Wednesday, 22 January 2025

సలహా!

సలహా!

అమితమైన కష్టంలో కావలసినవారు ఆసుపత్రిలో ఉండి,విషయం చెప్పినపుడు చేయగలదేమి ఉంటుంది?

జాగ్రత్త అనా?

ఆసుపత్రిలో జేర్చిన తరవాత మరి జాగ్రత్తలేం తీసుకోగలరు. 

విని ఊరుకోవడమా?

కాదే! వారెందుకు చెబుతున్నట్టు? 

మనం ఆత్మీయులమని తలచి కదా సంగతి చెబుతున్నది. ఏం చేయాలి?

జరిగేది జరుగుతుంది,నిశ్చింతగా ఉండమనా?

అదే పరిస్థితులలో మనమున్నపుడు అలా చేయగలమా?

మరేం చేయాలి? ఇది నిజంగా అందరిని వేధించే ప్రశ్న.

వీలైతే వెళ్ళి ఒక సారి చూడాలి. మనిషి సాయం అవసరమైతే చేయాలి. నిబ్బరంగా ఉండమని నెమ్మదిగా చెప్పాలి. సొమ్ము అవసరమేమో కనుక్కోవాలి. ఇదీ నాకు తోచినది.

అన్నీ చేస్తాంగాని ఆ ఒక్కటీ అడక్కు అనుకుంటాం. అంతే! ఇదే వింత లోకం. అంతా విష్ణుమాయ అనుకుంటాం.

4 comments:

  1. ”నిబ్బరంగా” ఉండమని చెప్పడం అవశ్యం చెప్పవలసినదే. కానీ మొన్నామధ్య మా బంధువొకతనికి ఇటువంటి కంప్లయింటే వచ్చి పోయాడు, కాబట్టి జాగ్రత్త …..అంటారు కొందరు శ్రేయోభిలాషులు. వాళ్ళ మాటలు విన్న ఆ రోగి మరింత డీలా పడిపోడూ.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు22 January 2025 at 13:29
      అందుకే మన పెద్దలు ఈ సందర్భంగా,జరిగేదాన్ని మనం ఆపలేం,కంగారు పడకు అని , రోగి దగ్గరున్న ముఖ్యులకు చెబుతారు, ఇది రోగి ఆరోగ్యం బాగా నిరాశాజనకంగా ఉన్నవారైతే, ముఖ్యులైతే,చెబుతారు.


      రోగికి మాత్రం నాలుగురోజుల్లో బయటికొస్తావు,కంగారు పడకు,అనిచెప్పి వచ్చేస్తారు.

      మీరు చెప్పినట్టు మాటాడేవారూ ఉన్నారు,మనం చూస్తూనే ఉంటాం,వాళ్ళంతే!

      Delete
  2. శ్రుతి పేయ , మధుర శబ్దము ,

    లతి లలిత , శుభగ , మనోఙ్ఞమయి , సంగీతా

    మృతము కురిపించె , వంశీ

    జతగా , గీతా స్రవంతి , జగతికి గురుడై .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల24 January 2025 at 21:28
      మథురాధిపతేరఖిలం మథురం 👍

      Delete