రోగం రొష్టు-సంసారం గుట్టు
ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!
రోగం రొష్టు
ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి. నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో! ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు. టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.
ఇక సంసారం గుట్టు.
సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం. బయట చెప్పుకునేవా? అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు
ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం
మంత్రమౌషధ సంగమౌ
దానమానావమానశ్చ
నవగోప్యా మనీషిభిః
వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం. ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.
చిత్తే చిత్తే భిన్న రుచిః :)
ReplyDeleteజిలేబి,
ReplyDeleteదీన్ని "లోకో భిన్నరుచిః"అంటారు
ముఖే ముఖే సరస్వతి 🤣
దీనినే పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచీ అనీ అంటార్లే 🤣
Delete-
ReplyDeleteసుర్రను కారము సరసన్
జుర్రుకొని జిలేబులన్ పుసుక్కున జిహ్వన్
వెర్రెత్తించదగు మదిని
కుర్రో మొర్రో యని యది కూయన్ తాతా
జిలేబి,
Deleteకారం తింటే సుర్రని కాలదూ, సుర్రని కాలే పనులు చేస్తే చుర్రనే కాలుతుంది.
నువు చేసినపనేంటి? ఏమన్నా అంటే అనేసేరో అని గోల తప్పించి. నా 'జిలేబి వదన ' గొప్ప టపాలు వెంఠనే ప్రచురించేస్తుందని, చూపించుకోడానికి, నా ఈ వేళ టపా 'వదన'లో కనపడేలాగా,శోధినిలో ప్రచురణ కాకుండా చేసినదెవరు? మది కుర్రో మొయ్యో అని కూయదా?ఇప్పుడు చుర్రని కాలిందా? ఊదుకో!!🤣
ఎవరి గోల్ గోల వారిది
ReplyDeleteశోధిని లో కనిపించక పోతే కుయ్యో మొర్రో అని నా మీద ఏల ఈ రొదల్ ?
ఏమండోయ్ శీనివాస్ సో దిన్ గారు
కాస్త ఇటొచ్చి తాతగార్ని సమజాయిద్దురూ ప్లీజ్ :)
మాయచేసి విష్ణుమాయ అనకు.
Delete-
ReplyDeleteముచ్చట చూడంగా గో
ల్డెచ్చోటనొ పోయె ! కొనుట లెస్స కుదురునా !
అచ్చచ్చొ బ్యాంకు నిఫ్టీ
జొచ్చిన ఆల్గోలిచట రుజువులగుపించెన్
గోల్డ్ ముట్టుకోకు కాలుతుంది.ఎప్పుడో చెప్పేను బంగారం అందదని. వయసులెక్కచెప్పి ఎకసక్కెమాడేవు,యాది లేదా?
Deleteవారి,వారి సిల్వర్ పెరిగింది,ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది,మూడుంపాతికి లకారాలమీదనడుస్తున్నాది. ఇంకా పెరుగుద్ది,అమ్మకోకు,మరి కొనలేవు.
జిలేబి,
Deleteఅహో,నిఫ్టీ!,అహో డవ్వు!! అహో జోన్స్!!! అని ఎగరకు ఇక ముందు ఆర్ధికవ్యవహారాలకోసం సోషల్ మీడియా కూడా చూస్తున్నారుట.
ముట్టుకొనవలదె గోల్డున్
ReplyDeleteకొట్టిందంటే జిలేబి కొట్టే గాయబ్
పట్టిందల్లా బంగరు
దట్టించినదే అనుకొని తలిరుచు కొనవే
దట్టించినదే అనుకొని తలిరుచు కొనవే
Delete"దట్టించినదే మిగులని తరలిచుకొనవే" అంటే బాగుంటుందేమో చూసుకో!
అత్యద్భుతం. మహానుభావా… నమస్సులు.
Deleteజిలేబి,
Deleteమరీ అంతొద్దు.🤣
అన్నట్టు ఇది మనస్కూల్ కాదేమో కదా😜
ఆకుకు అందదు , పొందదు
ReplyDeleteపోకకనంగా జిలేబి బుధులును మీరున్
శ్రీకరముగ సంభాషణ
ప్రాకటముగ సేయ నెంతొ బాగుంది బుధా !
రాజావారు,
Deleteజిలేబికి నాకూ మధ్య సంభాషణలో గుప్తం ఏమీ లేదండి. జిలేబి ఏదో చేసి నా టపాలు శోధినిలో కనపడకుండా చేస్తున్నట్టు నమ్మకం. అబ్బే,నాదేం లేదు,శ్రీనివాస్ గారూ ఈయనగోలేంటో చూడండీ,అన్నది జిలేబి తాత్పర్యం.
