Thursday, 22 January 2026

రోగం రొష్టు-సంసారం గుట్టు

 రోగం రొష్టు-సంసారం గుట్టు


ఇదొక నానుడి,నాటికాలందే కాదు నేటికాలందీనూ!

 రోగం రొష్టు

ఏం? ఎందుకూ కదా కొచ్చను. నాటికాలంలో వైద్య సహాయం తక్కువ,కావల్సినవారందరికి కబుర్లు చేసి మరీ చెప్పుకునేవారు,ఉత్తరాలూ రాసుకునేవారు. మీ అల్లుడికి జ్వరం ఎంతకీ తగ్గటం లేదు,వైద్యం దారి వైద్యందే జ్వరందారి జ్వరందేలాగా ఉందీ అని, అటునించి  ఈ మాత్రలువాడి చూడు అని మనిషిచేత పంపడమో,ఉత్తరం రాయడమో చేసేవారు. ఇందుకోసం రోగం రొస్టు. నాటి రోజుల్లో జబ్బులు కూడా చెప్పుకునేవే ఉండేవి.   నేడు డాక్టర్ దగ్గరకెళితే చాంతాడంత టెస్టులు రాసి చేయించుకురా అని పంపితే అవి పూర్తయ్యేటప్పటికే వారం పడుతుందిలా ఉంది. ఇక వైద్యం సంగతి చెప్పేదేలేదు. మరెవరితోనైనా చెప్పుకుంటే, ఆయన దగ్గరకెందుకెళ్ళేరు, ఈయన  దగ్గరకెళ్ళలేకపోయారా? ఇలా సలహాలిస్తే వెళ్ళిన ప్రతి డాక్టరూ టెస్టులు రాస్తే,చేయించేమని చెప్పినా మళ్ళీ చేయించాల్సిందేనంటే చద్దికంటే ఊరగాయి ఎక్కువైన చందమైపోయింది,నేటి వైద్యం. అబ్బే! అమెరికా తీసుకెళ్ళలేకపోయారా? అమెరికాలో వాళ్ళు వైద్యం గొప్పగా చేసినా అక్కడివాళ్ళు ఎందుకు చస్తున్నట్టు? ఇదికదా కొచ్చను. అంచేత నేడు రోగం గుట్టైయింది. ఇప్పుడు చెప్పుకునే రోగాలూ రావటం లేదేమో!  ఇక దేశంలో కూడా సెకండ్ ఒపీనియన్ వైద్య శాలలు వెలిసాయి.వీరు వైద్యం చెయ్యరు. టెస్టులు చేసి అన్నీ  రోగ నిర్ణయంచేసి చెబుతారు.పాత వైద్యం తాలూకు రికార్డ్ ఇవ్వక్కరలేదు.  టెస్టులలో తేడా పాడా ఉండదనీ,రోగనిర్ణయం కచ్చితాంగా చేస్తామనీ చెప్పుకుంటారు.పంపించేస్తారు. ఆ తరవాత రోగి ఇష్టం.   


ఇక సంసారం గుట్టు. 

సంసారంలో అనేక ఇబ్బందులుంటాయి. పెళ్ళాం గయ్యాళి కావచ్చు,లేదా మేదకురాలు కావచ్చు. అలాగే మొగుడున్నూ! పిల్లలు చెప్పినమాట  వినకపోవచ్చు. ఈడొచ్చిన పిల్ల ప్రేమలో పడచ్చు. ఇలా ఉంటాయి. లేదా డబ్బు ఇబ్బందులూ,రాబడి తక్కువా,ఇలా అనేకం.   బయట చెప్పుకునేవా?  అమ్మా! మా ఆయన ఎందుకూ పనికిరాడే, అందుకూ పనికిరాడే  అని పాటికేళ్ళు సంసారం చేసినామె తల్లితొ చెప్పుకుంటే,తల్లి మాత్రం ఏం చేయగలదు? చులకన కావడం తప్పించి. అందుకే పెద్దలు


ఆయుర్విత్తం గృహఛ్ఛిద్రం 

మంత్రమౌషధ సంగమౌ 

దానమానావమానశ్చ

నవగోప్యా మనీషిభిః 


వయసు,సాంసారంలోని ఇబ్బందులు,మంత్ర,తీసుకునే మందు,స్త్రీ పురుష సంగమం,దానం,మానం,అవమానం ఈ తొమ్మిదీ గుట్టురా బాబూ అన్నారు. ఆపై మీచిత్తం.  ఇప్పుడంతా పబ్లీకున చెప్పుకునేవే అంటారా?అంతా ట్రాన్స్పరెన్సీ అంటారా? తమ చిత్తం.    

