Saturday, 25 January 2025

ఆందోళన జీవి.

 ఆందోళన జీవి.


ఎలుక ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది, లేకపోతే చచ్చిపోతుంది.  ఎలుక బతకాలంటే ఏదో ఒకటి నిత్యం కొరుకుతూనే ఉండాలి. ఎందుకలా ఇది గదా కొచ్చను. 


ఎలుక దేన్నీ   కొరకకుండా ఉండిపొతే  పళ్ళు పెరిగిపోతాయి,ఎంతలా? దాని దవడలను పుళ్ళు పడేటంతగా. ఐతే ఏమవుతుంది? పుళ్ళు పడితే,పళ్ళు పెరిగితే ఏమీ తినలేదు,చనిపోతుంది, అందుకు నిత్యం ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది. ఎలక కొట్టని వస్తువు లేదు. 


దీనికీ ఆందోళన జీవికి ఏంటి లింకు? 

దుఃఖ భాగులు ఆరుగురు తెలుసుగా. ఇందులో నిత్య శంకితుడు,నిస్సంతోషి అనేవారిద్దరున్నారు. వారి కలయికతో పుట్టినవాడే ఆందోళన జీవి.  ఈ ఆందోళన జీవి ఏదో ఒక దానిగురించి ఎప్పుడూ సంశయం వెలిబుచ్చుతూనే ఉండాలి,ఏదో ఒకదాని గురించి ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉండాలి.  లేకపోతే ఏమవుతుంది? ఈ కుళ్ళు అంతా మనసులో పేరుకుపోయి ప్రమాదానికి దారి తీస్తుంది. 

అందోళన జీవి ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడేనా నవ్వినా పెద్దప్రమాదం తనకో,గ్రామానికో,జిల్లాకో,రాష్ట్రానొకో,దేశానికో వచ్చి తీరుతుంది. అందువలన,అందుచేత,అందుకొరకు ఆందోళనజీవి ఎప్పుడూ ఏడుస్తూనే,అరుస్తూనే ఉండాలి. అస్తు!

స్వస్తి!


లోకాః సమస్తాః సుఖినోభవంతు!

44 comments:

  1. విను , జామా దానిమ్మా
    ఘనమగు బొప్పాయి పుచ్చకాయయు యాపిల్
    కనువిందగు నేరేడును
    ననువుగ షుగరున్న వారి కమృతఫలములౌ .

    ReplyDelete
    Replies
    1. దానిమ్మ సంవత్సరం పొడుగునా దొరుకుతున్నది. జామ సీజనల్ దొరుకుతోంది. ఆపిల్ చెప్పక్కరలేదు,పుచ్చకాయ వేసవిలో బాగా దొరికే పండు. నేరేడు వచ్చే సీజన్ రెండు నెలల్లో.బొబ్బాసి మంచిది. మీరు చెప్పినట్టు అన్నిటిని తింటున్నవే కాని ఆపిల్,పుచ్చకాయ తినడం తగ్గింది. కారణం ఆపిల్ కి ఫార్మాలిన్ రాసేస్తున్నారు,నిలవ వుండడానికి. పుచ్చకాయ ఎర్రగాను తియ్యగాను ఉండడానికి కాయ పాదుని ఉండగానే ఇంజక్షన్ చేస్తున్నారు. మరో తినగలిగిన పండు బదరి ఫలం. దోస పండు దీనిని లంకదోస అంటారు.వేసవిలో దొరుకుతుంది. మా గోదావరి ప్రాంతంలో దొరుకుతుంది,వెతుక్కోవాలి. పనస,మామిడి, అనాస అప్పుడప్పుడు కొద్దిగా తినచ్చు,సీజన్ లో. తింటే ఇబ్బంది పెట్టేవి, సపోటా,అరటిపండు.

      Delete
    2. ద్రాక్ష, శీతాఫలం కూడా ఇబ్బంది పెట్టేవే అనుకుంటాను, శర్మ గారు.

      Delete

    3. విన్నకోట నరసింహా రావు26 January 2025 at 11:51
      పళ్ళన్నిటిలోనూ ప్రక్టోజ్ రూపంలో సుగర్ ఉంటుంది. ఐతే సీతాఫలంలో ఫ్రక్టొజ్ తో పాటు పీచు ఉన్నది కనక మోతాదులో తినచ్చు. ద్రాక్ష కూడా అంతే ఐతే ఇందులో నల్లద్రాక్షయేగాని తెల్లద్రాక్ష పనికిరాదు.

