Tuesday, 1 July 2025

ఏది శాశ్వతం?

 ఏది శాశ్వతం?

(రవీంద్రనాథ్ ఠాగూర్  అద్భుతమైన కవిత)



"నేనిక లేనని తెలిశాక  

విషాదాశ్రులను వర్షిస్తాయి నీ కళ్ళు..

కానీ  మిత్రమా! అదంతా నా కంట పడదు!

ఆ విలాపమేదో ఇపుడే నా సమక్షంలోనే కానిస్తే పోలా! 


నీవు పంపించే పుష్పగుచ్ఛాలను 

నా పార్ధివదేహం ఎలా చూడగలదు?

అందుకే... అవేవో ఇప్పుడే పంపరాదా!


నా గురించి నాలుగు మంచి  మాటలు పలుకుతావ్ అప్పుడు కానీ అవి నా చెవిన పడవు..

అందుకే ఆ మెచ్చేదేదో ఇప్పుడే మెచ్చుకో !


నేనంటూ మిగలని నాడు 

నా తప్పులు క్షమిస్తావు నువ్వు !

కానీ నాకా సంగతి తెలీదు..

అదేదో ఇపుడే క్షమించేయలేవా?!


నన్ను కోల్పోయిన లోటు నీకు కష్టంగా తోస్తుంది

కానీ అది నాకెలా తెలుస్తుంది?

అందుకని ఇప్పుడే కలిసి కూర్చుందాం కాసేపైనా !


నాతో మరింత సమయం గడిపి ఉండాల్సిందని నీకనిపిస్తుంది

అదేదో ఇప్పుడే గడపవచ్చుగా మనసారా!


సానుభూతి తెలపడానికి 

నా ఇంటి వైపు అడుగులు వేస్తావ్.. 

నా మరణ వార్త విన్నాక! 

సంవత్సరాలుగా మనం ఏం మాట్లాడుకున్నామని?


ఇప్పుడే నావైపు చూడు, నాతో మాట్లాడు,

బదులు పలుకుతాను, కాసేపైనా గడుపుతాను

హాయిగా నీతో మెలుగుతాను!"

------------------------------------------------

- ఇదే విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన అద్భుతమైన కవిత. అందుకే  బ్రతికుండగానే ఆప్యాయంగా పలకరించుకుందాం! కష్టసుఖాలు పంచుకొందాం! ఒకరికొకరమై మెలుగుదాం! ఉన్నన్నాళ్ళూ కలిసిమెలసి బతుకుదాం!!*

                   

ఈరోజు కలిసిన, మాట్లాడిన వ్యక్తి 

మళ్ళీ కలుస్తాడో లేదో? 

మాట్లాడతాడో లేదో?    

  

ఏది శాశ్వతం?

ఎవరు నిశ్చలం?🌹🌹🙏...శ్రీ 🦋

----------------------------------------------------------

Coutesy:Whats app

విశ్వకవికి శతాధిక వందనాలు.

  జీవిత సత్యం తెలుపుతూ టాగూర్ రాసిన ఇంత అద్భుతమైన కవిత ఉన్నదని నాకు నేటివరకు తెలియదు.

 దీనిని వాట్సాప్ లో పంచుకున్న విన్నకోటవారికి 

 వందనాలు.


కావలసినవారో పైవారో అందరిని పలకరించండి,తడిసిపోయిన నులక మంచంలా బిగుసుకుపోకండి. అంతర్ముఖులు కాకండి.

ఒక వయసొస్తేగాని ఈ కవితలో అందం ఒంటబట్టదేమో 🤣 

2 comments:

  1. అద్భుతమైన కవిత 🙏.
    మీరున్నూ జీవితసత్యం చెప్పారు “ఒక వయసొస్తే గానీ ఈ కవితలో అందం ఒంటబట్టదేమో” అని 🙏.

    స్వంతడబ్బా అని కాదు గానీ ఈ కవిత చదవకముందు కూడా నేను అనేవాడిని - ఎదుటివాళ్ళకు చెప్పదలుచుకున్న మంచి మాట వాళ్ళు బతికున్నప్పుడే చెప్పు, తరువాత సంతాపసభల వరకు వేచి ఉండకుండా ;
    రెండవది …. ఎవరైనా వయోవృద్ధులను ఓసారి వెళ్ళి చూసిరావాలి అనిపిస్తే ఆ పని వెంటనే చేసెయ్యి, తరువాత అయ్యో చూసొస్తే బాగుండేదే అని వగచే పరిస్థితి తెచ్చుకోకు - అని.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు1 July 2025 at 11:36
      డెభ్భై ఏళ్ళకితం పదహారేళ్ళ వయసులో Ehere the mind is without fear and the head is held high, where knowledge is free.... చదువుకున్నా! ఏం అర్ధమయింది? వయసుతో ఆలోచన పెరిగింది,మనసు పరిపక్వం చెందుతూ వచ్చింది,కొత్త కొత్త అర్ధాలు స్ఫురిస్తాయి.
      చిన్నపుడు శతకాలు బట్టీ వేయించారు,ఏం అర్ధమయింది? కాలంతో వయసు పెరిగి జీవితంలో ఆ శతకాల పద్యాలు అర్ధమయ్యాయి. జీవితంలో వివిధ రకాల మనుషులు తారస పడితే,వివిధ రకాల పరిస్థితులలో ఉంటే జీవిత సత్యాలు బోధపడ్డాయి.
      అందుకే వయసొస్తే గాని సొగసులు అర్ధం కావు 🤣

      Delete