Friday, 17 January 2025

మనసు--సమస్య

మనసు--సమస్య


మనసు సమస్యను సృష్టించుకుంటుంది.  సమస్య పరిష్కారం కాలేదని బాధపడుతుంది. సమస్యను మొదటిలోనే తుంచేస్తే సమస్య లేదు. 


ఎలా? అన్నది ప్రశ్న.


ఒక పని కావాలని తలపెట్టేవు,కావటం లేదు. సమస్య అనుకున్నావు, సమస్య పరిష్కారం కావటం లేదని బాధపడుతున్నావు. మనసును కట్టడి చేస్తే సమస్యలేదు కాదు పుట్టదు.నువు బాధ పడినంతలో సమస్య పరిష్కారం అవుతుందా? కాదు, కానేకాదు. ఆ పని పరిష్కారానికి నీవు చేయవలసినది చేయి, అదే పురుష ప్రయత్నం. ఫలితం పరమాత్మకి వదలిపెట్టు.  అప్పుడు నీ మనసుకు బాధ లేదు. నీకు అనుకూలంగా పరిష్కారం కావాలని దైవం (అదే విధి)తలిస్తే అలాగే జరుతుంది. శంకరులు చెప్పినట్టు ''మూకం కరోతి వాచలం'',''పంగుం లంఘయతే గిరిం'' (మూగవాడు ధారాళంగా మాటాడగలడు, కుంటివాడు పర్వతాలు దాటేస్తాడు.)   అనుకూలంగా పరిష్కారం కాలేదు,బాధపడవు, అది దైవ నిర్ణయం కనుక.  మనం బాధపడినంతలో దైవ నిర్ణయం మారదు. జరగవలసినది జరిగి తీరుతుంది. దానిని మనం మార్చలేం.


4 comments:

  1. అటువంటి దృక్పథాన్ని (stoicism) అలవరుచుకుంటే మంచిదే కానీండి అలవరచుకోవడం అంత ఈజీవీజీ కాదు సార్.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు17 January 2025 at 16:37
      అర్ధం చేసుకోవడం కష్టం,ఆచరణలోకి తెచ్చుకోగలగడం మరిమత కష్టం. ఏదీ ఊరికే రాదు కదు సార్!

      Delete
  2. ఆరోగ్యం బాగుందా ?
    కోరిక - సంక్రాంతి జరుపుకున్నారా , మి
    మ్మారసి శాన్నాళ్లాయెను ,
    సారూ ! శతథా నమోస్తు , శర్మ బుధవరా !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల18 January 2025 at 12:27
      పలకరింపుకు పులకరింత.
      ధన్యవాదాలు.
      ఎలా ఉన్నారు?
      సంక్రాంతికి విందులు కాదు,మందులేసార్!
      వైద్యరాజ దర్శనానికి ఇప్పుడే కదులుతున్నా!
      ధన్యవాదాలు.

      Delete