Monday 6 November 2023

గతకాలపు వైభవ చిహ్నాలు.

 



Raleigh సైకిలు


LG TV

Post-Box


కల్వం,సన్నికల్లు,రుబ్బురోలు,కుందిరోలు


వస్తువుల్ని గుర్తు పట్టండి

అవసరం తీరేకా మానవులూ ఇంతే! ఐతే కొందరు గతకాలపు వైభవ చిహ్నాలుగా మిగిలిపోతారు, మరికొందరు కాలగర్భం లో నామరూపాలు లేక మలిగిపోతారు.

7 comments:

  1. భలే సేకరించారండీ గతకాలపు చిహ్నాల ఫొటోలు 👏. మా ఇంట్లో కూడా రాలీ సైకిలే ఉండేది.

    ఒకప్పుడు మనుషుల జీవితాల్లో ప్రముఖ పాత్ర వహించి, ఎంతో వైభవంగా వెలిగిన పోస్టు డబ్బా ప్రస్తుత స్ధితి చూస్తే ఉసూరుమనిపిస్తుంది 😒.

    సెల్ ఫోన్ తరానికి ఆనాటి జీవన విధానం గురించి చెప్పినా అర్థం కాదు, వినే ఓపికా ఉండదు లెండి.

    ReplyDelete
    Replies
    1. చిత్రాలన్నీ గత సంవత్సరంగా ఉదయపు నడకలో నేను తీసినవేనండి. సెల్ఫోన్ ప్రక్షాళణా కార్యక్రమంలో కనపడ్డాయివి.

      Delete
  2. అధిక విద్యావంతు లప్రయోజకులైరి
    పూర్ణ శుంఠలు సభాపూజ్యులైరి
    సత్యవంతుల మాట జన విరోధంబయ్యె
    వదరుబోతుల మాట వాసికెక్కె
    ధర్మవాసన పరుల్ దారిద్ర్య మొందిరి
    పరమలోభులు ధనప్రాప్తులైరి
    పుణ్యవంతులు రోగభూత పీడితులైరి
    దుష్ట మానవులు వర్ధిష్ణు లైరి
    పక్షివాహన మా వంటి భిక్షుకులకు శక్తి లేదాయె, నిఁక నీవె చాటు మాకు
    భూషణవికాస శ్రీ ధర్మపుర నివాస దుష్టసంహార నరసింహ దురితదూర !! (52)

    ఓ నారసింహా ! ఈ లోకమదేమిటో కాని అతి విచిత్రంగా మారుతోంది. బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికి రాకుండా పోతున్నారు. ఏమాత్రం చదువు రాని శుంఠలు సభాపూజ్యులై సన్మానాలు పొందుతున్నారు. నిజం చెప్పేవారి మాట లోకవిరోధమౌతోంది. అబద్దాలాడేవారికి సమాజం లో అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ధర్మబుద్ధిగలవారు దారిద్య్రాన్ని అనుభవిస్తుంటే పిసినారులు ధనవంతులై కులుకు తున్నారు.పుణ్యాత్ములు రోగగ్రస్థులై పీడించబడుతుంటే పాపాత్ములు పల్లకీలలో ఊరేగుతున్నారు. ఓ గరుడవాహనా ! మావంటి యాచకులకు ఎటువంటి పోషణలేదు నీవే మాకు దిక్కు.
    Courtesy: Owner

    ReplyDelete
    Replies
    1. ఇదేదో ఈనాటి సమాజం, రాజకీయ నాయకులు, వ్యాపారులకు సరిగ్గా అతికేలా ఉంది అనుకున్నాను గానీ మకుటం చూసిన తరువాత “నరసింహ శతకం” లోనిది అని తెలిసింది. ఆ శతక కర్త శేషప్ప కవి గారు 18 వ శతాబ్దంలోనే ఈ మాట అన్నాడా, అశ్చర్యం.?

      Delete
    2. విన్నకోట నరసింహా రావు7 November 2023 at 11:59
      ఇదీ గతకాలవైభవమే! ఇప్పుడు ఈ శతకాలు చదివేవారూ లేరు, చదివి చెప్పినా, నేటి కాలానికి అన్వయించినా, వినేవారూ లేరు. ఇటువంటి శతక పద్యాలెన్నో,గతకాల వైభవం. ఈ పద్యంలో మొదటి రెండు చరణాలనూ నేటికి అన్వయించి రాస్తే, టపాగా
      నన్ను ఎగతాళీ చేసిన మేధావులున్నారు, పరమశుంఠలున్నారు.

      Delete
  3. మిగతా వస్తువులతోబాటు, మీరు Raleigh సైకిల్‌ని కూడా గతకాలపు చిహ్నంగా జమకట్టేసారు. అది ఇంకా వైభవంగా వెలుగుతూనే ఉంది. సైకిళ్ళు ఇంకొన్ని శతాబ్దాలు అలా వెలుగుతాయన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.

    ReplyDelete
  4. కాంత్8 November 2023 at 21:42
    Raleigh సైకిళ్ళు కనపట్టం లేదండి. ఇది అనుకోకుండా కనపడిందో చోట. ఇక హంబర్ సైకిలుండేది. ఇదైతే అసలు కలికానికి కూడా కనపట్టం లేదు. ఒకప్పుడు హంబర్ సైకిలుండటం గొప్ప. ఈ కాలంలో ఈ రకం సైకిళ్ళు కనపట్టం లేదండి. ఎక్కడ జూసినా స్పోర్ట్స్ సైకిళ్ళే!

    ReplyDelete