వీధి కుక్కలు
సుప్రీం కోర్టు ఒక్కసారి ఉలిక్కిపడి,వీధి కుక్కల్ని సురక్షిత స్థానాలకు తరలించి,ప్రజల్ని కాపాడమని ఢిల్లీ అధికారులను ఆదేశించింది. దీనిని అమలు చేసేటపుడు ఎవరైనా అడ్డుపడితే అది కోర్టు ధిక్కరణ అవుతుందని చెప్పింది. ఏం జరగబోతోంది, చూడాలి.
కుక్కలకు స్వేచ్ఛగా జీవించే హక్కులేదా? ఇలా కుక్కల్ని జైళ్ళలో వేసి చంపేస్తారా అని కుక్కల హక్కుల సంఘాలవారు సుప్రీం కోర్ట్ మీద దండయాత్ర చేసినంత పని చేసారు. దాంతో ప్రధాన న్యాయమూర్తి కలగజేసుకుని కుక్కల హక్కులు మిగతా విషయాల గురించి విచారించడానికి ముగ్గురు న్యాయ మూర్తుల బెంచీని ఏర్పాటు చేసారు. హక్కుల సంఘాలవారికి పెద్దపెద్ద లాయర్లను పెట్టుకోడానికి డబ్బులెక్కడినుంచి వస్తాయో తెలీదు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు తేలుస్తారో మొత్తం ఫుల్ కోర్ట్ సమావేశం కోరతారో వేచి చూడాలి. ఫుల్ కోర్ట్ సమావేశం జరిగినా ఆశ్చర్య పడక్కరలేదు. వేచి చూదాం! కుక్క కరిస్తే ఒకడేకదా చచ్చేది దీనికింత రాద్ధాంతం అవసరమా అనే వారే కనపడుతున్నారు.
మానవులకేనా భూమి మీద బతికే సావకాశం? కుక్కలకి ఇతర జంతువులకీ సమానంగా బతికే హక్కు లేదా? కొన్ని జంతువులు అడవుల్లోనే ఎందుకుండాలి? అవీ మనతో పాటు ఉండచ్చుగా! హక్కుల సంఘాలవారు పెంచూకోనూ వచ్చు. పులలను సింహాలను అరబ్ దేశాలలో పెంచుకోడం లేదూ? మానవులదేముంది లెండి,ఈ వేళ ఉంటారు,రేపు పోతారు. మా జంతు రాజ్యం పరిపాలనకోస్తే ఎట్టుంటదో తెలుసా! అంతా సమానం ఎవరికి కావలసినది వారు వేటాడుకుని నచ్చినదాన్ని తినెయ్యచ్చు. జంతు రాజ్యం జిందాబాద్!
వీళ్ళని పేజ్ 3 పీపుల్స్ అంటారట.
ReplyDeleteఏదో ఒక విషయాన్ని పట్టుకుని వార్తల్లో ఉండడం వీళ్ళ పని. వీధి కుక్కల మీద అంత ప్రేమ ఉంటే పంచుకుని పెంచుకోవచ్చు కదా!
bonagiri16 August 2025 at 17:38
ReplyDeleteఅంతలో ఆగితే సంతోషమే సార్! కాని,కొంత మంది వ్యక్తులు,సంస్థల వెనక విదేశీ శక్తులున్నట్టనిపిస్తుంది. గంటకి లక్షల రూపాయలు వసూలు చేసే లాయర్లు ఉత్తి పుణ్యానికి వీరికోసం వాదిస్తారనుకోలేను.
చిత్రం, సుప్రీం కోర్ట్ కూడా కొత్త బెంచీలు ఏర్పాటు చేసి కేసులు వింటుంది. ఇప్పుడీ సమస్యకోసం ఫుల్ కోర్ట్ సమావేశమైనా ఆశ్చర్య పడలేను.
వీధి కుక్కల్ని పెంచుకోవడం వైభోగమూ అయిందండి. కొన్నాళ్ళు కుక్కల్ని పెంచినట్టే పెంచి మళ్ళీ దేశం మీదకి వదిలేశారు, సమస్య మొదలు కొచ్చింది. అందుకే మొదటి బెంచ్, కొంతమంది పెంచుకోవడం దత్తత తీసుకోవడం కూడా కూడదందండి. ఏమి జరుగునో చూడాల్సిందేనండి.