డిసెంబర్ 21 -భాస్కరదర్శనం
డిసెంబర్ 21 తేదీనాడు సూర్యుడు, భూమి యొక్క దక్షణార్ధగోళం లోని మకరరేఖకి అభిముఖంగా ఉంటాడు. దీనివల్ల ఇప్పటికే వేసవితో అల్లాడుతున్న అస్ట్రేలియా,న్యూజిలాండు,దక్షణ ఆఫ్రికా,దక్షణ అమెరికాదేశాలకి మండుటెండ, ఐతే మనకి చలి చాలా బాధ పెడుతోంది. మనకంటే యూరప్ ఉత్తర అమెరికా,రష్యా దేశాలైతే చలికి వణుకుతున్నాయి. సూర్యుని రెండు ఆయనాలలో ఉత్తరాయణంలో మనకు మండుటెండలు కదా. అందునా కర్కాటకరేఖ మనదేశం మీదుగా ఉంటుంది.నేడు మనకి రాత్రి భాగం ఎక్కువుంటుంది,అనగా సూర్యాసమయ,సూర్యోదయ కాలాలమధ్య సమయం సంవత్సరంలోని ఇతరరోజులకంటే ఎక్కువ ఉంటుంది. (Longest night) నేడు యాదృఛ్ఛికంగా ఒక మిత్రుడు గ్రూప్ లో పెట్టిన వీడియోలో ఉషా,ఛాయా,పద్మినీ,సౌజ్ఞా సహిత సూర్యనారాయణమూర్తి నిజదర్శన భాగ్యం కలిగింది. ఎన్నిసార్లు గొల్లలమామిడాడలోని స్వామిని దర్శించినా ఈ దర్శన భాగ్యం నోచుకోలేదు.
ఓయ్! "జిలేబి వదిన" ఏమయ్యింది నీకు?
ReplyDeleteఈ రోజు ఉదయం ప్రచురించిన ఈటపా ప్రచురించలేదు,మళ్ళీ 11 కి ప్రచురించాను,అప్పుడూ ప్రచురించలేదు,మళ్ళీ 1230 తరవాత ప్రచురించా,ఇప్పటిటివరకు వదిన ప్రచురించలేదు,ఏమయిందీ? అమాసకి పున్నానికి తేడా చేస్తూ ఉంటుందా?😂
ఉదయమే ప్రచురించిన కామెంట్లు మాత్రం మధ్యాహ్నం 2 దాటేకా ప్రచురించింది. ఈ కామెంట్ ఎప్పుడు ప్రచురిస్తుందో! భగవాన్ జానే😜
సూర్య కిరణాల వల్ల ఉషోదయాలు
ReplyDeleteఛాయ లేర్పడు , పద్మాలు పూయు భువిని
ఛాయ , ఉష , పద్మముల నిట్లు సతుల జేసి
సూర్యుడికి ప్రక్క నిలిపిరి ఆర్యు లౌర !