మరచిపోనివాళ్ళు.
లోకంలో ఎవరూ ఎవరినీ గుర్తుపెట్టుకోరు, బంధువులు,స్నేహితులు, సంతాప సభదాకా. కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు,అల్లుళ్ళు రోజులెళ్ళేదాకా, విధిలేక;సొమ్ములేమైనా ఉంటే పంపకాల దాకానే. ఆ తరవాత నమోనారాయణ. మరచిపోవడమే అందరి నైజం,కనపడినంతవరకే కత నడిచేది.
కాని మరచిపోని ఆఫీసర్లు ఇద్దరున్నారు.
బతికున్న కాలంలో పెన్షన్ చెల్లించే ఆఫీసరు, డిజిటల్ లైఫ్ సర్టిఫికట్ కోసం,చేయని ప్రయత్నం అంటూ ఉండటంలేదు. పెన్షనర్ కి విసుగొచ్చేలా ఎస్.ఎం.ఎస్ లు ఇచ్చి ఇచ్చి విసిగిపోతారు. వాటికి సమాధానం లేకపోతే, పెన్షనర్స్ యూనియన్లకి తెలియ జేస్తున్నారు. పెన్షనర్ బేంకు నుంచిగాని,పోస్టాఫిస్ నుంచి గాని పెన్షన్ సొమ్ము తీసుకుంటుంటే ఆ ఆఫీసులవాళ్ళకి రిమైండర్ మీద రిమైండర్ ఇచ్చి పెన్షనర్ ఇంటికి వెళ్ళండి,అతని పరిస్థితి చూడండి. లైఫ్ సర్టిఫకట్ ఇవ్వలేదు,ఇచ్చినదాని కాలం చెల్లిపోతోంది. కాలం చెల్లిన లైఫ్ సర్టిఫికట్ పై పెన్షన్ చెల్లింపు కుదరదు,పెన్షన్ ఆపేయాల్సి వస్తుంది. పెన్షనర్ కదలలేని స్థితిలో ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఏమైనా కదలలేని ఇబ్బందిలో ఉన్నా, ఇంటి దగ్గరనుంచే లైఫ్ సర్టిఫికట్ ఇచ్చే ఏర్పాటు చూడండి. కష్ట సమయంలో పెన్షన్ లేకుండా చేయకండి,అనిపోరుతున్నారు. ఇది మీ బాధ్యతకూడా, అతని పెన్షన్ అక్కౌంట్ మీదగ్గరుంది గనక అని పెద్దరికం కూడా వహిస్తున్నారు.
ఇక రెండవవారు ఇన్ కం టాక్స్ ఆఫీసరు.
మీరు ఇన్ కం టాక్స్ ఐ.టి.ఆర్ ఫైల్ చేసే సమయం దగ్గరపదుతోంది,తొందరలో చెల్లించవలసిన టాక్స్ చెల్లించండి,ప్రశాంతంగా ఉండండి.సమయం దాటితే పెనాల్టీలు పడతాయి,సొమ్ము చెల్లిOచండని ఒకటే పోరు. ఇక వీరైతే చనిపోయాకా కూడా వదలిపెట్టరు. బతికున్నకాలంలో సంపాదించిన సొమ్ముకి టాక్స్, పోయినా వసూలు చేస్తారు. పోయాకా, పోయినవారి పేరవచ్చిన సొమ్ముల మీద కూడా టాక్స్ పుచ్చుకోక వదలరు. వారసులు చెల్లించకపోతే పోయినవారి ఆస్థులు,బేంక్ ఏక్కౌంట్లతో సహా సీల్ చేసి,తమకురావలసిన సొమ్ములు వసూలు చేసుకు తీరతారు.
బతికుండగానూ పోయాకా కూడా గుర్తుంచుకునేవారు,ఇన్ కం టాక్స్ ఆఫీసరు. బతికుండగా వెంటబడి లైఫ్ సర్టిఫికట్ కోసం గుర్తుచేసి,అది పుచ్చుకుని పెన్షన్ చెల్లించే, పెన్షన్ ఆఫీసర్.
