వసంత పంచమి.
పలుకులమ్మతల్లి పుట్టిన రోజు,శుభాకాంక్షలు.
వేదం రథపాఠం
ఘనకంటే కష్టమైన రథపాఠం. ఈ వేద మంత్రాల విన్యాసం చూస్తే షాకవుతారు. దీని ఫార్ములా ఇలా ఉంటుంది.
121221211212232332132112122323343443214321121223233434454554321543211212232334344545565665432165432112122323343445455656676776543217654321121223233434454556566767787887654321876543211212232334344545565667677878898998765432198765432112122323343445455656676778788989
ఈ కళ్లు చెదిరే అంకెల ఫార్ములాను అక్కడ మంత్రాలకు అప్లై చేయాల్సి ఉంటుంది. దిగ్భ్రమ చెందే ఈ వీడియో🙏🙏🙏🙏
coutesy:Whatas app
https://kastephale.wordpress.com/2019/12/20/%E0%B0%B6%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%87%E0%B0%AA%E0%B0%82%E0%B0%95%E0%B0%AC%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B1%81-%E0%B0%98-2/
వేదాధ్యయనంలో నాకు తెలియవచ్చిన వాటిగురించి 2015లో ఒక టపా రాసాను. దానిని 2019 మరొకసారి ప్రచురించా, లింకు పైన ఇవ్వబడింది.. నాకు తెలిసినంతవరకు, ఘనపాఠం గురించి నాకు తెలియవచ్చినంత వరకు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి మహాస్వామివారి పుస్తకంనుంచి రాసాను. చాలాకాలం తరవాత రథ పాఠం కనపడింది. వినలేకపోవడం మూలంగా వివరించలేకపోయాను. ఇది జటపాఠం,ఘనపాఠాల సమ్మేళనమేమో ఇవ్వబడిన అంకెలద్వారా తేల్చుకోలేకపోయాను. వినండి.
ఎవరైనా విన్నవారు వివరించగలిగితే సంతసం.
రథానికి రెండు చక్రాలు . ఆ రెండు చక్రాలు విడివిడిగా తిరుగుతూంటాయి కానీ కలిసి తిరుగుతాయి . ఆ కలిసి తిరుగుతుండటం మూలానే బండి ముందుకు సాగుతుంది .
ReplyDeleteమన మానవ జీవితంలో "సంసారం " అనేది ఒక రధం. భార్యా భర్తలు రధ చక్రాలు . కలిసి తిరగకపోతే రధం కూలినట్లే సంసారం కూలుతుంది . ఇది దీనిని మనకు అన్వ ఇంచుకుంటే తెలిసే తాత్పర్యం .
శర్మ గారూ థాంక్స్ ఫర్ ది పోస్ట్ .
Rao S Lakkaraju3 February 2025 at 19:29
Deleteభారతీయ కుటుంబ వ్యవస్థ భార్యాభర్తలమీదనే ఆధారపడిఉంది. ఆడపిల్ల ఒకచోట,మగపిల్లవాడొకచోటా కుటుంబాలలో పుడతారు,పెరుగుతారు. వీరిద్దరిని (చక్రాలు) వివాహం అనే వ్యవస్థ ఇరుసుగా అనుసంధానింపబడతారు. కుటుంబరథం మొదలవుతుంది. దీనికి రెండు గుర్రాలు పేర్లు ఆశ,మోహం (అర్ధకామాలు) సారధి ధర్మం. జీవనపథం అనే బాటలో ఎత్తు,పల్లాలు (కష్ట,సుఖాలు) గమ్యం మోక్షం. రథికుడు, పిల్లలో కలిపిన కుటుంబం. ఇప్పుడు భార్యా,భర్తలు కుటుంబ నిర్వాహకులు. ఇలా జీవన రథాలు కలిసి సాగిపోతుంటాయి. ఇందులో కొన్ని మధ్యలోనే కుంటుబడుతుంటాయి. ఏదో ఒక చక్రం జారిపోవడం ఇలా దైవనిర్ణయాలు అనేకం. ఎక్కువ చెప్పేనా? మన్నించండి.
ధన్యవాదాలు.
ಈ ಚಕ್ರಾಲೂ ಇರುಸೂ ಬಂಡಿ ಎತ್ತೂ ಪಲ್ಲಾಲೂ ಗಟ್ರಾ ಲ ನುಂಡಿ ಎಪ್ಪುಡು ಬಯಟ ಪಡತಾರೊ ಟೂ ಮಚ್ ವೆದಾಂತಾಲತೊ ಜೀವುತಾನ್ನಿ ಎನ್ಜಾಯ್ ಚೆಯ್ಯಕುಂಡಾ ....
Delete:)
చెప్పేది తెలుగు మాటలే. మరి తెలుగులో వ్రాయకుండా కన్నడ లిపిలోనో, తమిళ లిపిలోనో వ్రాస్తుంటారెందుకు “జిలేబి” గారూ 🤔? ఏం, తెలుగు లిపిలోనే వ్రాయడానికి భయమా ?
