Wednesday, 13 May 2015

శర్మ కాలక్షేపంకబుర్లు-కంద పెసరట్టు

కంద ఎరగనివారుండరని నా నమ్మకం. కందలో రెండు రకాలు. పాటి కంద, తియ్యకంద. ఈ పాటికంద అంటే దేశవాళీ కంద, ఇది దురద పుట్టిస్తుంది, ఉడికినా కూడా, ఇక తియ్య కంద మనకి మార్కెట్ లో దొరికేదే! ...................continue at కష్టేఫలే

6 comments:

  1. మా ఇంట్లో పచ్చి కంద ముక్కలే పెసల్లో వేసి రుబ్బుతారండీ.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. శిశిర గారు,
    మీ దర్శనమే మహా భాగ్యం. వర్డ్ ప్రెస్ బ్లాగులవాళ్ళమూ మంచివాళ్ళమేనండి…:)<<<<

    హహ్హహ్హ.. శర్మగారూ.. శిశిర ప్రక్కన ఆ గారు తీసేయండి ముందు. పెద్దవారు. దీవించాలి కానీ మన్నించకూడదు.
    నేను మీ బ్లాగుని రోజూ దర్శిస్తూనే ఉంటానండీ. వర్డ్‌ప్రెస్ బ్లాగులో కామెంట్ వ్రాయగలగడం నా శక్తికి మించిన పని. అందుకే మా బ్లాగ్‌స్పాట్‌లో దొరికారు కదా అని ఇక్కడ పలకరించా. :)

    ReplyDelete
    Replies
    1. ఏంటో ఎలా మొదలెట్టాలో తెలీటం లేదు, ఇటువంటి పరిస్థితి ఇదివరలో కలగలేదు,

      చిరంజీవి శిశిర,

      మనపరిచయమే బహు తక్కువ కదా! అందుకు గారు అని సంబోధించాను. గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనేది నా అభిలాష, ఎప్పుడూ. ఆత్మీయులని సంబోధించడానికి ఇబ్బంది ఉండదు, మరి అంతటి ఆత్మీయత మనకిదివరలో లేకపోయింది :)
      ఇప్పుడు చెప్పడంతో ఆత్మీయత పెరిగింది:) చిరంజీవికి ఆశీర్వచనం, "దీర్ఘాయుశ్మాన్భవ"

      వర్డ్ ప్రెస్ బ్లాగుల్లో చాలామంది కామెంట్ రాయరు, ఎందుకోనాకు తెలుసు. అదొక వరమూ శాపమూ కూడా. అనవసరం కామెంట్లు రావు మాకు,అదే వరం, కాని మీలాటి ఆత్మీయులు కూడా మమ్మల్ని భయంగా చూడటం బాధనిపిస్తుంది, ఇది శాపం. నాకు నూట ఏభయి మంది కామెంట్ ఫాలోయర్స్ ఉన్నారు, ఏ ఒక్కరిని భయపెట్టలేదు సుమా :) శిశిర కూడా భయపడక్కరలేదు.

      నా మనసు విప్పడానికి సావకాశం ఇచ్చినందుకు, మీ ఆత్మీయతకి

      ధన్యవాదాలు.

      Delete
  4. భయం కాదు శర్మ గారూ. 2009 లో అనుకుంటా బ్లాగుల్లోకి వచ్చాను. వచ్చిన కొత్తల్లో వర్డ్‌ప్రెస్ బ్లాగుల్లో ఒకటి రెండు కామెంట్లు రాశాను. ఆ శల్య పరీక్ష నచ్చలేదు. అంతే. అప్పటి నుండి బ్లాగర్ బ్లాగుల్లో తప్ప కామెంట్లు వ్రాయడం మానేశాను. మిమ్మల్ని బ్లాగర్ లో చూసి మాత్రం చాలా ఆనందించాను. అప్పుడప్పుడైనా మాట్లాడవచ్చని :)

    మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. నమస్సులు.

    ReplyDelete
    Replies
    1. శిశిర గా...పొరపాటు చిరంజీవి శిశిర,

      "ఎవరో జ్వాలను రగిలించారు, మరియెవరో దానికి బలిఐనారు" ఒక అభ్యర్ధన, నాకోసం ఆ నిబంధన కొద్దిగా సడలించరాదా :) ప్లీస్,ప్లీస్, ప్లీస్,
      "రండి రండి రండి దయచేయండి తమరిరాక మా కెంతో సంతోషం సుమండీ"
      వర్డ్ ప్రెస్ బ్లాగులూ కామెంట్లూ ఆగ్రిగేటర్లలో కనపడక బ్లాగ్ స్పాట్ ని కూడా ఆశ్రయించా, వర్డ్ ప్రెస్ లో రాయడమంటేనే మక్కువ మరి.. "అర్ధం చేసుకోరూ..."(భాను ప్రియ)
      ధన్యవాదాలు.

      Delete