"ఇంటి దగ్గరనుంచే లైఫ్ సర్టిఫికట్ ఇచ్చే ఏర్పాటు చూడండి"
రిప్లయితొలగించండిశర్మ గారూ.. ఇప్పుడు ప్రతీ ఏటా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికట్ మీ మొబైల్ ద్వారా క్షణాల్లో పొందవచ్చు కదా ... పెన్షన్ ఆఫీసుల చుట్టూ తిరగనవసరం లేదు. "జీవన్ ప్రమాణ్" అప్లికేషన్ ఉందిగా!
శ్రీనివాస్ జీ,
తొలగించండిజీవన్ ప్రమాణ్ వచ్చింది మొదలు ఆఫీసులచుట్టు తిరగడం పోయింది. జీవన్ ప్రమాణ్ కి ఇవ్వడానికి అందరికి ఆ వివరాలు తెలియవు. ఇప్పుడు ఫేస్ రికగ్నిషన్ తో కూడా లైఫ్ సర్టిఫికట్ ఇవ్వచ్చు. ఇంత టెక్నాలజీ ని ఉపయోగించుకోగలిగిన వారు వయసు మళ్ళినవారిలో తక్కువ. ఎక్కువమంది స్త్రీలు వీరు ఫేమిలీ పెన్షనర్లు,పల్లెలలో, మారుమూల ప్రదేశాల్లో ఉంటారు. వీర్ని చేరడం కష్టం. ప్రభుత్వం ఈ లైఫ్ సర్టిఫికట్ కూడా అందరిని ఒకసారే ఇమ్మనక నెలకి కొంతమంది దగ్గర తీసుకుంటోంది,అలా అందరిని పన్నెండు నెలలకూ సర్దుబాటు చేసారు. చిన్న పట్టణాల్లో కూడా లైఫ్ సర్టిఫికట్ మేళాలు నిర్వహిస్తున్నారు. ఇంతైనా నెలకు మూడువందల మందిదాకా లైఫ్ సర్టిఫికట్ ఇవ్వక ఇబ్బందులు పడుతున్నారు. అందుకుగాను యూనియన్లకి లిస్ట్ ఇస్తున్నారు,మీరూ వారిని చేరుకోడానికి ప్రయత్నించమని. అలాగే బేంకులకు,పోస్టాఫీసులకు కూడా తెలియ జేస్తున్నారు.
ఇన్ని చెప్పిన నేనే నిరుడు లైఫ్ సర్టిఫికట్ ఇవ్వడానికి ఇబ్బంది పడి ఆలస్యంగా ఇచ్చాను. చెప్పలేం ఎవరి ఇబ్బంది ఎలా ఉంటుందో!
జీవన్ ప్రమాణ్ ద్వారా చాలా ఈజీగా పేస్ రికగ్నిషన్ తో లైఫ్ సర్టిఫికట్ ఇవ్వచ్చు. ఇది చాలా మందికి తెలీడం లేదు అనేది వాస్తవం
తొలగించండితాతగారూ
రిప్లయితొలగించండికుశలమేనా ?
జిలేబి
ఏమి చెప్పుదును జిలేబి
రిప్లయితొలగించండితలుచుకున్నందుకు ధన్యవాదాలు.
బతుకు భారంగా ఉంది,వానలేక. నిన్నటిదాకా అక్షతల్లా పడ్డచినుకు నేడు లెక్కపెట్టగల వరసకు చేరింది.పట్టణాలు ములుగుతున్నాయి,ముంబై మొదలు,రాజమండ్రి దాకా. చిత్రంగా పల్లెలలో చినుకు లేదు.పంటమాట పరమాత్మకే తెలుసు. వారంగా మబ్బుంది,వేడి తగ్గలేదు.ఎల్ నినో మా ముఖాల వేలాడుతోంది.
ఇక,ఎలపట,దాపటలకు సమన్వయం తగ్గింది,కత్తెర పడక తప్పదన్నారు,మరువారమేమో కావచ్చు. అదే ఐతే ఆగస్టుదాకా ఇంతే సంగతులు.
చిత్తగించవలెను.
శ్రీశ్రీశ్రీ
ఇట్లువిధేయుడు