Saturday, 25 January 2025

ఆందోళన జీవి.

 ఆందోళన జీవి.


ఎలుక ఎప్పుడూ ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది, లేకపోతే చచ్చిపోతుంది.  ఎలుక బతకాలంటే ఏదో ఒకటి నిత్యం కొరుకుతూనే ఉండాలి. ఎందుకలా ఇది గదా కొచ్చను. 


ఎలుక దేన్నీ   కొరకకుండా ఉండిపొతే  పళ్ళు పెరిగిపోతాయి,ఎంతలా? దాని దవడలను పుళ్ళు పడేటంతగా. ఐతే ఏమవుతుంది? పుళ్ళు పడితే,పళ్ళు పెరిగితే ఏమీ తినలేదు,చనిపోతుంది, అందుకు నిత్యం ఏదో ఒకటి కొరుకుతూనే ఉంటుంది. ఎలక కొట్టని వస్తువు లేదు. 


దీనికీ ఆందోళన జీవికి ఏంటి లింకు? 

దుఃఖ భాగులు ఆరుగురు తెలుసుగా. ఇందులో నిత్య శంకితుడు,నిస్సంతోషి అనేవారిద్దరున్నారు. వారి కలయికతో పుట్టినవాడే ఆందోళన జీవి.  ఈ ఆందోళన జీవి ఏదో ఒక దానిగురించి ఎప్పుడూ సంశయం వెలిబుచ్చుతూనే ఉండాలి,ఏదో ఒకదాని గురించి ఆగ్రహం వెలిబుచ్చుతూ ఉండాలి.  లేకపోతే ఏమవుతుంది? ఈ కుళ్ళు అంతా మనసులో పేరుకుపోయి ప్రమాదానికి దారి తీస్తుంది. 

అందోళన జీవి ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి, ఎప్పుడేనా నవ్వినా పెద్దప్రమాదం తనకో,గ్రామానికో,జిల్లాకో,రాష్ట్రానొకో,దేశానికో వచ్చి తీరుతుంది. అందువలన,అందుచేత,అందుకొరకు ఆందోళనజీవి ఎప్పుడూ ఏడుస్తూనే,అరుస్తూనే ఉండాలి. అస్తు!

స్వస్తి!


లోకాః సమస్తాః సుఖినోభవంతు!

10 comments:

  1. విను , జామా దానిమ్మా
    ఘనమగు బొప్పాయి పుచ్చకాయయు యాపిల్
    కనువిందగు నేరేడును
    ననువుగ షుగరున్న వారి కమృతఫలములౌ .

    ReplyDelete
    Replies
    1. దానిమ్మ సంవత్సరం పొడుగునా దొరుకుతున్నది. జామ సీజనల్ దొరుకుతోంది. ఆపిల్ చెప్పక్కరలేదు,పుచ్చకాయ వేసవిలో బాగా దొరికే పండు. నేరేడు వచ్చే సీజన్ రెండు నెలల్లో.బొబ్బాసి మంచిది. మీరు చెప్పినట్టు అన్నిటిని తింటున్నవే కాని ఆపిల్,పుచ్చకాయ తినడం తగ్గింది. కారణం ఆపిల్ కి ఫార్మాలిన్ రాసేస్తున్నారు,నిలవ వుండడానికి. పుచ్చకాయ ఎర్రగాను తియ్యగాను ఉండడానికి కాయ పాదుని ఉండగానే ఇంజక్షన్ చేస్తున్నారు. మరో తినగలిగిన పండు బదరి ఫలం. దోస పండు దీనిని లంకదోస అంటారు.వేసవిలో దొరుకుతుంది. మా గోదావరి ప్రాంతంలో దొరుకుతుంది,వెతుక్కోవాలి. పనస,మామిడి, అనాస అప్పుడప్పుడు కొద్దిగా తినచ్చు,సీజన్ లో. తింటే ఇబ్బంది పెట్టేవి, సపోటా,అరటిపండు.

      Delete
    2. ద్రాక్ష, శీతాఫలం కూడా ఇబ్బంది పెట్టేవే అనుకుంటాను, శర్మ గారు.

      Delete

    3. విన్నకోట నరసింహా రావు26 January 2025 at 11:51
      పళ్ళన్నిటిలోనూ ప్రక్టోజ్ రూపంలో సుగర్ ఉంటుంది. ఐతే సీతాఫలంలో ఫ్రక్టొజ్ తో పాటు పీచు ఉన్నది కనక మోతాదులో తినచ్చు. ద్రాక్ష కూడా అంతే ఐతే ఇందులో నల్లద్రాక్షయేగాని తెల్లద్రాక్ష పనికిరాదు.

      Delete
    4. ఈ రోజుల్లో నల్లద్రాక్ష ఎక్కడ కనిపిస్తోందండీ ? మన చిన్నతనంలో ఆంధ్రాలో నల్లద్రాక్షే కదా. అవి వచ్చే ద్రాక్ష కుండలకు (ఖాళీ అయిన తరువాత) పబ్లిక్ లో మంచి గిరాకీ కూడా ఉండేది 🙂.

