17, జనవరి 2017, మంగళవారం
16, జనవరి 2017, సోమవారం
మా గ్రామ దేవత వీరుళ్ళమ్మ
మా గ్రామ దేవత వీరుళ్ళమ్మ, పేరు చిత్రంగా ఉందా? నిజమే! అమ్మవారు చేతిలో కత్తితో, ముఖంలో కరుణతో ఉంది.
వీరత్వం సూచించే కత్తితో అరివీరభయంకరంగా ఉంటుంది, మాకు మాత్రం చల్లని తల్లి.. తల్లి వీరులను కన్నతల్లిగా భావించి, అరివీరభయంకరంగా ఉండే కత్తితో దొరికింది కనక వీరుళ్ళమ్మ అని నామకరణం చేశారు. పుట్టని తల్లికి నామకరణం....అదీ అమ్మ గొప్ప..

15, జనవరి 2017, ఆదివారం
14, జనవరి 2017, శనివారం
13, జనవరి 2017, శుక్రవారం
11, జనవరి 2017, బుధవారం
10, జనవరి 2017, మంగళవారం
7, జనవరి 2017, శనివారం
4, జనవరి 2017, బుధవారం
కాటుక కంటి కాటు
పాము, తేలు కాటేస్తాయ్! మందుంది
కుక్కకాటుకి మందుంది.
మనిషి కాటుకి మందులేదు
డబ్బు పిచ్చి మనిషి కాటేస్తే
మందే లేదు
కన్ను కాటేస్తే?
కన్ను కాటేస్తుందా?
కాటుక కన్ను కాటేస్తే
మథురమా?మందుందా?
ఇలాఒక విషయం మీద కత రాయమంటే దంతుర్తి శర్మగారో కత రాశారు, ఇక్కడ చూడండి.
శ్రీ వినాయకా లాండ్రీ సర్వీస్ - http://eemaata.com/em/issues/ 201701/9749.html కిందటి నెలలో
కాటుక కంటి కాటు పై కథ,కవిత చెప్పగలరా?
కుక్కకాటుకి మందుంది.
మనిషి కాటుకి మందులేదు
డబ్బు పిచ్చి మనిషి కాటేస్తే
మందే లేదు
కన్ను కాటేస్తే?
కన్ను కాటేస్తుందా?
కాటుక కన్ను కాటేస్తే
మథురమా?మందుందా?
ఇలాఒక విషయం మీద కత రాయమంటే దంతుర్తి శర్మగారో కత రాశారు, ఇక్కడ చూడండి.
శ్రీ వినాయకా లాండ్రీ సర్వీస్ - http://eemaata.com/em/issues/
కాటుక కంటి కాటు పై కథ,కవిత చెప్పగలరా?
1, జనవరి 2017, ఆదివారం
29, డిసెంబర్ 2016, గురువారం
25, డిసెంబర్ 2016, ఆదివారం
23, డిసెంబర్ 2016, శుక్రవారం
ఇంతనాడు లేదు,
ఇంతనాడు లేదు, అంతనాడు లేదు,సంత నాడు పెట్టింది, ముంతంత కొప్పు
https://youtu.be/ewhRWuGbl8Q
19, డిసెంబర్ 2016, సోమవారం
సమానంగా తిందాం.
''నువ్వు పప్పు పట్రా,నేను పొట్టు తెస్తా, గుళ్ళో కూచుని కలిపి ,ఊదుకుని సమానంగా తిందాం'',
15, డిసెంబర్ 2016, గురువారం
13, డిసెంబర్ 2016, మంగళవారం
ఆక్రోశం
ఆక్రోశం
సామీ! ఎంకన్న బాబూ!! దయలేదా!!!
పొద్దుటే లేస్తాను,
నీ మొహం చూస్తాను.
పొన్నకాయలా గుండు కొట్టిస్తాను.
తలనీలాలు నీకే ఇస్తాను.
నీకు తిరునామం పెట్టిస్తాను.
నేను నామం పెట్టుకుంటాను.
ప్రజలికి ఎగనామం పెట్టిస్తాను.
నడిచేదంతా నిజమనిపిస్తాను.
నిన్నే దైవంగా కొల్చుకున్నాను.
ప్రతాదివారం నీ కొలువుకొస్తాను.
భక్తి శ్రద్ధలతో ఉపవాసముంటాను.
పొర్లు దండాలు పడిపడీ పెడతాను.