      Delete
    4. ఈ రోజుల్లో నల్లద్రాక్ష ఎక్కడ కనిపిస్తోందండీ ? మన చిన్నతనంలో ఆంధ్రాలో నల్లద్రాక్షే కదా. అవి వచ్చే ద్రాక్ష కుండలకు (ఖాళీ అయిన తరువాత) పబ్లిక్ లో మంచి గిరాకీ కూడా ఉండేది 🙂.

      తెల్ల ద్రాక్ష (అనాబ్ షాహీ ద్రాక్ష అంటారనుకుంటాను) నేను హైదరాబాద్ వచ్చిన తరువాతే మొదటిసారి చూసాను. ఈ రకం కూడా ఉంటాయా అనుకున్నాను. నల్లద్రాక్ష చాలా అరుదుగా కనిపిస్తుంటుంది (నేను గమనించినంత వరకు). కాబట్టి హైదరాబాద్ లో నివసించే డయాబెటీయులు ద్రాక్ష తినడం అదే తగ్గిపోతుంది - అంతా తెల్లద్రాక్ష మయమే అవడం మూలాన 😒.

      Delete
    5. విన్నకోట నరసింహా రావు26 January 2025 at 19:36
      నల్లద్రాక్ష మాదగ్గర బాగానే దొరుకుతోందండి.తెల్లద్రాక్ష(అనాబ్షాహి) కూడా బాగా దొరుకుతుంది.
      నాటిరోజుల్లో నల్లద్రాక్ష ఏర్రకుండలలో వచ్చేవి. ఆకుండ ఒక స్టేటస్ సింబల్ నాటిరోజుల్లో 🤣 మా పెదనాన్నగారో కుండ తెచ్చేరు. ఆ కుండలో నీళ్ళు పోసింది మొదలు చల్లటి మచినీళ్ళని పెద్దమ్మని వేధించడం మొదలెట్టాం,అంతా! దాంతో చిరాకేసిన పెద్దమ్మ తిట్టింది,చల్లటి నీళ్ళు లేవని. వచ్చి అమ్మతో చెప్పుకున్నాం, మా బాగా తిట్టింది,మీకు బుద్ధిలేదు. నీళ్ళు పోసిది మొదలు తీస్తోంటే ఎక్కడ చల్లబడతాయి. ఇలా కాదని తనుగోదావరినుంచి ఒక పెద్ద బిందెడు నీళ్ళు తెచ్చి తడిపినచీర మడతలేసి గచ్చుపైనవేసి,బిందెను నీళ్ళతో ఒక్కసారిగా గచ్చుమీద బోర్లించి,చీర అంచులు బిందెమీదికి ముడేసి,గట్టిగా ఆ బిందెని బయట పందిరిలో వేలాడతీసింది,కొక్కేనికి. ఏంటొ అర్ధం కాక చూస్తూ ఉండిపోయాం. అప్పుడు చెప్పింది,కావలసినన్ని చల్లటి మంచినీళ్ళు తాగండి,కొంచం సేపు ఆగండని,భోజనాల వేళ బిందెను కొద్దిగా వంచి నీళ్ళు పట్టి భోజనాలు పెట్టి,చల్లటి మంచినీళ్ళిచ్చింది. అమ్మ ఏదో మంత్రం వేసిందనిపించింది. అమ్మ అలా కట్టడం చూసి అందరూ అలా కట్టుకోడం చల్లటినీళ్ళు తాగడం మొదలెట్టేరా ప్రాంతంలో. ఇదో వింతైపోయింది.
      అమ్మ చదువుకుందా? లేదు,తెనుగు అక్షరాలు మాత్రమే వచ్చు,రామాయణ,భారత భాగవతాలు చదువుకుంది. బడికెప్పుడూ వెళ్ళలేదట. ఎందుకు నీళ్ళు చల్లగా ఉంటాయో,తిరగేసిన బిందెలో నీళ్ళెలా ఉంటాయో,ఆ తరవాత కాలంలో గాని మాకు అర్ధం కాలేదు. అమ్మ లోకాన్ని చూసింది,లోకాన్ని చదువుకుంది, అంతే!

