Monday 24 April 2023

ఫలాహారమే మేలు

ఫలాహారమే మేలు(2023)


కొత్తపల్లికొబ్బరి మామిడిపళ్ళు.




 వేసవి రావడం పళ్ళు రావడం, మార్కెట్ నిండా పళ్ళే! ఫలాహారమే చవగ్గా ఉన్నట్టుంది, ఇడ్లీ ,పెసరట్టు, ఉప్మాలకంటే.


పనసతొనలు మీడియం డజను ......30

ద్రాక్ష నలుపు/తెలుపు అరకేజి...... 50

ఆపిల్ కేజి ... .. 200

అరటిపళ్ళు అత్తం (24) పెద్దవి.... 100

దానిమ్మ మీడియం (12) కేజి .....200.ఒకటి 20

లంక దోసకాయ పెద్దది..... 60

కర్బూజా....30

పుచ్చకాయ మీడియం 1/6 వంతు ముక్క...... 10

సపోట కెజి మీడియం(24)........ 50

కమలా కేజి......... 200

బొబ్బాసికాయ మీడియం 1/6వంతు ముక్క......10

నేరేడు పళ్ళు 1/2 కేజి .....150

తాటిముంజలు12......60

జీడి మామిడి పళ్ళు 12.......50

వెలగపళ్ళు3........50

జామకాయలు కేజి.....50

కర్రపెండలం 1/2కేజి.......40

ఎండు ద్రాక్ష..కేజి (packed).......350

ఖర్జూరం 1/2 కేజి( Fresh fruit packed).....350

లేత కొబ్బరి నీళ్ళు,(పాకుడు). లీటరు....100

మామిడిపళ్ళు (కొత్తపల్లి కొబ్బరి)మీడియం..100...5000


రేగు సీజనయిపోయింది. తేగలు,బుర్ర గుంజు సీజనయిపోయింది.కమలా సీజన్ పూర్తికావస్తోంది.పంపర పనస,నారింజ మార్కెట్ కి రావటమే లేదు.అనాస సీజన్ మొదలుకాలేదు.


ఎన్ని రకాలపళ్ళు. మరేదేశం లోనూ ఇన్ని ఉంటాయా? ఉన్నాయా? 

................

ఇడ్లీ (మీడియం) 4 ...30

పెసరట్టు ....30

ఉప్మా...20


16 comments:

  1. ఆరోగ్యం పాడైపోదూ ఇలా ఫలాలంటూ కేజీలకొలదిగా ....
    :)


    జిలేబి( ఒక్క ముక్క చాలు )

    ReplyDelete
    Replies
    1. ఫలాపేక్ష....

      Delete

    2. Zilebi24 April 2023 at 09:59
      బుజ్జమ్మా అన్నీ కేజిలకొద్దీ తింటే ఏదైనా జబ్బు చేస్తుంది.పరిమితి ఉండాలి కదా!
      జిలేబి ముక్కచాలు చంపడానికి :)

      Delete

    3. bonagiri24 April 2023 at 13:07
      మొన్ననే ఎనిమిది పదులు నిండాయి. పరాపేక్షలో పడిపోయింది కోవిడ్ తరవాత పాపం, జిలేబి తిని తిని దయా బేటీస్ తో ఇలా అయిపోయింది.

      Delete
  2. “జిలేబీ”లకేం గానీండి కొత్తపల్లి కొబ్బరి మామిడి పండు రుచి అమోఘం 😜. చెరుకు రసాలు కూడా.

    అవును శర్మ గారు, మీ పోస్ట్‌లోని ధరల పట్టికలో చివరిలో కొత్తపల్లి కొబ్బరి 100 కాయలు 5000 రూపాయలన్నారు. అయిదు వేలా? అదిన్నూ “మీడియం”?? అచ్చుతప్పు గినానా?

    “ఆపిల్ కేజీ …. (10) …. 200” అన్నారు. కేజీ అన్నాక మళ్ళీ బ్రాకెట్లో 10 ఏమిటి? కేజీకి 10 ఆపిల్స్ తూగుతాయనా? నాలుగో అయిదో వస్తే గొప్ప, పది ఎక్కడ సర్?

    అరటిపళ్ళు డజను 100 రూపాయలా? అరటిపళ్ళండీ అరటిపళ్ళు …. !! అంత కామన్ పండు, సామాన్యుడి పండు. అది కూడా పండు ఒకటికి ఎనిమిది రూపాయల చిల్లరా 😳?
    అయినా ఇంకా పళ్ళే చౌక అంటారేమిటి మీరు?

    ఫలాల జాబితాలో వెలగపండు, కర్ర పెండలం కూడా చేర్చారేమిటి?

    ReplyDelete
    Replies
    1. సామాన్యుడి పండు
      విన్న కోట వారికి

      ఈ "సామాన్యుడి" డెఫినిషన్ తెలియజేయగలరు .