బంగారం వెండి ధరలు దారుణంగా పెరిగాయి 10గ్రాముల బంగారం 1.62వేలు. కేజి వెండి 3.25 వేలు నాటికి, బేంక్ నిఫ్టీ అనేది స్టాక్ మార్కెట్ లో బేంకుల షేర్ ధరలు చెప్పేది. బంగారం వెండి ఇంకా పెరుగుతాయి,నిలవ ఉంచుకోడానికి కొనకు,కొంటే ఢమాల్ అంటే మొత్తం నష్టపోతావని హెచ్చరించా. నిఫ్టీ అనేది స్టాక్ మార్కెట్ లో కొన్ని స్టాకుల ధరలు తెలిపే ఇండక్స్, స్టాక్ కొని,అమ్మేవాళ్ళు ఇది చూస్తుంటారు. పెరిగితే అహో,ఒహో అంటుంటారు,తగ్గితే డీలాపడిపోతారు. మన ఆర్ధికమంత్రిగారు ఇక ముందు ఆర్ధిక లావాదేవీలగురించి సోషల్ మీడియా కూడా చెక్ చేస్తామని చెప్పేరు. కొని,అమ్మకపోయినా ఈ రకం మాటలున్నా తరవాత కాలంలో చిక్కుల్లో పడచ్చు,జాగర్త అన్నదే నా హెచ్చరిక. ఆ తరవాత ఉన్నకాడికి బంగారం,వెండి ఉంచుకో లేదా అమ్మి సొమ్ము చేసుకో దక్కినలాభమే దక్కుడని చెప్పేను. పద్యంలో చివరిపాదంలో కొంచం అక్షరాల మార్పు చేస్తే అర్ధం బాగుందని చెప్పేను,దానికి ఓ! గొప్ప పొగిడితే అంతొద్దనాను. ఇంతే సార్!
-
ReplyDeleteమరో బ్యాంకునిఫ్టీ తయారాయెన్ :)
ఓ నా బంగారమ్మా !
ఈ నాడేమాయె నీకు ఇంత పడితివే
లా! నీ నాట్యము చూడం
గా నా జీవితము ధన్య మాయె జిలేబీ !
Did the brokers sell one year ahead prices jacking up in a week and bringing down to normalcy. ?
జిలేబి,
Deleteబంగారం రూపాయికి పావలా ఎందుకు తగ్గింది? కారణాలడక్కు. అసలెందుకు పెరిగింది? అదీ కొచ్చను. ఇక ముందు బంగారం,వెండి,ప్లాటినం,టంగ్స్టన్,స్టీల్,ఇతర మెటల్స్ పెరుగుతూనే ఉంటాయి. బంగారం,వెండి డంపులోంచి తియ్యకు😜 ఇది నా సలహా. సలహా ఉచితం. ఇప్పుడు కొనద్దు,అమ్మద్దు,రిస్క్ ఎక్కువ.
అసలెందుకు పెరుగుతోంది? నామాట.
బ్రిక్స్ దేశాలన్ని తమ వ్యాపారలావాదేవీలన్ని బంగారంలోనూ,తమ కరన్సీలలోనూ చేస్తున్నాయి,డాలర్ కి చెల్లు చెప్పేసేయి. రేపో నేడో ఇ.యు కూడా బ్రిక్స్ లో చేరేలా ఉంది,ఇది ఇ.యు భారత్ ల మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందం తరవాత మాట. కొంత కాలానికికాని ఈ ధరలు స్థిరపడవు. ఆయిల్ యుగం కూడా ఐపోవచ్చింది. ఇప్పుడంతా ఎలక్ట్రానిక్ యుగం,కరంటుకు,ట్రాన్స్పోర్ట్ రంగాలు ముఖ్యం. రేపు బడ్జట్ చూసి చెప్పు.
తాత గారా మజా కాయా !
Deleteఅబ్బ ఎంత బాగా విశ్లేషించారండీ !
బడ్జెట్ కీ దుకాన్ మే భారత్ కరేగీ ధమాకా అని మీలాంటి అభిజ్ఞ వర్గాల ఉవాచ.
మీ "ఓపియమ్" ఏమిటి ?
జిలేబి,
Deleteఓపియం తీసుకుంటే ఒపీనియన్ లేదు😜
నిర్మలమ్మ 9వ బడ్జట్ ధమాకా 2 గంటల్లో వినబోతున్నావుగా,ఇప్పుడు నేను ఊహించి రాయడం కష్టం. నీ ప్రశ్న ఆలస్యం. బడ్జట్ విని చెప్పు.