      Delete
  2. కాన్టిపేషను గల్గు షుగరుకు వాడు
    మందుల వలన , పండ్లు ఫైబరు నొసంగు
    కతన , తినదగు ఫలముల , మితముగాగ ,
    అనుదినము తినుటయె మేలు , వినుత విబుధ !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల26 January 2025 at 12:41
      సుగర్తో మొదటగా చెడిపోయేది జీర్ణాశయమే. మలబద్ధం తగ్గించుకోలేకపోతే బాధలు బహుళం. అందుకుగాను,పీచు ఎక్కువగాను,మలబద్ధాన్ని నివారించే, తేగలు తినచ్చు,సీజన్ ఐపోతోంది. అలాగే నిత్యమూ సబ్జాగింజలు ఒక చంచాడు నానబెట్టుకుని ఉదయం ఫలహారం తో తీసుకుంటే మలబద్ధమూ తగ్గుతుంది,సుగరూ అదుపులో ఉంటుంది. ఇవేకాక కాయకూరల్లో దోస ను వాడు కోవడం బహు మంచిది.ఆకుకూరలు చెప్పక్కరలేనివే!!!

      Delete
  3. ఇచ్చట అంతయు
    రోగభూ"యిష్టము" గా వున్నది :)

    महोल
    बहुत खतर्नाक है :)

    ReplyDelete
    Replies
    1. Zilebi26 January 2025 at 15:28
      ఎవరక్కడ?😊

      Delete
  4. మిత్రులకు,
    మా కనిష్ట సోదరుడు, కవి, అమెరికా వాసి విన్నకోట రవిశంకర్ వ్రాసిన “వచన కవిత్వ వ్యాకరణం” అనే వ్యాసం ఆసక్తి కలవారు ఈ క్రింది లింకు ద్వారా చదవచ్చు 👇.

    https://www.madhuravani.com/vachana-kavitva

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు28 January 2025 at 16:57
      మంచి విషయాన్ని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. వచన కవిత్వం అంటే ఇదా! ఇప్పటిదాకా దీన్ని బావకవిత్వం సారీ భావకవిత్వం అనుకునేవాడిని. మంచి పత్రిక కూడా పరిచయమైనదనుకుంటా. ఈ అమెరికా నుంచి వచ్చే తెనుగు పత్రికలన్నీ ఎర్ర కబుర్లు చెబుతాయి. వాటి జోలికిపోవడం కూడా ఇష్టముండదు. చచ్చిపోయిన గుర్రాన్ని తోలేవాళ్ళేననుకుంటా.

      Delete
    2. తమ్ముడి గురించి చెప్పనేలా !

      ఇలా చీవాట్లు తిననేలా !


      Delete
    3. “Zilebi (13:48),
      పెద్దవాళ్ళ చీవాట్లు కూడా దీవెనలుగా భావించాలని చిన్నప్పుడే పెద్దలు చెప్పిన మాట.

      Delete
    4. Zilebi29 January 2025 at 13:48
      నా కామెంట్ లో నేనెవరిని కించపరచలేదు. నాకు నచ్చలేదని చెప్పేను,అంతలో అది కవిత్వం కాకపోలేదుగా!
      నీవు ''ఆందోళనజీవీ' వన్నమాట సార్థకం చేసుకున్నావు. నిన్ను తిట్టని వాళ్ళూ,వానకి తడవనివాళ్ళు ఉండరు. మరోమాట నేను తప్పు చేస్తే తప్పనిసరిగా ఒప్పుకుని క్షమాపణ అడుగుతాను,నీలా మొండిగా వాదించను.

      Delete
    5. విన్నకోట నరసింహా రావు29 January 2025 at 13:51
      ఇటువంటి పనులు చేయడం జిలేబికి వెన్నతో పెట్టిన విద్య. నేను మిమ్ములనుగాని, మీతమ్ముడు చి.రవి శంకర్ గారినిగాని కించపరచినట్టనిపిస్తే మరోమాటలేక క్షమాపణ వేడుతున్నాను.

      Delete
    6. వినరా వారూ మీలాంటి సహృదయులు చాలా చాలా చాలా అరుదు.

