Thursday 24 November 2016

రామరాజ్యం

రామరాజ్యం

రామరాజ్యం భరతుని పట్టం అంటారు. ఇదో పుక్కిటి పురాణం దీనికేం అధారం లేదు, జనశ్రుతంగా చెప్పుకునేదే!

రాముడు అడవులకెళ్ళేడు,రాజ్యం వదిలేసి, తండ్రి పినతల్లికిచ్చిన మాట నిలబెట్టడానికి. మేనమామలింట ఉన్న భరతునికి కబురెళ్ళితే పరుగు పరుగున వచ్చాడు, భరతుడు. అయోధ్య వచ్చిన తరవాత తెలిసింది విషయం. తండ్రికి అంత్య క్రియలు చేశాడు, రాముని వద్దకు బయలుదేరాడు, తిరిగొచ్చి రాజ్య పాలన చేపట్టమని అడగడానికి. రాముడు ఒప్పుకోలేదు,గడువులోగా తిరిగిరావడానికి, భరతుడు పాదుకలడిగి తెచ్చాడు,వాటికే పట్టాభిషేకమూ చేశాడు, తను నంది గ్రామంలో ఉండిపోయాడు, అయోధ్యలో కాక.

పరిపాలన అక్కడినుంచే చేశాడు. పన్నులు కట్టినవారి పుణ్యం అడిగినవారు లేరట. పదునాలేగేళ్ళూ చెల్లిపోయాయి, రాముడు తిరిగొచ్చాడు, కోశాగారం నిండుకుంది. హనుమ బయలుదేరారట పన్నులు వసూలుకు, పదునాలుగేళ్ళుగా పన్నులు కట్టవలసినవారి వద్దకు. ఎంత కట్టాలి? ఒక గుమ్మడికాయను కొలమానంగా పెట్టుకుని దానెత్తు బంగారం పన్నుగా వసూలు ప్రారంభించారట హనుమ. ఎక్కువ కట్టవలసినవారి దగ్గర ఎక్కువా, తక్కువ కట్టవలసినవారి దగ్గర తక్కువా బరువు తూగేదట గుమ్మడికాయ.....

ఇటువంటి ఏర్పాటు ఉంటే బాగుండేదేమో మనదగ్గర కూడా... ఈ బ్లాక్ మనీ గోల వగైరా ఉండేది కాదేమో...

12 comments:

  1. ఇప్పటివరకూ గుమ్మడి కాయ దీనికి రివర్స్ లో తూగిందండి. ఇక ముందు ఏం చేస్తుందో చూడాలి.��

    ReplyDelete
    Replies
    1. YVR's అం'తరంగం' yvrsthoughts
      ఏ నిమిషానికి ఏమి జరుగునో....తెలీటం లేదండి. :)
      ధన్యవాదాలు

      Delete
  2. ఎవడి ఒంట్లో ఎంత కొవ్వు ఉందో, దానిని బట్టి పన్ను కట్టమంటే సరిపోతుంది.

    ReplyDelete
    Replies
    1. bonagiri గారు,
      ఇది కొంచం అన్యాయమేమో ఆలోచించండి :) కాదంటే అలాగే ఓకె :)
      ధన్యవాదాలు

      Delete
    2. "అలాగే ఓకే" ఎలాగండి? సన్నగా రివటలా ఉండే వాళ్ళు తేలికలో బయటపడతారుగా, కుదరదండి 😀😀.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు గారు,
      ఐతే ఓకె మీ మాటే ఖాయం :)
      ధన్యవాదాలు.

      Delete

  3. ఆ గుమ్మడి కాయ ని దొంగెవడో కాజేసాడట :)

    మీ కేమైనా తెలుసా ఎవరి దగ్గరుందో ?

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. జిలేబిజీ
      ఎక్కడుందో తెలిసినా తెచ్చుకోలేని చోటుంది :)
      ధన్యవాదాలు.

      Delete
  4. ఈ రోజుల్లో గుమ్మడి కాయని కొలమానంగా పెట్టుకోవాలంటే - గుమ్మడి కాయలు కాయించేవారున్నా - వాటిని కాయించడానికి సరిపడా నీళ్లు వున్నాయాండీ ఇంకా?

    ReplyDelete
    Replies
    1. లలిత గారు,
      నీళ్ళున్నా అన్నదమ్ముల పంపకాలు తేలక గుమ్మడి కాయలు కాయించులేకపోతున్నాం :)
      ధన్యవాదాలు.

      Delete
    2. నీళ్ళ "పంపకాలు తేలక" ........
      రావణకాష్ఠం కదా శర్మ గారు, ఏ కాలానికి తేలేను 🙁 !

      Delete
    3. విన్నకోట నరసింహా రావుగారు,
      అదంతేనండి. మా మాట పైనుండాలి, ఇదే కావలసినది. జలాలు ఉన్నవి, ఇద్దరం పొదుపుగా వాడుకోవాలనే ధ్యాసకంటే ఇదే ఎక్కువ, ఏం చేస్తాం :)
      ధన్యవాదాలు

      Delete