాలర్ కొచ్చను

4 comments:



  1. ఏమాయెనో జిలేబీ
    మా మాచన యొజ్జ యడవి మర్మ కథలన
    న్నోమారుతలచె నోయీ !
    రామా ! యేనుగు తయారు రథమెక్కుము ,రా :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebiగారు, ఈ మధ్య రాయడమే లేదు,ఏదో అనిపించి గిలికా మళ్ళీ నిన్న అప్పటికప్పుడు
      ధన్యవాదాలు.

      Delete

    2. ఏమండోయ్

      ఇంతకీ ఏనుగు రాముల వారిదేనా ?

      జిలేబి

      Delete
    3. సింహం,పులి,ఎలుక బాగానే పోల్చుకున్నారు గాని ఏనుగు దగ్గరే! కొంచం హింట్ ఇచ్చాగాని సరిపోలేదనుకుంటా...నల్లమందు పట్టు...నిజానికది ఏనుగు కాదు గాడిద

      Delete