      తెల్ల ద్రాక్ష (అనాబ్ షాహీ ద్రాక్ష అంటారనుకుంటాను) నేను హైదరాబాద్ వచ్చిన తరువాతే మొదటిసారి చూసాను. ఈ రకం కూడా ఉంటాయా అనుకున్నాను. నల్లద్రాక్ష చాలా అరుదుగా కనిపిస్తుంటుంది (నేను గమనించినంత వరకు). కాబట్టి హైదరాబాద్ లో నివసించే డయాబెటీయులు ద్రాక్ష తినడం అదే తగ్గిపోతుంది - అంతా తెల్లద్రాక్ష మయమే అవడం మూలాన 😒.

      Delete
    5. విన్నకోట నరసింహా రావు26 January 2025 at 19:36
      నల్లద్రాక్ష మాదగ్గర బాగానే దొరుకుతోందండి.తెల్లద్రాక్ష(అనాబ్షాహి) కూడా బాగా దొరుకుతుంది.
      నాటిరోజుల్లో నల్లద్రాక్ష ఏర్రకుండలలో వచ్చేవి. ఆకుండ ఒక స్టేటస్ సింబల్ నాటిరోజుల్లో 🤣 మా పెదనాన్నగారో కుండ తెచ్చేరు. ఆ కుండలో నీళ్ళు పోసింది మొదలు చల్లటి మచినీళ్ళని పెద్దమ్మని వేధించడం మొదలెట్టాం,అంతా! దాంతో చిరాకేసిన పెద్దమ్మ తిట్టింది,చల్లటి నీళ్ళు లేవని. వచ్చి అమ్మతో చెప్పుకున్నాం, మా బాగా తిట్టింది,మీకు బుద్ధిలేదు. నీళ్ళు పోసిది మొదలు తీస్తోంటే ఎక్కడ చల్లబడతాయి. ఇలా కాదని తనుగోదావరినుంచి ఒక పెద్ద బిందెడు నీళ్ళు తెచ్చి తడిపినచీర మడతలేసి గచ్చుపైనవేసి,బిందెను నీళ్ళతో ఒక్కసారిగా గచ్చుమీద బోర్లించి,చీర అంచులు బిందెమీదికి ముడేసి,గట్టిగా ఆ బిందెని బయట పందిరిలో వేలాడతీసింది,కొక్కేనికి. ఏంటొ అర్ధం కాక చూస్తూ ఉండిపోయాం. అప్పుడు చెప్పింది,కావలసినన్ని చల్లటి మంచినీళ్ళు తాగండి,కొంచం సేపు ఆగండని,భోజనాల వేళ బిందెను కొద్దిగా వంచి నీళ్ళు పట్టి భోజనాలు పెట్టి,చల్లటి మంచినీళ్ళిచ్చింది. అమ్మ ఏదో మంత్రం వేసిందనిపించింది. అమ్మ అలా కట్టడం చూసి అందరూ అలా కట్టుకోడం చల్లటినీళ్ళు తాగడం మొదలెట్టేరా ప్రాంతంలో. ఇదో వింతైపోయింది.
      అమ్మ చదువుకుందా? లేదు,తెనుగు అక్షరాలు మాత్రమే వచ్చు,రామాయణ,భారత భాగవతాలు చదువుకుంది. బడికెప్పుడూ వెళ్ళలేదట. ఎందుకు నీళ్ళు చల్లగా ఉంటాయో,తిరగేసిన బిందెలో నీళ్ళెలా ఉంటాయో,ఆ తరవాత కాలంలో గాని మాకు అర్ధం కాలేదు. అమ్మ లోకాన్ని చూసింది,లోకాన్ని చదువుకుంది, అంతే!

      Delete
  2. కాన్టిపేషను గల్గు షుగరుకు వాడు
    మందుల వలన , పండ్లు ఫైబరు నొసంగు
    కతన , తినదగు ఫలముల , మితముగాగ ,
    అనుదినము తినుటయె మేలు , వినుత విబుధ !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల26 January 2025 at 12:41
      సుగర్తో మొదటగా చెడిపోయేది జీర్ణాశయమే. మలబద్ధం తగ్గించుకోలేకపోతే బాధలు బహుళం. అందుకుగాను,పీచు ఎక్కువగాను,మలబద్ధాన్ని నివారించే, తేగలు తినచ్చు,సీజన్ ఐపోతోంది. అలాగే నిత్యమూ సబ్జాగింజలు ఒక చంచాడు నానబెట్టుకుని ఉదయం ఫలహారం తో తీసుకుంటే మలబద్ధమూ తగ్గుతుంది,సుగరూ అదుపులో ఉంటుంది. ఇవేకాక కాయకూరల్లో దోస ను వాడు కోవడం బహు మంచిది.ఆకుకూరలు చెప్పక్కరలేనివే!!!

      Delete
  3. ఇచ్చట అంతయు
    రోగభూ"యిష్టము" గా వున్నది :)

    महोल
    बहुत खतर्नाक है :)

    ReplyDelete
    Replies
    1. Zilebi26 January 2025 at 15:28
      ఎవరక్కడ?😊

      Delete