నాకు తోచినప్పుడల్లా చేయించాను
నీకు బంగారు కిరీటాలూ,బాల తొడుగులు
వరద ముద్రలు,అభయ ముద్రలు
తిరునామాలు, మణిహారాలు.
ఎందుకొచ్చిందయ్యా కోపం చెప్పు?
దేశం లో ఉన్నవాణ్ణి ఒక్కణ్ణేనా చెప్పు
అందరినీ వదిలేసి నాకే ఎందుకు చెప్పు
కష్టాలూ, కన్నీళ్ళూ, నీకవుపించలేదా చెప్పు.
నా ఒక్కడి దగ్గరే ఉందా చెప్పు
చిన్న తల్లి లేనిదెవరిదగ్గర చెప్పు
దొరకనివాళ్ళంతా దొరలేనా చెప్పు
ఎవరెవరి దగ్గరెంతుందో తెలియదా చెప్పు.
పిలవకుండానే పలికేవారు అంతా
నేడు వీళ్ళకేమయైంది ఇదో వింతా
చిన్నమ్మ పలుకుతోనే ఉందా అంతా
నీకూ ఉందనుకుంటా అనుభవం సుంతా
దానికేంగాని మనలో మనమాటా
ఇందులో ఫిఫ్టీ ఫీఫ్టీ నీ వాటా
ఇలా కానీవయ్యా ఈ సారికంతా
విప్పవయ్యా ముడి నీకిదెంతా
కాదంటావా చెప్పు లేదు తంటా
కాదంటే చెప్పేస్తా నీకు టాటా
చూసుకుంటా మరో మరో చోటా
ఇదిగో ఇదిగో ఇదే ఆఖరు మాటా
11, డిసెంబర్ 2016, ఆదివారం
తిడతాం! తిట్టడం మా జన్మ హక్కు!!!
మొన్నటిదాకా వాళ్ళని తిట్టేం! నిన్నటినుంచి వీళ్ళనీ తిడుతున్నాం!!, పని చేయకపోతే తిడతాం! పని చేస్తే తిడతాం!! తిట్టడం మా జన్మ హక్కు!!! ఉంగరాల వేళ్ళవాళ్ళంటే ఇష్టం.
9, డిసెంబర్ 2016, శుక్రవారం
బంగారం
బంగారం చలామణీ....
మొన్న మా వెంకటేశం కనబడ్డాడు. అబ్బో! బాగ ఎదిగిపోయాడు, ఉపన్యాసాలూ ఇస్తున్నాట్ట. ఖాళీ గా ఉన్నా కదా, ఏదేనా ఒక విషయం మీద ఉపన్యాసం ఇమ్మంటేనో అనుకుని ”ఏం వాయ్! వేంకటేశం ఏంటి సంగతులు” అన్నా! దానికోసమే ఎదురు చూస్తున్నట్టున్నాడు ఇలా చెప్పేడు.
మా గురువుగారెప్పుడో The eleven causes for the degeneration of India లో చెప్పేరు ”భారద్దేశంలో ఆర్ధిక సంస్కరణలేవీ పని చెయ్యవూ" అని, మీరెవరూ వినరు. మేథావులనీ దేశం ఎప్పుడు గుర్తించింది గనక...
బంగారం తో అనుబంధం, కోరిక భారతీయులకు ఈనాటిదా? పురాణ కాలం నాటిది కదూ? భారతీయ మహిళకీ బంగారానికి విడతీయలేని అనుబంధం. చిన్నమెత్తు బంగారం కూడా లేని భారతీయ మహిళ కనపడితేనే విచిత్రం.
