Saturday, 22 February 2025

Solve

 Solve:-  

Answer within 20 seconds

3-3*6+2 = ?

18 comments:

  1. నడువుల కొంజెం బ్రాకెట్ మిస్సింగ్ :)

    ReplyDelete
    Replies

    1. Zilebi22 February 2025 at 10:44
      బ్రాకెట్ ఇల్లె, మిస్సింగ్ ఇల్లె, ఈక్వేషన్ అప్పడిదా! సొల్లొంగె 🤣

      Delete
  2. Replies
    1. Bonagiri22 February 2025 at 10:54
      ఎటులనే వివరించుడీ

      Delete
  3. ఏయై నడుగుడు సాల్వగ ,
    మాయా శశిరేఖ యుండ మమ్మే లడుగన్ ?
    ఖాయము ' మైనస్సిరువై
    పై యొకటి ' యనుచును నేను భావింతు బుధా !



    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల22 February 2025 at 11:15
      కమే నడిగితే ఎంత సేపు సారూ! మనం ఈ వయసులో ఎలా ఉన్నామన్నదానికి ఒక చిన్నటెస్టు అంతే కాని పెద్ద పరిక్షకాదు కదా! కాలక్షేపం విత్ చిన్న ఎకస్ర్సైజ్ అంతే సారూ. ఎలా సాధించారు?జవాబు. వివరించుడీ

      Delete
    2. " అంకానామ్ వామనో గతిః "
      6+2 = 8
      8* -3 = - 24
      -24 -3 = - 21

      Delete
    3. -24 -3 = -27 అవుతుంది మాస్టారూ.
      -24 + 3 (మొదటి 3) అయితే -21 వస్తుంది.

      బహుశః టైపు చెయ్యడంలో పొరపాటు దొర్లుంటుంది లెండి (+ గుర్తు బదులు - మైనస్ గుర్తు పడుంటుంది).

      Delete
    4. అవును సార్ ,
      -24+3 = -21
      ధన్యవాదాలు

      Delete
  4. మిత్రులందరికి వందనం!
    అందరం ఆరుపదులు,ఏడుపదులు,ఎనిమిది పదులు దాటినవాళ్ళమే!! పొరబడితే తప్పులేదు,అది మరపునపడ్డదే,మరేం కాదు.కించపడవలసిన అవసరమూ లేదు. ఆరు పదులలోపువాళ్ళు ఆలోచించుకోతగ్గదిన్నూ.
    అంకగణితంలోగాని,బీజ గణితం లో గాని ఇటువంటి సమీకరణాలు సాధించడానికో రూల్ ఉంది అదే BODMAS rule అనగా బ్రాకెట్లు,ఆర్డర్లు, భాగహారం,గుణితం,కూడిక, చివరగా తీసివేత.

    అంకానాం వామతోగతిః. నిజమే అంకెలు కుడినుంచి ఎడమకు పెరుగుతాయి. వేసేటపుడు,పలికేటపుడు ఎడమనుంచి కుడికి,వేస్తాం,పలుకుతాం. లెక్కించేటపుడు కుడినుంచి ఎడంకు చేస్తాం. ఇది అంతవరకు మాత్రమే. నేనూ మరచిపోయి ముందు తప్పుచేసేను. దీని ఆన్సర్ అందరిలోకి చిన్నవాడయిన బోనగిరిగారు చెప్పినదే రైటు. అది -13. ఎలా?
    -3*6= -18 దీనికి 2 కలిలితే -16 దీనికి +3 కలిపితే -13 అంతే!

    జీవితంలో ఎన్నో కూడికలు చేసేం ఆపై కొన్ని తీసివేతలూ చేసి ఉంటాం. కొన్ని భగవంతుడిచ్చిన కూడికలు, అలాగే భగవంతుని తీసివేతలున్నూ. ఆయన పొరబడడు మనలా. మనమే కొన్ని తీస్వేతలు కూడికల్లా, కొన్ని కూడికలు తీసివేతల్లా చేసుకుని, తప్పులు చేసి వెతలపాలయి ఉంటాం. అసలు లెక్కలలోగాని జీవితం లో గాని ఉన్నవి రెండే కూడిక,తీసివేత. క్రమమైన కూడిక గుణితం,క్రమమైన తీసివేతే భాగహారం, చివరికి మిగిలేదే శేషం. వాళ్ళే పిల్లలు జీవిత లెక్కల్లో. ఈ చివరికి మిగిలినవాటిని పట్టుకుని మిగిలిన జీవిత లెక్క పూర్తి చేసుకోవాలని తాపత్రయం. లెక్కలకు జీవితానికి అవినాభావ సంబంధం. ఏట్లో పారేసిన ఎంచి పారెయ్యమని మా సౌదరరాజన్ అయ్యోరు చెప్పినమాట గుర్తుండిపోయింది.

    ReplyDelete
    Replies
    1. "భాగహారం,గుణితం,కూడిక, చివరగా తీసివేత అన్న ఆర్డర్ కరెక్ట్ కాదు"
      భాగహారం,గుణితం,కూడిక, తీసివేత లలో, భాగహారం & గుణితం మొదట చెయ్యాలి. రెంటికీ ఒకటే ఆర్డర్. అంటే ఎడమనుంచి కుడికి చూస్తే రెంటిలో ఏది ముందొస్తే అది ముందు చెయ్యాలి. భాగహారం & గుణితం అయిపోయిన తర్వాత, కూడిక & తీసివేత చెయ్యాలి (ఎడమవైపునుంచి రెంటిలో ఏది ముందొస్తే అది చెయ్యాలి). ఉదా.కి 6 / 3 * 2 = 4 అవుతుంది. 1 అవదు.

      Delete
    2. కాంత్24 February 2025 at 01:36
      వివరించినందుకు
      ధన్యవాదాలు.

      Delete
  5. సూత్రం బెరిగిన బోన్గిరి
    మిత్రుల ' తగ ప్రస్తుతించి ' , మేలు భజింతున్ ,
    పాత్ర తెరగ కుండ , తివిరి
    చిత్రముగా నేనునూ వచించితి నసదున్ .







    ReplyDelete
  6. There is something called precedence of operators.

    1. Expressions in brackets are evaluated first.
    2. Rise to power operations are done next.
    3. Multiplications and divisions are carried out next in the left to right order.
    4. Additions and subtractions are done lastly in left to right order.

    This is how mathematical expressions are evaluated.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం27 February 2025 at 10:58
      ధన్యవాదలండి!
      బహుకాల దర్శనం. కుశలమేకదా!!
      జీవితంలో అహం అనే ఇన్నర్ బ్రాకెట్లు విడదీయడం కావటంలేదండి.

      Delete

    2. బుచికి27 February 2025 at 16:52
      అహం అనే ఇన్నర్ బ్రాకెట్లు విడతీయడం తెలిస్తే బాగుండేలా ఉందండి. సాధ్యం కావటం లేదు. ఎన్ని రూపులు మార్చినా ఇది వెంటపడుతూనే ఉన్నదండి.

      Delete