Saturday 15 April 2023

భ్రమర,కీటన్యాయం.

 భ్రమర,కీటన్యాయం.

భ్రమరం అంటే తుమ్మెద. కీటం అంటే పురుగు. ఏంటీ (సామెత)న్యాయం?

కీటకం భ్రమరానికి చిక్కుతుందనీ, ఆ తరవాత భ్రమరం కీటకం చుట్టూ తిరుగుతుందనీ, ఆ కీటకం భ్రమరమవుతుందనీ చెబుతారు, పెద్దలు. కీటకం ఎప్పటికి భ్రమరం కాలేదంటారు, కొందరు.పెద్దలు ఇదెందుకు చెప్పినట్టూ, ఇందులో ఏదో గూఢం ఉందా? చూదాం!


కీటకమనే మనసు భ్రమరమనే ద్వేషానికి చిక్కుతుంది.చిక్కిన మనసు చుట్టూ ద్వేషం తిరుగుతూ ఉంటుంది.  ఎంతకాలం? కీటకం భ్రమరమేదాకా!అంటే మనసు ద్వేషంతో నిండిపోయేదాకా!


ఇది ఒక ద్వేషానికే చెప్పుకోనక్కర లేదు. పగ,ద్వేషం ఇలా అవలక్షణాలకే మనసు చిక్కుతుందనే పెద్దల మాట.భక్తికి చిక్కదా? బహు అరుదు. అలా భక్తి భ్రమరానికి మనసనే కీటకం చిక్కితే అదే అదృష్టం.

3 comments:


  1. -

    మనసను కీటకము భ్రమర
    మను భక్తికి చిక్కి విభుని మదిలో గొల్వం
    గనవరతము, శరణాగతి
    మనుగడ యై గాచు నిన్ను మహిని జిలేబీ

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. Zilebi16 April 2023 at 06:00
      ద్వేషం అబ్బినట్టు భక్తి పట్టుకోదు కుందనం!

      Delete

    2. ద్వేషంబబ్బిన విధముగ
      యోష! జిలేబి మనుజులకయో భక్తి సదా
      జోషివ్వదె కుందనమా
      వేషములకు దొరకడె ప్రభు వెప్పుడు సుదతీ


      జిలేబి

      Delete