      Delete
    7. శర్మ గారు (15:01),
      మీరు మమ్మల్నెవరినీ కించపరచ లేదని నాకు తెలుసు. మీరు క్షమాపణ వేడవలసిన అవసరం ఇసుమంతయినా లేదు. “జిలేబి” గారి ఉచ్చులో పడకూడదని నాకన్నా మీకే బాగా తెలుసు. 🙏

      Delete
    8. Zilebi29 January 2025 at 16:22
      ఆందోళనజీవి నోట మంచిమాటా ప్రమాదం పొంచి ఉన్నట్టే! మొదటి రౌండ్ నీకే కావచ్చు,జాగ్రత్తా!
      నువ్వు ఆందోళన జీవివని రూఢి పరచుకున్నావు,రుజువు చేసేసుకున్నావు. విన్నకోట వారిలాటి సహృదయులు అరుదు, నీలాటి కట్ పేస్టు,కాపీపేస్టు ప్రొఫెసర్లు ఆందోళనజీవులు పెరిగిపోయారు.

      Delete

    9. విన్నకోట నరసింహా రావు29 January 2025 at 18:36
      వందనం.

      Delete
  5. కరుణ "ననాయాస మరణ"
    వర మిమ్మని యడిగినాడ , వరదుని కృష్ణున్
    కరుణాంతరంగ రంగడు ,
    కరుణించునొ లేదొ ? లేదు , కాదన , డొసగున్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల28 January 2025 at 21:28
      అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం ప్రసాదించమని కోరడం సబబే! అనుగ్రహం తప్పక ఉంటుంది, జీవితం గడచి పోయింది కనక ఇక మిగిలినదాని గురించే కోరిక, మనం చేయవలసినది చేస్తే దైవం తప్పక అనుకూలిస్తాడని నా నమ్మకం.

      Delete
  6. అయ్యలారా!

    ఈ షుగరేడ్పుల్, హెల్థాందోళనల్, మరణ మృదంగాల్ అన్నీ వదిలి పెట్టి కాస్తా లోకంలో పడి బీ హ్యాపీ టపాస్ వ్యాఖ్యాస్ రాయండి

    మూడీ మాహౌల్ తో మరీ బెంబేలెత్తించేస్తున్నారు


    అబ్బా అంతా డార్కు నెస్సేనా !!!


    ReplyDelete
    Replies
    1. Zilebi28 January 2025 at 22:18
      సుఖస్యానంతరం దుఃఖం
      దుఃఖస్యానంతరం సుఖం
      న నిత్యం లభతే దుఃఖం
      న నిత్యం లభతే సుఖం.
      జీవితంలో అన్నీ అనుభవించాలి తప్పదు మరి. జాగ్రత్తలు తీసుకోడానికెందుకు ఏడ్పులు? ఇప్పుడేడిస్తే జీవితాంతం ఏడ్వాలి,నీ చిత్తం. హేపీ టపాలు నువు రాయచ్చుగా! మేమూ చడువుతాం,చదవగలం,చదివి నీలా ఏడుపు కామెంట్లు పెట్టం,నాదీ హామీ 😊

      Delete
  7. "ఎలుక ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది" 👌👌🐀🐁

    విపరీత అర్థాలు తీసి, వింత పద్యాలు వ్రాసి పెద్దల మధ్య తంపులు పెట్టి ఆనందిస్తుంది.

    ReplyDelete
    Replies
    1. బుచికి29 January 2025 at 20:46
      నిజం కదు సార్! ఎలక కొరక్కపోతే చచ్చిపోతుంది. మంచిపోలిక ఆందోళనజీవి కదా! అదే టపాలో చెప్పి ఊరుకున్నా! నేనే ఆందోళనజీవినహో అని జిలేబి రుజువు చేసేసుకుంది. నైజగుణానికి లొట్టకంటికి మందులేదని సామెత కదు సార్! ఇలా తంపులు,విపరీతార్ధాలకి జనాలు స్పందించే రోజులు చెల్లిపోయాయని జిలేబి అనుకోటం లేదు. జిలేబిని తిట్టనివాళ్ళు లేరు. చివరికి అజాతశత్రువు కూడా సున్నితంగా చెప్పినదైనా అర్ధం కాలేదీ ఆందోళనజీవికి.

      Delete
    2. అజాతశత్రువు నిద్దురోతున్న మానవుణ్ణి లేపడానికి ఓ బాలాకి కావలసి వచ్చె :)

      బాలాకి లేనిదే అజాతశత్రువు లేదు.