ఇదెందుగ్గాని, నేడు బంగారమే మళ్ళీ అక్కరకొచ్చింది కదా! చలామణీ కి. బంగారాన్ని నాణేలుగా వేయడం ఈ నాటి అలవాటేం కాదు. ఇప్పుడైతే అరగ్రాము,గ్రాము,రెండు గ్రాములు,మూడు గ్రాములు, ఐదు గ్రాములు, పదిగ్రాముల నాణేలు బాగా దొరుకుతున్నాయి, చలామణీలో ఉన్నాయి. ఇదెందుకో తెలుసా? ఒకప్పుడు పచ్చనోటు చేతిలో పడితేగాని పనయ్యేది కాదు, కాలం మారి అది ఎర్రనోటు స్థాయికి పెరిగింది. ఇప్పుడేమో ఎర్రనోటు చిత్తుకాయితమైపోయింది. ”ఇరుసున కందెనబెట్టక పరమేశుని బండియైన బారదు సుమతీ” అన్న మాట ఉన్నదే! ఎప్పటికి చెక్కుచెదరని దుందిగదా! ఇప్పుడక్కరకొచ్చింది పసిడి. అరగ్రాము పదేనువందలు, అమ్మేవాడు చిల్లర ఇబ్బందిలేకుండా రెండు వేల నోటు తీసుకుంటున్నాడు, చూశావా ఎంత సౌకర్యమో! దీన్నిలాగే పట్టుకుపోతే! పనెంత క్షణాల మీదైపోలా! ఇప్పుడు పుచ్చుకునేవాడిదే కావాలంటున్నాడు, ఎందుకో తెలుసా! ఎ.సి.బి వాళ్ళ భయంలేదు, దాచుకోడానికి పేంటుకు దొంగజేబులు కూడా కుట్టించేసేరు, కొత్తగా, లేదా డెస్క్ లో కాయితాలో పారేస్తే పరమేశ్వరుడు కూడా పట్టుకోలేడు. విలువా పెరిగింది కదూ అద్దిరబన్న! బాగుందోయ్ బాగుంది.
నువ్వేదో నల్లధనం వగైరా అంటున్నవుగాని దానికి ఓ మంచిపేరుందిగదా! అదే ”సమాంతర ఆర్దిక వ్యవస్థ” ఇప్పుడిందులో చెల్లుబాటూ, చెల్లింపులూ అంతా బంగారమే, దీనికీ హవాలా పుట్టేసింది.
''మనదేశంలో ఆర్ధిక సంస్కరణలా? చాల్లేవోయ్!మనవాళ్ళంతా మేథావులోయ్'' అంటూ వెళిపోయాడు, మా వెంకటేశం

8, డిసెంబర్ 2016, గురువారం
ఏడు కరువులు
ఆశమ్మ:- వదినా ఏడు వరస కరువులొస్తాయిట
బోశమ్మ:- పోనీలే వదినా! మొదటి కరువుకే చచ్చిపోతే మిగిలిన 6 కరువులు నన్నేం చేస్తాయిట.
6, డిసెంబర్ 2016, మంగళవారం
4, డిసెంబర్ 2016, ఆదివారం
2, డిసెంబర్ 2016, శుక్రవారం
అందరూ నల్లోళ్ళే! ఎంతో కొంత
అందరూ నల్లోళ్ళే ఎంతో కొంత. అదెలా?
కారు డ్రైవరుకి జీతవెంతిస్తున్నారు?
ఐదువేలు.
ఎంతరాసుకుంటున్నారు?
ఉష్..అడగద్దు... ఎనిమిదో పదో రాసుకోడం అలవాటూ...ఉద్యోగాలిచ్చేవాళ్ళంతా చేసేదిదే!
ఇప్పుడు జీతమివ్వాలి. కేష్ లెస్, అక్కౌంట్లో ఎంతేస్తారూ?
చిన్న కిరాణా షాపునుంచి పెద్ద మాల్ దాకా, పెద్దోళ్ళనుంచి మరోళ్ళ దాకా ఇంతే తంతు. ఈ నెల నుంచి జీతాలెలా ఇస్తారు? చూడాల్సిందే :)
ఇల్లు అద్దెకిచ్చాం రశీదెంతకిస్తున్నాం?, అసలిస్తే సుమా!
లెక్కేస్తే ఎన్నో!
खतरा खतरा दरिया बन जाती है
చుక్క చుక్కా సముద్రం
30, నవంబర్ 2016, బుధవారం
29, నవంబర్ 2016, మంగళవారం
నిలబడితే కలబడుతుంది
నిలబడితే కలబడుతుంది, కలబడితే నిలబడుతుంది, ఏంటది?
