నాకూ సొతంత్రం వచ్చింది.
***
నాకూ సొతంత్రం వచ్చింది.
🤣🤣🤣🤣🤣
ఎందుకంత పడి,పడి నవ్వుతావు?
నీకు సొతంత్రమొచ్చిందా? ఎలా బాబూ!
నా చెయ్యి,నా కాలు,నా నోరు,నా చెవి, నా ముక్కు అంటున్నావుకదా! ఇవే కర్మేంద్రియాలూ,జ్ఞానేంద్రియాలూ కదూ!
అవును అనుమానమేంటీ?
నిజం కదూ! 🤣🤣🤣
అదేమిమాటా?
నీవి అనుకుంటున్నవన్నీ నీ అధీనంలో లేవు. నీ మనసు అధీనంలో ఉన్నాయి. అవునుకదా!
నీ మనసు నీ అధీనంలో లేదు. నువ్వు నీ మనసు అధీనంలో ఉన్నావు. నీకు సొతంత్ర ఎక్కడా? మనసు సంకెళ్ళనుంచి బయటపడు,అప్పుడూ నీకు సొతంత్రమొచ్చినట్టు.
మనసు బానిసత్వం నుంచి సొతంత్రం పొందు.
*****
మనసు బానిసత్వం నుంచి బయటపడిన వారందరికి సొతంత్ర దిన శుభకామనలు.
మీకు సొతంత్ర దిన శుభాకాంక్షలు ..
ReplyDeletesrinivasrjy15 August 2025 at 20:32
Deleteధన్యవాదాలు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినది.
ReplyDeletebonagiri16 August 2025 at 17:32
Deleteఅవును సార్! దేశానికి సొతంత్రం వచ్చిందిగాని,నా మనసునుంచి నాకు సొతంత్రం వచ్చినట్టనిపించలేదు. వయసొచ్చేసిందండి, ఇప్పుడిప్పుడే సొంతంత్రం వస్తున్నట్టుంది 🤣