      ఒకరు మరొకరికి ప్రతిబింబము
      యెలుకయే బుచికి
      బుచికియే యెలుక :)



      Delete
    3. Zilebi30 January 2025 at 09:21
      ఇంత నిరూపించినా తిట్టినా నీకు బుద్ధి రాలేదు,సిగ్గూ లేదు. నీవు ఆందోళంజీవివి.ఆందోళనజీవియే ఎలుక, మరొకరెలా అవుతారు. చాలు ఇంకా కుళ్ళు పెంచుకోకు,కడుపు పగిలిపోగలదు.బుచికి ఎలుక ఎలా అవుతారు?

      Delete
    4. అది అర్థమైనచో జీవితసత్యమే బోధపడును :)

      Delete
  8. కోరిన దైవకార్యముల గూడి వసించితి , నూరిలోని పో
    లేరు మహేశ్వరిన్ , పరిమళించిన భక్తి ప్రపత్తులొప్పగా
    నేరిచినంత వట్టు , యను నిత్యము గొల్చి , తదేక సేవలో
    తీరుగ నిర్వదేండ్లు గడి దేరి తరించితి , నింత యేటికిన్

    ఎన్నడొ యెన్బదేండ్ల తరి , నేర్పడ గట్టిన , చిన్న దేవళం
    బెన్నగ గచ్చులూడి , దురపిల్లి , విభూతి నశించి , జీర్ణమై
    చన్న యెడన్ , గలంగుచు విచారణ జేసి , మహోజ్జ్వలమ్ముగా
    కన్నులు కాంతులీను గుడి గట్ట దలంచితి నెంతయున్ గడున్ .

    ఎంతగ పూర్వ జన్మముల నెట్టివి పుణ్యఫలంబు లున్నవో ,
    చింతన సేయుటే తడవు , చేరిరి పుణ్యులు , చేరె డబ్బు , యా
    వంతయు క్లేశముల్ వొడమ , వద్భుతమే యిది , భూరి యాలయం
    బెంతయు శోభలన్ మెరయ , నింద్ర నిభా భవనంబె యేర్పడెన్ .

    ఇంత కన్న నే యదృష్టము కోరేది ?
    జన్మసఫల మయ్యె , చాలు చాలు ,
    పరగ నింత యిచ్చె పరమాత్మ కృష్ణుండు
    వందనాలు నీకు పరమ పురుష !

    ReplyDelete
    Replies
    1. మీరు ధన్యజీవులు, మాస్టారు 🙏.

      Delete
    2. వెంకట రాజారావు . లక్కాకుల30 January 2025 at 08:13
      మీరు చేయగలది,చేయవలసినది చేసుకున్నారు.సంతృప్తిగా జీవితం గడిపేసేరు,చివరి దశలో మిమ్మల్ని పరమాత్మ తప్పక కరుణిస్తాడు.విన్నకోటవారి మాటే నేనూ చెబుతున్నా. మీరు ధన్యజీవులు.

      Delete
    3. పెద్దలు నరసింహరావుగారికి ,
      జగమెరిగిన పండితులు శర్మగారికీ
      నమస్సులు , ధన్యవాదాలు .
      తమ ప్రశంసాత్మక ఆశీస్సులకు
      కృతజ్ఞతలు .

      Delete
  9. ಇಕ್ಕಡ ಅಂತಾ ಪ್ರಶಾಂತಂಗಾ ವುಂದಿ. :(


    ReplyDelete
    Replies
    1. ఏం, దాంతో మీకు బాధగా ఉందా ? 😏

      Delete

    2. విన్నకోట నరసింహా రావు1 February 2025 at 18:32
      స్పష్టంగా తెలుస్తున్నది కదు సార్!

      Delete
  10. కృష్ణపరమాత్మలో చేరి కీలు వడిన
    డెంద మానంద డోలిక లందు దేలి
    పరవశించుచు మనెదరు , భాగ్యమన్న
    భాగవతులదే కద ! వారె భవ్య రతులు .

    ReplyDelete
    Replies
    1. ఏం, దాంతో మీకు బాధగా ఉందా ? 😏

      Delete
    2. వెంకట రాజారావు . లక్కాకుల1 February 2025 at 11:20
      ధన్య జీవులు

      Delete
  11. స్మరియింతు కృష్ణుడిని , నా
    పరమంబగు ధ్యేయ మనుచు , పరి పరి విధులన్
    నిరతము ప్రతి కదలికలో
    పరమాత్మ , చరణ సరోజ , భాగ్యము గనుచున్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల2 February 2025 at 17:07
      ఆనందో బ్రహ్మ

      Delete