Friday 25 November 2016

పగటి కల



కరన్సీ దాచేవాళ్ళ మీద కేసు ఆ తరవాత జైలుశిక్ష, బినామీ అస్థులున్నవాళ్ళ మీద కేసు జైలుశిక్ష, బినామీ అస్థులు దాచినవాళ్ళమీద కేసు జైలుశిక్ష, దొంగతనానికి కేసు జైలు శిక్ష, ఇల్లా అన్నిటిలోనూ ఐదేళ్ళు నుంచి పదేళ్ళు కఠినకారాగార శిక్షలే కనపడుతున్నాయి, ఏ పేపర్లో చూసినా దేనికి చూసినా! ఆహా! దేశం ముందుకుపోతోందే!! అనుకుని ఉయ్యాలలో కూచున్నా!!! తెల్లారుగట్ల నాలుక్కి లేచానేమో; వెధవలవాటు, తప్పటంలేదు, 75 ఏళ్ళు దాటినవాళ్ళు ఇలా తెల్లరుగట్లే లేచి బ్లాగు గట్రా అని ప్రజల బుర్ర తినకుండా, శీతాకాలంలో కూడా, శిక్షలేస్తే బాగుణ్ణు అనుకుంటూ......పగటి కునుకులోకి జారిపోయా!

మా సత్తిబాబు కనపడ్డాడు, హడావిడి పడిపోతూ!! సత్తిబాబూ బినామీ చట్టం అంటున్నారు, శిక్షలంటున్నారు నీకేం తెలుసా? జాగర్తా! శిక్ష ఎన్నేళ్ళు... అడుగుతూనే ఉన్నా అనుమానాలు. మా సత్తిబాబు వస్తున్ననవ్వును ఆపుకుని ఆగండి అని చెయ్యి చూపిస్తూ ఆగలేక పడిపడీ నవ్వేశాడు, కాసేపటికి తేరుకుని...

ఈచట్టం ఎప్పడిదీ దగ్గరగా ముఫ్ఫై ఏళ్ళది, ఎందుకాపేశారూ, బొక్కలున్నాయని, ఇప్పుడీ బొక్కలు సద్దేశాం అంటన్నారు, మంచిదే  ఎక్కడచూసినా ఈ పన్లు చేసేవాళ్ళు విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారే, అసలు ఇంతకీ ఈ కేసులెప్పుడు పెడతారు, ఎప్పటికి ఇవి తేలతాయి, శిక్షలు ఎప్పుడమలు చేస్తారు? అసలు జడ్జీలు లేరు,  కోర్టు భవనాలే లాకేత్వం, జడ్జీగారు బెంచ్ మీద భయం,భయంగా కూచుంటారు,నిమిషానికోసారిస్లాబ్ కేసి చూస్తూ.   ఎప్పుడు  నెత్తిన స్లాబ్ పెచ్చూడి పడుతుందోననే భయంతో, కేసు వింటుంటారు. జడ్జీలనే నియమించకున్న ప్రభుత్వాలు, ఎప్పటికి తేలతాయబ్బా ఈ కేసులు :) అన్నట్టు మరచిపోయా ఎవరిమీద కేసులెడతారు? కేసులు పెట్టేందుకు మనుషులున్నారా? సిబ్బందేదీ? ఉన్న పోలీసులు ఎస్కార్ట్ లకే సరిపోటంలా :) మరోమాటండి సాచ్చికాలేవీ? వీడియోలు సాచ్చికాలున్న కేసులే ఎగిరిపోతన్నాయి :) అంటుంటే, సత్తిబాబూ నీది మరీ అన్యాయమయ్యా! మరీ అలామాటాడకూ అంటూంటే ఇల్లాలొచ్చి ”ఏంటీ అలా మాటాడకూ అంటున్నారు, పగటికలా? సంబడం సరేగాని లేవండి భోజనాని”కంది.

2 comments:


  1. రాముని వానర సేన వస్తోందండీ 'దండన' నివ్వ డానికి :)

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబీజీ,

      అజీర్తి చేస్తే పగటి కలలొస్తాయిట.
      ధన్యవాదాలు.

      Delete