Friday, 1 November 2024

చెలికత్తె చెలగాటం

చెలికత్తె చెలగాటం

బయటకు కదలటం లేదు,నడకకు కూడా. ఊరుదాటి ప్రయాణం రెండున్నర సంవత్సరాలకితం,అత్తారింటికే. ఇప్పుడత్తారింటి కెందుకూ? బావమరిది రెండున్నరేళ్ళకితం పక్షవాతానికి గురయ్యాడు.అప్పటినుంచి ఆరోగ్యం మెరుగు పడలేదు. ఇప్పటికిన్నీ అలాగే ఉన్నాడు. చూసి చాలారోజులైందని,బయలుదేరాను మొన్న ఆదివారం,ఆటో మీద. దేనిమీదైనా ప్రయాణం ఒకటే అనుకోండీ! రోడ్డలా ఉంది మరి.  బావమరిది, వాడే మేనమామ కొడుకు కూడా, చూసి తిరిగొచ్చా.

 మొత్తం చేసిన ప్రయాణం  38 కిలో మీటర్లు. ఇంటికి  తిరిగొచ్చేటపుడు చిరకాల చెలికత్తె వెంటబడింది. తప్పదుగా ఆహ్వానించా!!వచ్చినావిడ అంత తొందరగా కదలదని తెలుసు,కాని ఆహ్వానించక తప్పదు మరి. ఇంకక్కడినుంచి ఒకటే గుసగుసలు. వదలిపెడితేనా? ఇంట్లో వాళ్ళ తిట్లు,ఎందుకావిణ్ణి అంత చంకెక్కించుకుంటారు,అని. ఆవిణ్ణి సాగనంపాలంటే చిన్నపనేం కాదు.  అందునా పాతకాలపు చెలికత్తె.  ఒకటే గుసగుసలు ఏమీ తోచనివ్వదు, కూచోనివ్వదు,నుంచోనివ్వదు, మూడు రోజులు తెగ ఇబ్బంది పెట్టేసింది,గుసగుసలతో!  

 అంగుళం పొడుగు మాత్రలు మింగమన్నారు,ఇంట్లో వాళ్ళు. అమ్మా! ఈవిడ అంగుళం పొడుగు మాత్రలకి వదలదు,వెళ్ళదు. వెళుతున్నట్టు నటిస్తుంది,అంతే సుమా అని చెప్పి, నా మంత్రం ఉపయోగించడం మొదలెట్టాను. అదే యోగా చేయడం.  మాత్రలు మింగితే చెలికత్తెలొస్తారు బయటికి, వారే ఆకలి మందగింపు,విరేచనం బంధించడం, ఆ తరవాత మరెవరొస్తారో చెప్పడం కష్టం. మరెలా అనుభవించక తప్పదు,కొంతకాలం. సాగనంపడానికి కావల్సిన సరంజామా. యోగా చేయడం, ఎక్కువ సేపు కూచోకపోవడం. ఇలా. అదేనండీ వెన్నునొప్పి, వెన్నుపోటు కాదండోయ్. వెన్నుపోటంటే మరో అర్ధమండీ! తెనుగు మాస్టార్ లకు బాగా తెలుస్తుందండి, ఈ తేడా!!

సాధారణ వెన్నునొప్పికి కారణాలు.

1.ఆహార విహారాల్లో సమయం పాటించకపోవడం. నిద్రాసమయాలు పాటించకపోవడం (సిరికార్డియన్ రిథం చెడిపోవడం)

2.సెల్ ఫోన్ కి అతుక్కుపోవడం.

3.అజీర్తి. వీరు పొదుపుగా నీరు తాగుతారు. నీరే అజీర్తికి మంచిమందు.

4.మలబద్ధం అజీర్తికి చెలికత్తె. అబ్బో! దీని గురించి చెప్పాలంటే గ్రంధాలే ఉన్నాయి.

5.వృత్తి పరమైనవి. నడక మంచి మందు. కూచుని చేసే ఉద్యోగాలవారు గంటకో రెండు గంటలకో ఒకసారి ఒక పది నిమిషాలు నడవాలి. ఇది చెయ్యరు. నడక అంటే ఒక్కసారే నడిచెయ్యాలి, అంత టైం లేదంటారు. ఒక్కసారి నడవ కూడదు. ప్రతి బోజనం తరవాత నడవాలి. టిఫిన్ తరవాత నడవాలి. టీచర్లు క్లాసులో నడవచ్చు,పిల్లలికి చెబుతూ. అలాగే ఇతరులు కూడా, వీలు బట్టి నడవాలి.

6. ఈ విషయం లో స్త్రీలు ప్రత్యేకమే. ఋతు కాలంలో వేధిస్తుంది వెన్ను నొప్పి రూపంలో. ఇది మొదలు గర్భ ధారణ,ప్రసూతి సమయాలు చెప్పక్కరలేదు. అజీర్తి,మలబద్ధం వీటికి జోడింపు. ఇందులో టీచర్లైతే, పొట్టివాళ్ళైతే బోర్డ్ మీద రాయడానికి సాగి, మెడలు వెనక్కి వంచి రాస్తారు. భుజాలనొప్పి,వెన్నునొప్పికి కారణాలు. ఇంతేకాదు,పేపర్లు అదేపనిగా దిద్దడం నేడు అవసరమైపోయింది,ఇది అదనపు కారణం.   

