చిత్రం: చిరంజీవులు (1956)
సంగీతం: ఘంటసాల
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల
పల్లవి:
హాయ్...
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
మనసైన చినదానికి అందానికి...
మనసైన చినదానికి అందానికి...
కనుసైగ మీద మనసు
ఆ..ఆ..ఆ..ఆ..
చరణం 1:
అరె.. చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నది
చిన్నదాని సిగలో రేకలెన్నో
గవ్వకన్ను రైక మీద చుక్కలెన్నో
ఎన్నుకో ...
ఎన్నుకో వన్నె లెన్నుకో చిన్నె లెన్నుకో
వన్నెచిన్నె లెన్నుకో ఎన్నికైన చిన్నవాడా
ఆ..
ఆ..
పైర గాలి ఘుమఘుమలో
చెంగావి చెంగు రిమ రిమలో
ఆ..ఆ..ఆ..
చరణం 2:
అరె దిరెసిన పువ్వు మీద చిలుకూ ముగ్గులు
చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు
మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు
మనసే ..
ఆహా..
మనసే మరుమల్లె దొంతర
మన ఊసే విరజాజి దొంతర
పాల వెన్నెలలో ..మురిపాల వెన్నెలలో..
గీతరచయిత: మల్లాది
నేపధ్య గానం: ఘంటసాల, పి. లీల
పల్లవి:
హాయ్...
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
చికిలింత చిగురు సంపంగి గుబురు
చిన దాని మనసు చినదాని మీద మనసూ
మనసైన చినదానికి అందానికి...
మనసైన చినదానికి అందానికి...
కనుసైగ మీద మనసు
ఆ..ఆ..ఆ..ఆ..
చరణం 1:
అరె.. చెంపకు చేరడేసి కన్నులున్న చిన్నది
చిన్నదాని సిగలో రేకలెన్నో
గవ్వకన్ను రైక మీద చుక్కలెన్నో
ఎన్నుకో ...
ఎన్నుకో వన్నె లెన్నుకో చిన్నె లెన్నుకో
వన్నెచిన్నె లెన్నుకో ఎన్నికైన చిన్నవాడా
ఆ..
ఆ..
పైర గాలి ఘుమఘుమలో
చెంగావి చెంగు రిమ రిమలో
ఆ..ఆ..ఆ..
చరణం 2:
అరె దిరెసిన పువ్వు మీద చిలుకూ ముగ్గులు
చిన్నదాని బుగ్గ మీద చిలిపి సిగ్గులు
మల్లెల దొంతరలు మరు మల్లె దొంతరలు
మనసే ..
ఆహా..
మనసే మరుమల్లె దొంతర
మన ఊసే విరజాజి దొంతర
పాల వెన్నెలలో ..మురిపాల వెన్నెలలో..
పాటలోంచి పడుచు జంటల వాసన గుప్పున కొడుతోంది. ముదిమిలో కాలుతున్న నైరాశ్యపు కమురు వాసన కూడా. :)
ReplyDeleteతాతగారూ
గవ్వకన్నుల రైక ని అరవంలో జన్నల్ పోట్ట జాక్కెట్టని ఓ అరవ కవి కాపీ కొట్టేసాడో సాంగులో :)
Zilebi1 September 2025 at 04:09
Deleteపడుచు జంటల వాసన గుబాళిస్తోంది. మత్తెక్కించే బొండు మల్లె,దొంతరమల్లె,వాసనలతో సన్నజాజి,విరజాజి వాసనలతో మత్తుతో పిచ్చెక్కిస్తోంటే, ముదిమిలో నైరాశ్యపు కమురు వాసన సూచనెక్కడా? కనపడలేదే,వినపడలేదే... ఎక్కడో చెబితే బావోదూ.....
గవ్వకన్ను రైక ఉందనమాట,నాకు తెలియదు, ఐతే గవ్వకన్నుల్ని లెక్కెట్టుకోమందా? గవ్వకన్నెలా ఉంటదబ్బా!🤣🤣🤣
సరే తమిళ కవి కాపీ కొట్టేడంటారా? తమదంతా కాపీ,పేస్టు సరుకుకదా! అందరూ అలాగే అనుకుంటే ఎలా?🤣
చిన్న పట్టణమది. ఒక షాపు ముందు యువకుల గుంపు నిలబడింది. అన్నా ఈసారి గణపతిని పెట్టడానికి చందా ఎంత వ్రాయమంటారు? అనడిగిన యువకుడితో అంగడి యజమాని , మీరంతా ఎవరు? ఎపుడూ చూడలేదే? అన్నాడు.
