Thursday 9 November 2023

కాస్త తాళుము కృష్ణా

  కాస్త తాళుము కృష్ణా



తలుపు తీయునంతలోనె
తత్తర మదియేల నోయి?
తలుపుదీతు వీలు జూచి
తాళుము కృష్ణా!
    కొంతసేపు
తాళుము కృష్ణా!
    పతి నిద్దుర వోవలేదు
    మతి సందియ మొందె నేమొ
    పతికి కునుకు పట్టగ లో
    పలకు వత్తుగాని తాళు
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!
నుదుట బొట్టు దిద్దలేదు
చెదరియున్న ముంగురులను
కుదురుజేయలేదు యేల
పదెపదె పిలచెదవురా
తాళుము కృష్ణా!
    కాస్తసేపు
తాళుము కృష్ణా!
    ఏల నంత తత్తరమ్ము
    ఏల నంత భయము, సామి
    నిన్నుగాక వేరొక్కని
    నెట్లు వలవగలను కృష్ణ!
    తాళుము కృష్ణా!
        కాస్తసేపు
    తాళుము కృష్ణా!


గుత్తొంకాయ్‌ కూరోయ్‌ బావా!
కోరి వండినానోయ్‌ బావా!
కూరలోపలా నా వలపంతా
కూరిపెట్టినానోయ్‌ బావా!
    కోరికతో తినవోయ్‌ బావా!తియ్యని పాయసమోయ్‌ బావా!
తీరుగ వండానోయ్‌ బావా!
పాయసమ్ములో నా ప్రేమనియేటి
పాలుబోసినానోయ్‌ బావా!
    బాగని మెచ్చాలోయ్‌ బావా!కమ్మని పూరీలోయ్‌ బావా!
కర కర వేచానోయ్‌ బావా!
కరకర వేగిన పూరీలతో నా
కాంక్ష వేపినానోయ్‌ బావా!
    కనికరించి తినవోయ్‌ బావా!వెన్నెల యిదుగోనోయ్‌ బావా!
కన్నుల కింపౌనోయ్‌ బావా!
వెన్నెలలో నా కన్నెవలపనే
వెన్న గలిపినానోయ్‌ బావా!
    వేగముగా రావోయ్‌ బావా!పువ్వుల సెజ్జిదిగో మల్లే
పువ్వుల బరిచిందోయ్‌ బావా!
పువ్వులలో నా యవ్వనమంతా
పొదిపిపెట్టినానోయ్‌ బావా!
    పదవోయ్‌ పవళింతాం బావా!
బసవరాజు అప్పారావు గారి గేయం

2 comments:

  1. ఒరిజినల్ అనుకున్నా :)

    క్రింద బసవరాజు చూసేక ఓహో తాతగారు కొట్టుకొ......





    ReplyDelete
    Replies
    1. Zilebi9 November 2023 at 09:27
      నువ్వు డూప్లికేట్ అని తెలిసినదే! :)
      పేరు గుర్తుండకపోవచ్చేమోగాని ఈ గేయాలు తెలియని,వినని ఆంధ్రుడు ఉండడు.

      Delete