పర్సనల్ టాక్సులో నా ఊహ టాక్సు లేని ఆదాయం 13 లక్షలకి పెంపు, అనగా స్టాండర్డ్ డిడక్షన్ 1 లక్షకి పెంపు. బేంకులు,పోస్టాఫీసు 50 లక్షలపై వచ్చేవడ్డీ టాక్సు ఆదాయం నుంచి మినహాఇంపు,4 లక్షల వడ్డీ కి పరిమితం. రిసర్వ్ బేంకు ఇతరబేంకులు బంగారంలో వ్యాపారం. చిన్న మొత్తాల్లో కూడా ప్రజలనుంచి కొనుగోలుకు సావకాశం.చాలా ఉన్నాయి,విను,నాకు వినపడదు కనక విని చెప్పు.
తాతగారి ఓవర్ ఎక్స్పెక్టేషన్ మరీనూ :
Deleteచింతకాయల కి ఆజ్ఞ కాని గుటకలకి ఎందుకు?.
Deleteದೀನಿ ಭಾವಮೇಮಿ ?
Deleteఆ అఘొరించేదేదో తెలుగు లిపిలో రాస్తే సరిపోయేదిగా,దీనికి కన్నడ లిపి ఎందుకూ? నీకు అన్నీ పరగడుపే! దీని గురించి ఇదివరలో చెప్పిన గుర్తు. మళ్ళీ చెబుతున్నా! ఓ చిన్న కత.
Deleteనీలాటి సో.పో కు ఒక చింతచెట్టుంది,అది విరగ్గాసింది,దానితో, ఈ సో.పో దానికింద ఒక నులకమంచమేసుకుని పడుకున్నాడు,చింతకాయలెవరేనా కోసుకుపోతారేమోనని. చింతకాయలంత తేలిగ్గా రాలవు,చెట్టు ఎక్కి కర్రతో కొడితే కాని రాలవు. అంత గట్టిగా ఉంటాయి,(చింత చెట్టు దులిపినట్టు అంటారందుకే)అటువంటి చింతకాయలకి కాపలా పడుకున్నాడు. ఈలోగా ఒక ఏబ్రాసి చింతచెట్టుకేసి చూసి గుటకలు మింగుతున్నాడు. ఇది చూసిన సో.పో ఎందుకు గుటకలు మింగుతున్నావు చింతకాయల్ని చూసి,అని గద్దించాడు.
దానికి వాడు చింతకాయలు కోసుకు తినడానికి నీ ఆజ్ఞ కావాలి కాని వాటిని చూసి గుటకలు మింగేందుకు నీ ఆజ్ఞ ఎందుకని తిరగబడ్డాడు. దాంతో సో.పో కి బుర్రతిరిగి మంచం మీద పడ్డాడు. ఇదీ కత.
అలాగ కావలసినవాటిని ఇస్తారని ఊహించడం గుటకలు మింగడం లాటిదే కదా! ఇంకా నయం ఇలా పనీపాటూ లేక సోషల్ మీడియలో తిరిగి కామెంట్ పెట్టేవాళ్ళకి కామెంట్ కి వంద పన్నేసేననలేదుగా!
వైద్య రాజదర్శనానికి కాలమయింది,ఆటో వచ్చింది,వస్తా!
వాహ్ వాహ్ తాతగారా మజాకాయా
Deleteఅత్యద్భుతః
ఇంతకీ బైద్యరాజ్ అన్నీ ఓకే చేసేరా ?
హోప్ ఆల్ ఇన్ కంట్రోల్ ?
జిలేబి,
Deleteబంగారం ఢమాల్!ఢమాల్!!
చెబితే వింటివ గురూ!గురూ!!
వినకే చెడితిర,నే వినకే చెడితిర.!!!
****************
ఈ నల్లని రాలలో ఏ గుండెలు దాగెనో!
ఈ బండల మాటున ఏ గుండెలు మోగునో!
పైన కఠినమనిపించును
లోన వెన్న కనిపించును
జీవమున్న మనిషికన్న
శిలలే నయమనిపించును.
పొల్లు మాటకు చెల్లు చెప్పు.
అర్ధమైతే ఇదే అద్వైతం
*********
వైద్య రాజ దర్శనం
బిపి పెరిగింది. ఏమయింది? డాక్టర్ గారి కొచ్చను.
సహబ్లాగరి, అభిమాని, లలితమ్మాయి కి పితృవియోగం
వార్త నిన్న ఉదయం నాలుగుకే తెలిసింది,మనసు చెదిరింది. బిపి పెరిగింది సార్! విన్నవించా.
బాబూ! నిబ్బరించవోయి!! వైద్యుని అశ్వాసన.
************
ఒక్కరోజులో ఇన్ని మార్పులు
ఇదే జీవితం,ఇంతే జీవితం
వార్త ....
DeleteYes Came to know of.
Life and death are in His hands.
May they attain better worlds.