ReplyDeleteఅదేమిటి అంకుల్, ఎన్నో ఏళ్ళనుండి ఈ వీధి చివర గణపతిని కూర్చోబెడుతున్నాము. ఇలాగంటే ఎలా ? అన్నాడు మరో యువకుడు. అది తెలుసు కానీ మీరు మాత్రం తెలీదు అన్నాడు అంగడి యజమాని. గుంపులోని మరో యువకుడు, అంకుల్ మేమూ ఈ ఏరియా వాళ్ళమే. మా ఇళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి. గణపతిని కూర్చోబెట్టేది మేమే. మీరు ఉదయం నుండి రాత్రి దాకా షాపులోనే ఉంటారు గదా, అందువల్ల మమ్మల్ని చూసి ఉండకపోవచ్చు. అన్నాడు.
దుకాణం యజమాని , అది సరేలే... మా అంగడికి వస్తుంటే గదా తెలిసేది. అరే! నీ షర్ట్ చాలా బాగుంది. ఏ అంగడిలో తీసుకున్నావు? అన్నాడు.
ఇక్కడెక్కడా కాదు. ఆన్ లైన్ లో ఆర్డర్ పెట్టి తెప్పించాను అన్నాడు కాస్త గర్వంగా ఆ యువకుడు.
అదే అనుకున్నాను. మీరంతా కొత్త ముఖాలే కాదు, మీరు వేసుకున్న బూట్లు, మెడలో చైన్లు చాలా బాగున్నాయి. ఇవన్నీ ఎక్కడ దొరికాయి? అడిగాడు అంగడి యజమాని.
ఇవన్నీ ఈనాటి ట్రెండ్ అంకుల్. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నవి. వగలుపోయాడు మరో యువకుడు.
అవునా? ఈ అమెజాన్ , ఫ్లిప్ కార్ట్ వాళ్ళకు ఎంత చందా వ్రాసారు. చాలా పెద్ద పెద్ద కంపెనీలు గదా ? మొత్తం గణేశోత్సవ ఖర్చంతా ఇచ్చి ఉండవచ్చుగదా! అన్నాడు అంగడి యజమాని.
యువకులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటుండగానే, వారిలో ఒకడు, ఎక్కడో ఉన్న వాళ్ళను ఎలా అడగ్గలం... మన వీధి గణపతి... మనవాళ్ళు ఇవ్వాలి అంకుల్. మేమేమైనా మా స్వంతానికి చేస్తున్నామా ? మన ధర్మం కాపాడబడాలి గదా అన్నాడు. అంగడి యజమాని కాసింత విషాదంగా, అవునయ్యా అదే లెక్కలో మాలాంటి వారందరమూ ధర్మ విరోధులం అవుతాము. అయితే మీకు మాత్రం మీ డబ్బును లోకల్ మార్కెట్ లో ఖర్చు చేయడం ధర్మం అని మాత్రం అనిపించదు. సమాజం నుండి డబ్బులు వస్తేనే గదా, మేము దానినుండి మా ఖర్చులు మిగిల్చుకుని, వచ్చిన లాభం నుండి చేతనైనంత దానధర్మాలకు వాడేది? కొనుక్కునేటపుడు చాలా బెస్ట్ అన్పించే ఆన్లైన్ వారినే మీ ధర్మం కాపాడే పనికీ వాడుకోవచ్చు గదా ? సరేలే. మీతో వాదించడం, డబ్బులివ్వకుండా ఉండడానికి నెపం వెదకడం నా ఉద్దేశ్యం కాదు. ఎంతో కొంత ఇచ్చే పంపుతాను. అయితే వచ్చే సంవత్సరం ఈ సమయానికి ఈ స్థలంలో నేను ఉంటే మాత్రమే ధర్మం కాపాడే మీ ప్రయత్నానికి నా చెయ్యి వేయగలను. లేకపోతే మీరంతా ఆన్లైన్ వాళ్ళ అడ్రస్ వెదకడం అనివార్యమవుతుంది చూడండి అన్నాడు.
ఆ యువకులకు ఎంత అర్థమైందో తెలీదు. మనకు అర్థమైందా?
bonagiri5 September 2025 at 21:53
Deleteఇదే విషయం పొరుగింటి పుల్లకూర రుచి టపాలో చెప్పేనండి. నేటి యువతకు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అనిపిస్తూ ఉందండి. చివరి మాటలు అర్ధమైతే అక్కడ దొరికే సరుకులు అక్కడే కొంటారు, మరు సాలుకి కూడా కొట్టు ఉంటుంది,గణపతి చందా అడగచ్చు, లేకపోతే కొట్టు మూతబడుతుంది,గణపతి చందా అడిగేందుకు అమ్మీజాన్ వాడు అక్కడ ఉండడు🤣
అమ్మీ జాన్ వాడు అక్కడ ఉన్నా చందా ఇవ్వడు,👍🤣