Monday, 24 February 2025

కూరలు,పళ్ళు..

కూరలు. రెండు రకాల వంకాయలు.వాటిలో మళ్ళీ రకాలు. ఉల్లిపాయ.ములక్కాడ సీజనైపోతోంది. టమేటో.చిక్కుళ్ళు. పచ్చి మిర్చి,అందులో రెండు రకాలు.బంగాళాదుంప. అల్లం.కేరట్,బెండకాయ(పూసా పర్పుల్)



ఉల్లికోళ్ళు.జేగురుపాడు వంకాయ. వేరుశనగ.రాచౌసిరి(సీజన్ చివరకొచ్చేసింది)


రేగుపళ్ళు,అందులో రెండు రకాలు.పెండలం. సూర్య గుమ్మడి. బూడిదగుమ్మడి.

 కమలా నారింజ.దానిమ్మ.ఆపిల్.నల్ల ద్రాక్ష,తెల్లద్రాక్ష.పుచ్చకాయ.డ్రాగన్ ఫ్రూట్.

మైన్ రోడ్ చాలా వెడల్పుగా ఉంటుంది. అంతా సిమెంట్ రోడ్,కిలో మీటర్ పొడవు. మధ్యలో ఈ పళ్ళకొట్లు. పెద్ద సంత పక్కనే నాలుగెకరాలలో షెడ్డుల్లో కొంత ఆరు బయటకొంత. ఇలా కొనసాగుతుంటుంది. పల్లెటూళ్ళలో పళ్ళ వినియోగం బాగా పెరిగింది.ఈ సంవత్సరం వెలగపళ్ళు దొరకలేదు,

కర్ర పెండలం సీజనిదే అయిపోవచ్చింది. మామిడి,పనస, నేరేడు  వగైరాసీజన్ రాబోతోంది.
T centre(దుర్గాసెంటర్ అంటాం) సెంటర్లో ఇంకా పెద్ద పళ్ళకొట్లు ఉన్నాయి.

21 comments:

  1. పళ్లున్నాయాండీ ?

    ReplyDelete
    Replies
    1. మీకు కావాలాండీ?

      Delete
    2. మాకున్నాయండీ తాతగారి కుందా అని ప్రశ్న అండి :)

      Delete
    3. దంతములు అని “జిలేబి” గారి వెటకారం అయ్యుండచ్చు, బోనగిరి గారూ.

      Delete
    4. Zilebi25 February 2025 at 14:22

      మా దగ్గర సీజన్లో దొరికే పళ్ళన్నీ దొరుకుతాయి. మీ దగ్గర దొర్కనివేవో చెబితే అడ్రస్,పేరు,ఊరు చెబితే పంపేవాణ్ణే కదూ! రేగుపళ్ళ సీజన్ అయిపోవచ్చింది.

      Delete
    5. Bonagiri25 February 2025 at 20:16
      మా ఊరుకి టిక్కట్టు కావాలనే రకం కదు సార్

      Delete
    6. విన్నకోట నరసింహా రావు26 February 2025 at 08:32
      దక్ష యఙ కాలం నుంచి భాస్కరునివి యాజమాన్య దంతాలే కదు సార్! పాయసమే ఆరగింపున్నూ.

      Delete
    7. తాతగారి స్టైల్ ఆఫ్ జవాబు తారగారిదే :) మరెవ్వరూ
      ఎవ్వరూ ఇవ్వలేరిలా

      Delete
    8. Zilebi26 February 2025 at 10:54
      మధ్యలో "తార" ఎవరో స్మీ 😊

      Delete
    9. రవిగాంచని పదార్థము గలదే నిండార....:)

      Delete
    10. Zilebi26 February 2025 at 13:33
      రవి గాంచని చోట 'కవి ' గాంచునేకదా!

      Delete
    11. మీరు రెండున్నూ రవి కవి డబల్‌ ధమాకా :)

      Delete
  2. మట్టి ప్రమిద లోన , మరి కాను పించడు
    నూనె లోన గనగ , నోప మతని
    ప్రత్తి లోను , దాని వత్తిలో గనరాని
    శివుడు , దివ్వె లోన చేరి వెలుగు .

    ReplyDelete
    Replies
    1. 👌👌🙏🏻🙏🏻 ఓం నమః శివాయ

      Delete
    2. వెంకట రాజారావు . లక్కాకుల25 February 2025 at 17:57
      నెమ్మదిగా కర్ర బోటేసుకుని శివాలయాని కెళ్ళేను. జన్మకో శివరాత్రి అన్నారుగా! శివలింగం మీది నిర్మాల్యం తొలగించా! జలాభిషేకం, అప్పుడే ఎవరో ఇచ్చిన గోషీరంతో అభిషేకించా. స్వామి నెన్నుదుట భస్మం తీర్చా. సేకరించుకువెళ్ళిన తెల్లజిల్లేడు,నంది వర్థనం, శంఖు పుష్పాలతో పూజించా. నాకు తోచిన రెండు పళ్ళు ఆరగింపు పెట్టా. సాగిలి మొక్కే సావకాశం లేకపోయింది.ఆలయం చిన్నది, ఒకటే జనం. ఇప్పుడే తిరిగొచ్చా.
      అఘోరేభ్యోఽథఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః. సర్వేభ్యస్సర్వ శర్వేభ్యో నమస్తే అస్తు రుద్ర రూపేభ్యః.
      ఓం నమశ్శివాయ

      Delete
    3. బుచికి25 February 2025 at 23:43
      పశ్చిమ ముఖ శివాలయలో స్వామి దర్శనం చేసుకున్నా.

      ఓం శిం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమో నమః. భవే భవేనాతిభవే భవస్త్వమాం భవోద్భవాయ నమః

      ప్రాలేయాచల మిందుకుంద ధవళం గోక్షీర ఫేనప్రభం

      భస్మాభ్యక్త మనంగ దేహదహన జాలావళీ లోచనమ్

      బ్రహ్మేన్ద్రాది మరుద్గణై స్స్తుతి పదైరభ్యర్చితం యోగిభిః

      వందేహం సకలం కళంక రహితం స్థాణోర్ముఖం పశ్చిమమ్.

      ఓం నమో భగవతే రుద్రాయ. శిం ఓం పశ్చిమ ముఖాయ నమః

      Delete
  3. శివుడే జగదాధారమ్ ,
    శివుడే ప్రాణాధారము , శివపంచాక్షరియే
    భవబంధ ముక్త మంత్రము ,
    శివరాతిరి పుణ్య ప్రదము శివ సన్నిధిలోన్ .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల26 February 2025 at 11:46
      నమో జ్యేష్ఠాయనమశ్రేష్ఠాయ నమోరుద్రాయ నమః కాలాయనమః కలవికరణాయనమో బలవికరణాయనమో బలాయనమో బలప్రమథనాథాయనమ సర్వభూతదమనాయ నమో మనోన్మనాయనమః

      Delete
  4. జగతః పితరౌ వందే 🙏
    నగజార్థ శరీర విభవ నాగాభరణౌ ,
    నిగమ నిగమాంత వర్ణిత ,
    సగుణ గుణాతీత రుద్ర ! శంకర ! పాహీ 🙏

    ReplyDelete
  5. వెంకట రాజారావు . లక్కాకుల26 February 2025 at 12:02
    ఓం నమశ్శివాయ

    ReplyDelete