Sunday 9 April 2023

కమే! కమే!! కమే!!!

 కమే! కమే!! కమే!!!


ఎక్కడజూసినా కమే మాటే!

కమే ఏంజెయ్యగలదయ్యా? అడిగేడో జ్ఞిజ్ఞాసువు 

ఏమైనా చెయ్యగలదన్నాడో మేధావి.

కొన్ని ఉజ్జోగాలే పోతాయన్నాడు మరొకడు.

అదేంజేయగలదు? ఏం ఉజ్జోగాలో పొతాయో చెప్పరాదే అడిగేడు మరో పెద్దమడిసి.

ఇనుకోండి. 

లెక్కల్లో బొక్కలు సిటికలో కనిపేట్టస్తది. అక్కౌంటెంట్లు, ఆడిటర్ల పని కాళీ!

గ్రంధాలు, ఉద్గ్రంధాలు రాసేయగలదు, కవులు కళాకారులు పని ఖాళీ!

ఇలా జెప్పినియ్యి కొన్నే!సమస్యలు చిటికిలో విడదీసెయ్యగలదు.ఏమైనా చేసెయ్యగలదు, చెప్పేసేడు. ఇలా చాలా చాలా పనులు చేసెయ్యగలదు, చాలా ఉజ్జోగాలు  హాంఫట్, బెదిరించేడు.

ఐతే చెయ్యలేనిదేం లేదంటావ్? అడిగేడు మరో అనుమానం  పక్షి.

దానే అడిగేదాం అనేసేడు ఒక విజ్ఞాని.

ఉదాహరణ చెబుతా వినండి.

ఒక జడ్జీగారు తను ఇవ్వబోయే తీర్పు ఎలా ఉండాలో అని కమేని అడిగితే ఆయనేమని రాసేడో తీర్పు అలాగే చెప్పేసిందిట. అదిజూసి ఆయన నోరొదిలేసేడంట. ఆయనేజెపిండు, ఇటు సెయ్యద్దూ, ప్రమాదమూ అని.

మరో ముచ్చట. ఒకయనో ముచ్చటజెప్పిండంట, సేనాకాలం కితం. అది వివాదం అయ్యిందంట, నాడు. నేడు కమేని అడిగితే ఈన జెప్పిందే నిజమన్నదంట. ఆయనో డప్పేసుకుని జెప్పుకుంటాన్నాడు.

ఐతే కొన్ని కొచ్చన్లేదాం ఏటి జెప్పుద్దో!

2024 లో మోడీగారు ప్రధానిగా ఎన్నిక కాకపోతే ఏం జేసుకు బతగ్గలడు?

హిమాలయాల్లో టీ అమ్ముకుని ఐనా బతికెయ్యగలడని ఆన్సరు.

2024 లో రాహుల్ బాబా ప్రధానిగా ఎన్నిక కాలేకపోతే ఏ0 చేసిబతగ్గలడు?

ఏమీ చెయ్యలేడు. ఏమీ చెయ్యలేకపోయిన బతికెయ్యగలడు ఆన్సరు.

అమ్మాయి నీళ్ళడుతోంది ఏబిడ్డ?

Input డాటా ఇనకంప్లీట్, ఆన్సరు.

నువ్వు చెయ్యలేనిదేంటో చెప్పూ?

కొన్ని నిమిషాలే మౌనం. ఏమైందీ అని భయపడ్డారు, జనం. నోరిప్పింది కమే,

  పిడక పజ్యాలు రాయలేను, ఆన్సరు.


ఇది చదివి నవ్వుకోండి. ఏవరికైనా బాధ కలిగితే బాధ్యత నాది కాదు కమేదేస్మీ!

So many errors, correct them yourself :)

10 comments:

  1. పిడక పజ్యాలు రాయలేను

    హమ్మయ్య నాకు ఢోకా కాంపిటీషను లే :)


    బాగున్నారాండీ ?


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఆహా, ఇది కదా positive attitude అంటే 👏🙂.

      Delete
    2. Zilebi9 April 2023 at 10:16
      गाडी चल्ती है, कभी कभी डकॆलना पडताहै बूढी हॊगया ना, आप्के जैसॆ जवान नही :)

      Delete
    3. चल्ति क नाम् गाडी :)

      Delete
  2. అమ్మ జిలేబీ. ఈమాట నేను అనేస్తాను సుమా అని గ్రహించేసి మీరే ముందే చెప్పేసుకున్నారే. ఏం‌ గడుసుతనం!
    అన్నట్లు మీకో మంచి కందయ్య గారు సహయం దొరికారు బ్లాగు రీడర్ల బుఱ్ఱ తినటానికి. వారు సెలవిస్తున్న ఘంటసాల పాటల "కందాలు" చదివి తరించండి. ఇన్నాళ్ళూ మాయమైనందుకు మీకదే శిక్ష ప్రస్తుతానికి.

    ReplyDelete
    Replies
    1. మీ రామ కీర్తనలకు కూడా ఢోకా లేదండీ :) నిశ్చింతగా మీరల్లుకుంటూ పోవచ్చు :)

      నారాయణ!
      జిలేబి

      Delete
  3. అక్కడ "జిలేబీ" గారు రావడం ఇక్కడ శర్మగారు విజృంభించడం చూస్తూంటే నాకేదో సందేహం వస్తోంది ఇద్దరూ ఒక్క శాల్తీయేనేమో ?

    ReplyDelete
    Replies
    1. బహుశా శర్మ గారి Robot (చిట్టి) జిలేబి అయి ఉండచ్చు.

      Delete
  4. పద్య పిడకలు
    కంద పుడకలు
    కరోనా పీడ కలలు
    పునరావృతం.

    ReplyDelete
    Replies
    1. పద్యపిడకలు, కంద పిడకలు అనకూడదండి దుష్ట సమోసాలవుతాయి.

      పద్యపు పిడకలు
      కందపు పిడకలు అనండి.

      Delete