      Delete
    2. విన్నకోట నరసింహా రావు24 April 2023 at 13:07
      కొత్తపల్లి కొబ్బరి ఉత్పత్తి తక్కువ,డిమాండు ఎక్కువ. పచ్చికాయకే డిమాండు ఎక్కువ. పండుకి పారు ఎక్కువ. అందుకు ఈ కాయ మార్లెట్ కే రాదు, పొరబాటుగా వచ్చినా ఎవరూ కొనరు,రేట్ విని.మా గోజిలలో నేమాను పంపడానికి రెండున్నాయి. పులస కూర,కొత్తపల్లికొబ్బరి పండు. పండు మార్కెట్ కి రాదు రేట్ నేను చెప్పినది ఉజ్జాయింపే! అంతకు మించి ఎక్కువే ఉంటుంది, ధర.

      ఆపిల్ కేజి 200. బ్రాకెట్ లో చూపినది ఉజ్జాయింపు పళ్ళు. పది ఎక్కువే,సరిచేస్తాను.

      అరటిపళ్ళు భూషావలీ రకం అత్తం, దీనికి 24 కాయలు దాకా ఉంటాయి, అదీ పొరబాటు పడిపోయింది.

      మా వారం కొనుగోలు లిస్ట్ లో వెలగపళ్ళు,కర్రపెండలం ఉన్నయి అలాగే దీనికీ ఎక్కిపోయాయి. డయాబెటిస్ వారు తినేవే తినగలిగినవే ఇవన్నీ

      Delete
    3. Zilebi24 April 2023 at 17:29
      మాన్యుడు కానివాడు సామాన్యుడు. ఇదీ చెప్పాలేంటీ? :)

      ఇంత తెలిసియుండి ఈ గుణమ్మేలర పంతమ మొవ్వ/మువ్వ గోపాలా నా సామీ, ఇంత తెలిసియుండీ!
      అది మువా మొవ్వా? కొచ్చను.

      Delete
    4. >> ఇంత తెలిసియుండి ఈ గుణమ్మేలర పంతమ మొవ్వ/మువ్వ గోపాలా నా సామీ, ఇంత తెలిసియుండీ! అది మువా మొవ్వా? కొచ్చను.
      అది "మొవ్వ" అండి. ఒక గ్రామం పేరది.

      Delete


    5. Muvva Gopala
      Ippudee sandehamela vacchindi ?

      Delete
    6. మువ్వ గోపాలా నే అనుకుంటానండి.
      క్షేత్రయ్య గారి పదాలు చూడండి మువ్వ గోపాలా అనే ఉంటుంది. అఫ్ కోర్స్ వారి స్వగ్రామమైన మొవ్వ పేరుని వ్యావహారికంగా మువ్వ అంటారు.

      Delete
    7. ఈ Anonymous నేనే. లాగిన్ చెయ్యడం మరచితిని.

      Delete
    8. శ్యామలీయం25 April 2023 at 09:23
      ధన్యవాదాలు.

      Delete
    9. Anonymous25 April 2023 at 10:32
      Anonymous25 April 2023 at 10:35
      విన్నకోట నరసింహా రావు25 April 2023 at 10:36
      నిన్న ఉదయపు నడకలో ఒక మిత్రుడు గుర్తొచ్చాడు. ఏభై ఏళ్ళకితం మాట. ఇతను ట్రైనింగ్ సెంటర్ లో ఇనస్ట్రక్టరు, నా మిత్రుడు. అతని సబ్జక్టులో అపరిమిత పరిజ్ఞానం ఉన్నవాడు. ఇతనితో ఒకరోజు మాటాడుతూ, మీరింత అలవోకగా కళ్ళు మూసుకుని సబ్జక్ట్ చెబుతారు, దీని వెనక పరిశ్రమ ఏమన్నా!?అతను చిరునవ్వు నవ్వి ఇదంతా మువ్వగోపాలుని వైభవమే అన్నాడు. మీది మొవ్వా? అడిగా అవునన్నాడు. మీ ఊరిపేరు మొవ్వా? మువ్వా? అడిగా. అతను మా వూరిపేరు మొవ్వ అని రాస్తాం కాని మువ్వ అని పలుకుతామన్నాడు, మీరు చెప్పినట్టే. ఇది గుర్తొచ్చి అనుమానం తీరక....ఇంకో అనుమానమూ ఉండిపోయింది "ఇంత తెలిసియుండి" ఆ ఇంత తెలియడమేంటో తెలియలేదు. ఇదే ప్రశ్న మిత్రుడినీ అడిగా నవ్వేసేడంతే....

      Delete
  3. విన్నకోట నరసింహా రావు24 April 2023 at 13:07
    రేట్లు ఘనంగా కనపడచ్చు, కాని ఆపిల్ సపోట,అరటి,జామ లాటివి ఒక సారి కొంటేవారంకి సరిపోతాయి.నిజానికి మామూలు టిఫిన్ కంటే తక్కువే ఔతుంది. ఈ రేట్లలో కూడా పళ్ళు కొనకపోతే రైతెలాబతకగలడు సార్!

    ReplyDelete