Deleteవిన్నకోట నరసింహా రావు4 February 2025 at 16:40
Deleteనైజగుణానికి, లొట్ట కంటికి మందులేదు కదుసార్!
భవ జలధి దాటు మార్గము , బహు సుబోధ
ReplyDeleteముగ నుడివి , జగతిని విమోహ బంధ
ముక్త మొనరించె కృష్ణయ్య , పుణ్యభాగు ,
డా జగద్గురుడు మనకు హాయి నొసగె .
వెంకట రాజారావు . లక్కాకుల4 February 2025 at 11:54
Deleteకృష్ణం వందే జగద్గురుం
-
ReplyDeleteభవజలధి! బండి చక్రా
లవధుల తో డిరుకు బతుకులాటలు జల్సా
కువకువలు లేని విదురుల
ప్రవచనముల హోరులివ్వె ప్రజలకు మత్తుల్
Zilebi4 February 2025 at 14:06
Deleteకట్,పేస్టు ప్రొఫెసర్ కి ఇంతకంటే మంచాలోచనెక్కడొస్తుంది.నీ బతుకింతే నీతో ఉన్న విద్యార్ధుల భవిష్యత్తుని తగలబెట్టేస్తున్నావు.
వేదం వల్లించే వారికి దండేసి దణ్ణం పెట్టాలండీ, శర్మ గారు. ఏమి ధారణ, ఏమి ఉచ్చారణ, ఏమి స్వరం 🙏. ఎన్ని సంవత్సరాల అధ్యయనమో కదా ! 🙏
ReplyDeleteవిన్నకోట నరసింహా రావు4 February 2025 at 21:00
ReplyDeleteదండలకి దణ్ణాలకి లోటు లేదండి కూటికే లోటు ఎంకన్నబాబు ఏమైనా ఇస్తున్నాడో లేదో తెలీదు. ఈ మధ్య ఒక పెద్దాయన కలిసారు. మాటల్లో ఒక శ్లోకం చెప్పి చెప్పింది,ఒక్కదమ్ములో చెబితే మీ కంఠం,ఊపిరి తిత్తులు భేషుగ్గా ఉన్నట్టే! ఒకటి,రెండు సార్లు ఆగారనుకోండి,ప్రయత్నిస్తే బాగుపడతారు. ప్రతినామానికి ఆగారనుకోండి, కష్టపడతారు రాబోయే కాలం లో అన్నారు. ఆ శ్లోకం ఇది
నమస్తే!అస్తు!భగవన్ విశ్వేశ్వరాయ.
మహాదేవ,త్రయంబకాయ,
త్రిపురాంతకాయ,త్రికాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ,నీలకంఠాయ
మృత్యుంజయాయ,సర్వేశ్వరాయ
సదాశివాయ,శ్రీమన్మహాదేవాయ నమః
ఉఛ్ఛారణ చెప్పుకోదగినది,విన సొంపైనది. పదిహేను పదహారేళ్ళ అభ్యాసం సార్!
అది ఎన్ని పదాల ఋక్కో తెలియలేదు. ఇక్కడ తొమ్మిది పదాలు దాకా చెప్పబడ్డాయి. ఒక చోట అవరోహణ క్రమంలో ఋక్కు ఉంది. విని రాస్తారేమో అనుకున్నా సుమా!
నమస్కారం.
CORRECTED VERSION. PLEASE READ AS BELOW
Deleteనమస్తే!అస్తు!భగవన్ విశ్వేశ్వరాయ.
మహాదేవాయ,త్రయంబకాయ,
త్రిపురాంతకాయ,త్రికాగ్ని కాలాయ
కాలాగ్ని రుద్రాయ,నీలకంఠాయ
మృత్యుంజయాయ,సర్వేశ్వరాయ
సదాశివాయ,శ్రీమన్మహాదేవాయ నమః
ఆగకుండానే చెప్పుకున్నానండోయ్, శర్మ గారు 🙏.
Deleteఆగకుండానే పదిహేడో యెక్కం చెప్పండి చూద్దారి :)
Deleteఅసలు నాకు పదిహేడో ఎక్కమే రాదు. ఇక ఆగకుండానో, నట్లు నట్లు గానో అప్పజెప్పే ప్రశ్నెక్కడిది 😏.
Deleteలౌక్యమే ఢోకా
Deleteఇక వైదికమెట్లా :)
లౌక్యమా లేనిది.
Deleteఅదే ఉంటే ఇంకా ఎదిగుండేవాడినేమో 😒 ?
కుర్చీమనిషిగానా ?
Delete“స్వర్ణ కమలం” చిత్రంలోని ఈ సీను చూడండి ఓపిక చేసుకుని. చిన్నదే లెండి. వేద పండితులకు సమాజంలో ఏ మాత్రం గౌరవం దక్కుతోందో తెలుస్తుంది 👇.
ReplyDeletehttps://youtu.be/VZ6_mH7qbOI
// “ విని రాస్తారేమో అనుకున్నా సుమా! “ //
ReplyDeleteనా గురించా, శర్మ గారు ? ఏమి విని వ్రాస్తాననుకున్నారు ….. అర్థం కాలే.
మీరూ కవియేనా ?
Delete