18, ఏప్రిల్ 2026, శనివారం

పిలక కత్తిరింపు మహోత్సవం.

 పిలక కత్తిరింపు మహోత్సవం.

వేసవిలో తలపై జుట్టు చికాకుగా ఉందని నిన్న అంబష్టుడిని రమ్మాన్నా! గుండు గీస్తూ పిలక దగ్గర కొచ్చాడు. దాన్ని ముట్టుకోడు,ఎప్పుడూ. నేనే పిలక చిక్కుబడినట్టుంది,చూడు! అన్నా. ఉత్సాహంగా దాన్ని పట్టుకుని చూసి,చిక్కడిపోయిందండీ! చిక్కు రాదు అన్నాడు. 

ఎలా అన్నా! అదేమో జానడు పిలక. 

కత్తిరించక తప్పదండి తీసెయ్యనా! అంటే, వద్దు దాన్ని అలా వదిలెయ్యి,నేను చూసుకుంటా! అనడంతో,ఒక్కవేటు, తీసేస్తాకదండి అని ముందుకెళ్ళబోయాడు.నేనే తీసేస్తా! ఈ రోజుల్లో పిలక పెట్టుకునేవాళ్ళే లేరు,మాటల్లో నైనా శర్మగారి పిలక కత్తిరించేననక,ఉండలేవు,అంచేతా నేనే కత్తిరించుకుంటే సరిపోతుందిగా! అనగా ఊరుకుని మిగిలిన కార్యక్రమం పూర్తిచేసేడు. ఆతరవాయి నేను పిలకని పరిశీలించి,చిక్కు ముడి విప్పడానికి ప్రయత్నం చేసి విఫలమై చివరకి ముడిపైకి కత్తిరింపు మహోత్సవం విజయవంతంగా పూర్తి చేసేను. ఇప్పుడు చూస్తే బెత్తెడు పిలక మిగిలింది. అమ్మయ్యా,అనుకున్నా!  

 

శ్రీ వందేమాతరం రామచంద్ర రావుగారని ఒక రాజకీయనాయకుడు. ఈయన అసెంబ్లీలో ఉంటే ప్రభుత్వానికి,బయట ఉంటే అంటే ఓడిపోతే ఆయనపై నెగ్గినవాడికి దినదిన గండమే అనుకునేవారు. ఆయన మహామహులమీద పోటీ చేసి తనపై నెగ్గినవారందరిని కోర్టుకు ఈడ్చి నెగ్గి, పదవులు ఊడగొట్టినవాడు.  


శ్రీ కాసు బ్రహ్మానందరెడ్డిగారు, వీరిని తెలియనివారు ఉండరు, తలపై టోపీ లేకుండా ఎప్పుడూ కనపడలేదాయన. ముఖ్యమంత్రిగా ఉండగా సభలో టోపీ కనక సద్దితే ఎవరికో మూడిందని చెప్పుకునేవారు.    


ఇక మర్రి చెన్నారెడ్డిగారు, ఈయన చేతిలో ఎప్పుడూ ఒక కర్ర ఉండేది. దీనిపై చాల కతలున్నాయి. కర్రచెయ్యి మారితే అయినట్టే అని చెప్పుకునేవారు. అంతేకాదు  'నాట్ అప్రూవ్డ్',తరవాత కాలంలో 'నోట్ అప్రూవ్డ్' అవడాని ఒక  అక్షరం తేడా అనీ అనేవారు.


నిన్న వుమన్స్ బిల్లు వీగిపోయింది మూడిట రెండు వంతుల మజారిటీ లేక, మేం నెగ్గేం అంటే మేం నెగ్గేమంటున్నారు,ఇరువురూ. మరి చూసినవాళ్ళు స్వయం పిలక కత్తిరింపుకీ దీనికి పోలికుందా? అనుకుంటున్నారు.       

21 కామెంట్‌లు:

  1. పోలిక ఉన్నట్లే ఉందండీ :(

    నేనంటే నేనని‌ రెండూ పార్టీలు ప్రతీ ఎలచ్చన్లోను జాదూగర్ చేయొచ్చు :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi18 ఏప్రిల్, 2026 9:17 AMకి
      ప్రతి పక్షం నుంచి పెద్దనాయకుల మాట లేదు,ఛోటా నాయకులది తప్పించి. ఇక ప్రభుత్వ పక్షంలో ప్రధాని తప్ప మరెవరూ మాట లేదు.
      ప్రజలు రకరకాలుగా అనుకుంటున్నారు.
      ఒక పెద్దనోటి బంగాలీ భామ గెల్చేసేం అంటూంది.అంటే ఈ రోజే మోడీ ని దించేసి ప్రభుత్వం ఏర్పాటు చేసేస్తామన్న రీతిలో సాగుతోంది.😜 ఇక కాంగ్రెస్ నుంచి ఒక భామ ప్రజాస్వామ్యం బతికిందన్నారు. ప్రతి పక్షం గెలిచినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్యం బతుకుతో ఉంటుందా అని ప్రజలనుకుంటున్నారు.
      ఇక కొందరు మేధావులు ప్రభుత్వపక్షం ప్రతి పక్షం ఒకరి పిలక ఒకరు కత్తిరించేమనుకుంటున్నారుగాని ప్రజల పిలకలు కత్తిరింపబడకుండా ఉద్ధరింపబడ్డాయంటున్నారు.
      కొందరు సామాన్యులు, ఇది ప్రభుత్వపక్షం వేసిన వల, ఇందులో ప్రతి పక్షం ఎగిరిపడివచ్చి చిక్కుకుంది. దీని ఫలితం 2029లో తెలుస్తుంది,వేచి చూడాలంటున్నారు.
      మీరెవరితో ఏకీభవిస్తారో! 😜

      తొలగించండి
  2. కాంగిరేసు భామ తెలుగు భామామణియేనా ?