26, నవంబర్ 2016, శనివారం
సిరివెన్నెల
|
25, నవంబర్ 2016, శుక్రవారం
పగటి కల
కరన్సీ దాచేవాళ్ళ మీద కేసు ఆ తరవాత జైలుశిక్ష, బినామీ అస్థులున్నవాళ్ళ మీద కేసు జైలుశిక్ష, బినామీ అస్థులు దాచినవాళ్ళమీద కేసు జైలుశిక్ష, దొంగతనానికి కేసు జైలు శిక్ష, ఇల్లా అన్నిటిలోనూ ఐదేళ్ళు నుంచి పదేళ్ళు కఠినకారాగార శిక్షలే కనపడుతున్నాయి, ఏ పేపర్లో చూసినా దేనికి చూసినా! ఆహా! దేశం ముందుకుపోతోందే!! అనుకుని ఉయ్యాలలో కూచున్నా!!! తెల్లారుగట్ల నాలుక్కి లేచానేమో; వెధవలవాటు, తప్పటంలేదు, 75 ఏళ్ళు దాటినవాళ్ళు ఇలా తెల్లరుగట్లే లేచి బ్లాగు గట్రా అని ప్రజల బుర్ర తినకుండా, శీతాకాలంలో కూడా, శిక్షలేస్తే బాగుణ్ణు అనుకుంటూ......పగటి కునుకులోకి జారిపోయా!
మా సత్తిబాబు కనపడ్డాడు, హడావిడి పడిపోతూ!! సత్తిబాబూ బినామీ చట్టం అంటున్నారు, శిక్షలంటున్నారు నీకేం తెలుసా? జాగర్తా! శిక్ష ఎన్నేళ్ళు... అడుగుతూనే ఉన్నా అనుమానాలు. మా సత్తిబాబు వస్తున్ననవ్వును ఆపుకుని ఆగండి అని చెయ్యి చూపిస్తూ ఆగలేక పడిపడీ నవ్వేశాడు, కాసేపటికి తేరుకుని...
ఈచట్టం ఎప్పడిదీ దగ్గరగా ముఫ్ఫై ఏళ్ళది, ఎందుకాపేశారూ, బొక్కలున్నాయని, ఇప్పుడీ బొక్కలు సద్దేశాం అంటన్నారు, మంచిదే ఎక్కడచూసినా ఈ పన్లు చేసేవాళ్ళు విచ్చలవిడిగా రోడ్ల మీద తిరుగుతున్నారే, అసలు ఇంతకీ ఈ కేసులెప్పుడు పెడతారు, ఎప్పటికి ఇవి తేలతాయి, శిక్షలు ఎప్పుడమలు చేస్తారు? అసలు జడ్జీలు లేరు, కోర్టు భవనాలే లాకేత్వం, జడ్జీగారు బెంచ్ మీద భయం,భయంగా కూచుంటారు,నిమిషానికోసారిస్లాబ్ కేసి చూస్తూ. ఎప్పుడు నెత్తిన స్లాబ్ పెచ్చూడి పడుతుందోననే భయంతో, కేసు వింటుంటారు. జడ్జీలనే నియమించకున్న ప్రభుత్వాలు, ఎప్పటికి తేలతాయబ్బా ఈ కేసులు :) అన్నట్టు మరచిపోయా ఎవరిమీద కేసులెడతారు? కేసులు పెట్టేందుకు మనుషులున్నారా? సిబ్బందేదీ? ఉన్న పోలీసులు ఎస్కార్ట్ లకే సరిపోటంలా :) మరోమాటండి సాచ్చికాలేవీ? వీడియోలు సాచ్చికాలున్న కేసులే ఎగిరిపోతన్నాయి :) అంటుంటే, సత్తిబాబూ నీది మరీ అన్యాయమయ్యా! మరీ అలామాటాడకూ అంటూంటే ఇల్లాలొచ్చి ”ఏంటీ అలా మాటాడకూ అంటున్నారు, పగటికలా? సంబడం సరేగాని లేవండి భోజనాని”కంది.
24, నవంబర్ 2016, గురువారం
రామరాజ్యం
రామరాజ్యం
రామరాజ్యం భరతుని పట్టం అంటారు. ఇదో పుక్కిటి పురాణం దీనికేం అధారం లేదు, జనశ్రుతంగా చెప్పుకునేదే!
రాముడు అడవులకెళ్ళేడు,రాజ్యం వదిలేసి, తండ్రి పినతల్లికిచ్చిన మాట నిలబెట్టడానికి. మేనమామలింట ఉన్న భరతునికి కబురెళ్ళితే పరుగు పరుగున వచ్చాడు, భరతుడు. అయోధ్య వచ్చిన తరవాత తెలిసింది విషయం. తండ్రికి అంత్య క్రియలు చేశాడు, రాముని వద్దకు బయలుదేరాడు, తిరిగొచ్చి రాజ్య పాలన చేపట్టమని అడగడానికి. రాముడు ఒప్పుకోలేదు,గడువులోగా తిరిగిరావడానికి, భరతుడు పాదుకలడిగి తెచ్చాడు,వాటికే పట్టాభిషేకమూ చేశాడు, తను నంది గ్రామంలో ఉండిపోయాడు, అయోధ్యలో కాక.