13 comments:

  1. చిత్తే చిత్తే భిన్న రుచిః :)

    ReplyDelete
  2. జిలేబి,
    దీన్ని "లోకో భిన్నరుచిః"అంటారు
    ముఖే ముఖే సరస్వతి 🤣

    ReplyDelete
    Replies
    1. దీనినే పుర్రెకో బుద్ధి జిహ్వకో రుచీ అనీ అంటార్లే 🤣

      Delete
  3. -

    సుర్రను కారము సరసన్
    జుర్రుకొని జిలేబులన్ పుసుక్కున జిహ్వన్
    వెర్రెత్తించదగు మదిని
    కుర్రో మొర్రో యని యది కూయన్ తాతా



    ReplyDelete
    Replies
    1. జిలేబి,
      కారం తింటే సుర్రని కాలదూ, సుర్రని కాలే పనులు చేస్తే చుర్రనే కాలుతుంది.
      నువు చేసినపనేంటి? ఏమన్నా అంటే అనేసేరో అని గోల తప్పించి. నా 'జిలేబి వదన ' గొప్ప టపాలు వెంఠనే ప్రచురించేస్తుందని, చూపించుకోడానికి, నా ఈ వేళ టపా 'వదన'లో కనపడేలాగా,శోధినిలో ప్రచురణ కాకుండా చేసినదెవరు? మది కుర్రో మొయ్యో అని కూయదా?ఇప్పుడు చుర్రని కాలిందా? ఊదుకో!!🤣

      Delete
  4. ఎవరి గోల్‌ గోల వారిది

    శోధిని లో కనిపించక పోతే కుయ్యో మొర్రో అని‌ నా మీద ఏల ఈ రొదల్ ?

    ఏమండోయ్ శీనివాస్ సో దిన్ గారు


    కాస్త ఇటొచ్చి తాతగార్ని సమజాయిద్దురూ ప్లీజ్ :)




    ReplyDelete
    Replies
    1. మాయచేసి విష్ణుమాయ అనకు.

      Delete
  5. -
    ముచ్చట చూడంగా గో
    ల్డెచ్చోటనొ పోయె ! కొనుట లెస్స కుదురు‌నా !
    అచ్చచ్చొ బ్యాంకు నిఫ్టీ
    జొచ్చిన ఆల్గోలిచట రుజువులగుపించె‌న్


    ReplyDelete
    Replies
    1. గోల్డ్ ముట్టుకోకు కాలుతుంది.ఎప్పుడో చెప్పేను బంగారం అందదని. వయసులెక్కచెప్పి ఎకసక్కెమాడేవు,యాది లేదా?

      వారి,వారి సిల్వర్ పెరిగింది,ముట్టుకుంటే షాక్ కొట్టుద్ది,మూడుంపాతికి లకారాలమీదనడుస్తున్నాది. ఇంకా పెరుగుద్ది,అమ్మకోకు,మరి కొనలేవు.

      Delete
    2. జిలేబి,
      అహో,నిఫ్టీ!,అహో డవ్వు!! అహో జోన్స్!!! అని ఎగరకు ఇక ముందు ఆర్ధికవ్యవహారాలకోసం సోషల్ మీడియా కూడా చూస్తున్నారుట.

      Delete
  6. ముట్టుకొనవలదె గోల్డున్
    కొట్టిందంటే జిలేబి కొట్టే గాయబ్
    పట్టిందల్లా బంగరు
    దట్టించినదే అనుకొని తలిరుచు కొనవే


    ReplyDelete
    Replies
    1. దట్టించినదే అనుకొని తలిరుచు కొనవే
      "దట్టించినదే మిగులని తరలిచుకొనవే" అంటే బాగుంటుందేమో చూసుకో!

      Delete
    2. అత్యద్భుతం. మహానుభావా… నమస్సులు.

      Delete