    రిప్లయితొలగించండి
  3. Zilebi19 ఏప్రిల్, 2026 11:16 AMకి
    కాంగిరేస్ లో తెనుగువాళ్ళా! మరో పాతికేళ్ళు ఎదురు చూడలేరూ!😂

    రిప్లయితొలగించండి
  4. తాతగారు అప్ టు డేట్ గా లేనట్టనిపిస్తోంది :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. Zilebi19 ఏప్రిల్, 2026 8:19 PMకి
      అప్ టు డేటే😜. ఎక్కడో తేడా కొడుతోంది😍

      తొలగించండి
    2. మా మీ రేణుకామ్మ గార్ని మరిచిపోనారు మల్లె వుంది :)

      తొలగించండి

    3. Zilebi21 ఏప్రిల్, 2026 2:27 AMకి
      మన/మనం అనుకోలేకపోతున్నారుగా! ఇక్కడే తేడా కొట్టటం లేదూ!

      తొలగించండి
  5. -
    పిలక కత్తరింపు పిట్టకతల తోడు
    దేశ మందు జరుగు దెబ్బలాట
    జోడి తాత బల్కె జుట్టురాలెడు తీరు
    రాజకీయ మనగ రచ్చ యేను


    రిప్లయితొలగించండి
  6. అలనాటి నాటక ప్రస్థానం

    http://ishtapadi.blogspot.com/2026/04/blog-post_20.html

    యూట్యూబు లింకులు

    https://youtu.be/BKdeKebhJG4?si=l9t6UzvRzkg3ew3F

    షార్ట్ వీడియోస్ వున్నాయి.



    రిప్లయితొలగించండి
  7. -
    The provided text is a satirical commentary that uses a **personal anecdote about a haircut** to examine the shifting landscape of **Indian politics**. The author recounts the difficult decision to trim his own traditional tuft of hair, using this small domestic act as a **metaphor for political maneuvering** and legislative outcomes. By referencing historical figures like Vandemataram Ramachandra Rao and Marri Chenna Reddy, the narrative highlights how **distinctive personal traits** often symbolized political power and consequences in the past. This historical perspective is then applied to a contemporary **parliamentary debate regarding a women's bill**, where opposing parties both claim victory despite a lack of consensus. Ultimately, the source suggests that while politicians celebrate their perceived triumphs, it is the **general public** whose interests are often most affected by these power struggles. The discourse concludes by inviting readers to consider whether modern political tactics are merely **elaborate traps** designed for future electoral gains.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi21 ఏప్రిల్, 2026 5:46 AMకి
      ఎవరి కమే (AI)మాటిది? గూగుల్ (AI)ఐతే నా చాలా టపాలకి ఇలా ఇచ్చేసింది.

      తొలగించండి
  8. తాతగారికో గిఫ్ట్

    పిలక కత్తరింపు మహోత్సవ సందర్భముగా

    https://varudhini.blogspot.com/2026/04/blog-post_21.html



    రిప్లయితొలగించండి

  9. Zilebi21 ఏప్రిల్, 2026 7:31 AMకి
    నా పిలక కత్తిరింపు మహోత్సవం ఇంత గొప్పగా జరుగుతున్నదనుకోలేదు😜👌🙏

    రిప్లయితొలగించండి
  10. మెయిలు లో పీడీఎఫ్ఫు ఎల్లెమ్మ పంపెను మీకు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Zilebi25 ఏప్రిల్, 2026 11:45 AMకి

      సమాధానమిచ్చానే! మెయిల్ కూడా వదన,శోధినిలా ఒంటెద్దు బండయిపోయిందా!

      ఈ రోజు ఉదయమే కేజ్రీవాల్ దొరకి, పిలక కత్తిరింపు మహోత్సవం రాఘవ్ ఛద్దా మరొక ఆరుగురు కలసి ఘనంగా జరిపించిన సందర్భంగా వచ్చిన వార్త చూసి టపా ఊరకబోయింది. ఆపేను.

      తొలగించండి
    2. పిలక కత్తిరింపుకి శుక్రవారం ముహూర్తం మంచిదేమో సుమా!

      కేజ్రీవాల్ దొరకి శుక్రవారమే పిలకత్తిరింపు మహోత్సవం జరిగింది. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా ఆయ్యో! అన్న పాపానపోయినవాళ్ళవుపడలా! ఒక్క పెద్ద నోటి బంగాలీ భామ తప్పించి. చివరికి కేజ్రీవాల్ దొర గురువు, అన్నాహజారే కూడా రాఘవ్ ఇతరులను తప్పుపట్టలేదు!

      ఈ ముహూర్తానికే తెలంగణాలో కామ్రేడ్ చంద్రశేఖరరావు దొరకి పిలక కత్తిరింపు మహోత్సవం కుమార్తె కవిత స్వయంగా నిర్వహించారు TRS (Telangaanaa raashtra sena)పార్టీని స్థాపిస్తూ.

      అసలు వేసవి ఇలా పిలకలకత్తిరింపుకి మంచిదేమో!

      తొలగించండి

  11. మరో పీడీయెఫ్ఫు కూడా మీకు ఎల్లెమ్మ పంపించెను
    శ్రీ భాస్కర విజయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చూసాను. పదేళ్ళకితం టపా కాదు పదిహేనేళ్ళేమో!
      ధన్యవాదాలు సార్

      తొలగించండి