Friday, 19 December 2025

నెలగంట

 

నెలగంట

ప్రతి నెల ఒక సంక్రమణం జరుగుతుంది,అనగా సూర్యుడు ఒక రాశినుంచి మరొక రాశికి మారే రోజు సంక్రమణం. మూడు రోజులకితం సూర్యుడు వృశ్చికరాశి నుంచి ధనూరాశికి మారాడు. ఈ నెలకాలాన్నీ ధనుర్మాసం అంటారు.రాబోయే మాసం మకరమాసం. మకరసంక్రమణం రోజునే మనం పెద్దపండగ అంటాం. ఈ ధనుర్మాసంలో మొదటిరోజునుంచి నెల చివరి వరకు  వైష్ణవాలయల్లో ఉదయం నాలుగు గంటలకి జరిగే  ఉత్సవం,ఈ నెలగంట. ఉదయమే నాలుగు గంటలకి నిద్రలేచే అలవాటు చేయడమేమో! అలాగే నగరసంకీర్తనం అనగా విష్ణుభక్తికి సంబంధించి కీర్తనలు పాడుతూ నగరవీధులలో ఉదయమే నాలుగు మొదలు ఆరుదాకా చేసే ఉత్సవం. 

3 comments:

  1. ఎన్నెన్నో ఇటు వంటివి
    ఉన్నవి గుడులందు , వాటి ఉనికి కనంగన్
    అన్నా ! తమ వంటి బుధులు
    ఉన్నా రిప్పటి వరకు , మనోఙ్ఞము , విబుధా !

    ReplyDelete
  2. పెద్ద పండుగ నెల రోజులుందనగా ఇంటి ముందు ముగ్గులలో వేసే అర్ధ చంద్రాకారాన్ని "నెలగంటు" ని ఎందుకు అంటారో చెప్పగలరు

    ReplyDelete
    Replies
    1. నెల‌ అనగా చంద్రుడు
      హాల్బ్ చంద్రుడు గంటు పడిన చంద్రుడు
      కావున నెలగంటు


      ఇట్లు
      జిలేబి

      Delete