పరిపాలన అక్కడినుంచే చేశాడు. పన్నులు కట్టినవారి పుణ్యం అడిగినవారు లేరట. పదునాలేగేళ్ళూ చెల్లిపోయాయి, రాముడు తిరిగొచ్చాడు, కోశాగారం నిండుకుంది. హనుమ బయలుదేరారట పన్నులు వసూలుకు, పదునాలుగేళ్ళుగా పన్నులు కట్టవలసినవారి వద్దకు. ఎంత కట్టాలి? ఒక గుమ్మడికాయను కొలమానంగా పెట్టుకుని దానెత్తు బంగారం పన్నుగా వసూలు ప్రారంభించారట హనుమ. ఎక్కువ కట్టవలసినవారి దగ్గర ఎక్కువా, తక్కువ కట్టవలసినవారి దగ్గర తక్కువా బరువు తూగేదట గుమ్మడికాయ.....
ఇటువంటి ఏర్పాటు ఉంటే బాగుండేదేమో మనదగ్గర కూడా... ఈ బ్లాక్ మనీ గోల వగైరా ఉండేది కాదేమో...

21, నవంబర్ 2016, సోమవారం
ఆహా! ఏమి తెలివి
ఆహా! ఏమి తెలివి
మనదేశంలో భక్తి ఎంత ఉందో అంతా యుక్తీ ఉంది. ఒక పట్టణంలో అదో పెద్ద వీధి, వీధి చివర అక్కడో వినాయక విగ్రహం, ఎప్పుడో ఎవరికో ఆవేశం వచ్చి పెట్టేశారు. దానికో చిన్న ఆలయం, ఒక చిన్న హుండీ, ఒక ధర్మకర్తలమండలి, అన్ని హంగులూ ఉన్నాయి. వీటితో పాటు కోర్కెలు తీర్చే సిద్ధి వినాయకునికి ఒక బేంక్ అక్కౌంటూ ఉంది. ఈ ఆలనా పాలనా లేని గుడికి ఒక పూజారి, నెలకో రెండొందలిస్తే రోజూ వచ్చి విగ్రహం మీద కాసిని నీళ్ళుపోసి దీపం వెలిగించి, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టిపోతుంటాడు, రెండు పూటలా. చవితినాడు కాస్త హడావిడి చేస్తారు, బస్, మళ్ళీ మామూలే. ఈయనో ఊరూపేరూలేని పేద వినాయకుడు, ఎందుకంటే ఆయన హుండీలో సంవత్సరం పొడుగునా చూసినా ఐదు రూపాయలు పడవు, కాని ఆ హుండీకో మిల్లర్ తాళం, గట్టి గుంజక్కరలేకా ఊడొచ్చీదే!
ఇలా రోజూ దీపం పెట్టిపోతున్న పూజారికి హుండీ మూత కొద్దిగా తెరచి ఉంచినట్టనిపించింది, పూర్తిగా తెరచి చూచాడు, ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు, నోట మాటా రాలేదు,మనసుకి చైతన్యమూ పోయింది. ఏం చూశాడూ? ఎర్ర కట్టల పాములు హుండీ పట్టనంతగా ఉన్నాయి, అవే రద్దయిన వెయ్యి రూపాయలనోట్లు. ఇప్పుడేం చెయ్యాలో తోచక ధర్మకర్తల మండలికి ఫోన్ చేశాడు, పావుగంటలో చేరిపోయారంతా వార్త తెలిసి, ఎవరేశారు? తెలీదు. జనమే జనం స్వామి పట్ల ఆ భక్తుని కున్న భక్తిని కొనియాడుతూ. మండలి ఒక నిర్ణయం తీసుకుంది, ఈ సొమ్ము స్వామి పేర బేంక్ లో వెయ్యాలని, వేశారు. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.
తెరవెనక కథ చెప్పగలరా? :)

20, నవంబర్ 2016, ఆదివారం
కాలక్షేపంకబుర్లు-ఎంగిలిచేత్తో...
ఎంగిలిచేత్తో కాకిని కొట్టనివాడు, వీధులుకట్టి విస్తళ్ళేశాడట
18, నవంబర్ 2016, శుక్రవారం
14, నవంబర్ 2016, సోమవారం
11, నవంబర్ 2016, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)