7.స్త్రీల వస్త్రధారణ కూడా కారణమంటే ఆశ్చర్యం కాదు. లో దుస్తులు బ్రా,పేంటీలు వెన్నును ఇరవైనాలుగు గంటలూ నొక్కుతూనే ఉంటాయి. ఇవి వెన్నునొప్పేకాదు కేన్సర్ కి కూడా కారణమని వైద్యులంటారు. అంతే కాదు తొడుక్కునే జాకెట్లు లో పేడ్ లూ చంకలలో పేడ్ లు మూలంగాను కూడా వెన్నునొప్పికి కారణమని చెబుతున్నారు వైద్యులు. కొందరు జాకెట్లలోనే పేడ్ లూ వేయించుకుని కుట్టించుకుంటున్నారు. ఇవి ఎంత బిగువంటే విప్పుకోడమే కష్టం. డాక్టర్లు కూడా ఇవి చెప్పటంలేదు. ఎవరేనా చెప్పబోతే మేము ఏమి దుస్తులు ధరించాలో కూడా మీరే చెప్పాలా అని దెబ్బలాటకొచ్చే ఫెమినిస్టులున్నకాలం.అంచేత ఎవరూ చెప్పరు,చెప్పలేరు.

8.చెప్పుకుంటూ పోతే కారణాలనేకం.

ఇవన్నీ అందరికీ తెలుసుగాని నివారణ చెప్పండి,అంటారా!

ఉధృతంగా ఉన్నపుడు డాక్టర్ ని సంప్రదించక తప్పదు. మందులే పరమావధి కాదు. జాగ్రత్తలు చాలా అవసరం.

1.నేల మీదగాని,బల్లమీద గాని పడుకోండి. బొంతగాని,రగ్గుగాని వేసుకోండి. తలకింద ఎత్తు పెట్టద్దు,తలగడ నిషేధం. బుర్రొంచుకునే పనులు తగ్గించుకోండి. పేపర్లు దిద్దదం లాటివి. నీరసం అలసట కూడా వెన్నునొప్పికి కారణాలంటే నమ్మలేరు. అది చూసుకోండి.

2.యోగా చెయ్యండి. చాలా ఆసనాలున్నాయిగాని వెన్నునొప్పికి సూచనలు.

2.1 ప్రాణాయామం చెయ్యండి. అదిన్నీ అనులోమ విలోమ ప్రాణాయామం, మిగిలినవి గురువు దగ్గర నేర్చుకోవలసినవే. ప్రమాదం లేనిది,ఇది. కుడిచేతి బొటనవేలు,మధ్యవేలు తో రెండు ముక్కులూ మూయండి,సుఖాసనంలో కూచుని. ఎడమ ముక్కు మూసినది  తెరవండి ఊపిరి తియ్యండి,ముక్కు మూయండి మధ్యవేలుతో, ఊపిరిబట్టండి, ఊపిరి నెమ్మదిగా కుడి ,ముక్కునుంచి వదలండి నెమ్మదిగా ! ఇలాగే కుడి ముక్కుతో గాలిపీల్చి కొనసాగండి. ఎంత సేపు? పీలచాలి వగైరా కదా! పది అంకెలు లెక్కేదాకా పీలచండి,అంతే సేపు బిగబట్టడం ,ఊపిరివదలడం. 


2.2  సుఖాసనంలో కూచోండి. కాళ్ళు ముందుకుచాచండి, వెన్ను నిలువుగా ఉండాలి..భుజాలు బిగబట్టకండి. ఇలా కూచోలేనివాళ్ళు చాలా మందే ఉన్నారు. ఆ తరవాత కాళ్ళు కొద్దిగా ముడవండి, శరీరం ముందుకు కాళ్ళమీదకి వంచండి.రెండు చేతులతో రెండు పాదాలూ పట్టుకోండి. శరీరం పైకి లేపకుండా కాళ్ళు ముందుకు చాపండి, ఇదే పశ్చిమోత్తాసనం. ఊపిరి బగబట్టకండి.


2.3 సుఖాసనంలో కూచోండి. రెండు కాళ్ళు ముందుకు చాచండి. ఒకకాలు ముడవండి పక్కగా, అరికాలు చాచినకాలుని తాకుతూ. శరీరం ముందుకు వంచండి, ఊపిరి వదలండి.. పై ఆసనంలోనూ  ఇందులోనూ మోకలిని ముద్దు పెట్టుకోగలగాలి,కాలు వంచకుండా. ఇలాగే రెండో వైపూ చేయండి. మొదటిరోజే కాళ్ళు వంగవు,కంగారొద్దు.నెమ్మదిగా వస్తుంది. రోజూ చేయాలి.


2.4 సుఖాసనంలో కూచోండి కాళ్ళు చాచండి. అరికాళ్ళు రెండూ ఎదురెదురుగా తాకేలా కాళ్ళు ముడవండి. పాదాలు రెండు చేతులతో పట్టుకోండి. ముడిచినకాళ్ళని పైకి కిందికి ఆడించండి. ఇది శలభాసనం. ఇలా ఉండగా వెన్నువంచి నుదుటితో అరికాళ్ళను తాకే ప్రయత్నం చేయండి. శరీరం వంచడం బహు కష్టం. రోజూ చేస్తే పూర్తిగా కాళ్ళకి నుదురు ఆనచగలరు. 


2.5వెన్నుపై పడుకోండి.కనులు మూసుకోండి. ఊపిరి నెమ్మదిగా తీయండి,నెమ్మదిగా వదలండి.చేతులు పక్కగా పెట్టండి. ఇదే యోగనిద్ర. ఊపిరులు ఎంత తగ్గితే ఆయువు అంత పెరుగుతుంది. మనిషి నిమిషానికి ఏడు ఊపిరులు తీస్తాడు, నిమిషానికి మూడు ఊపిరులు తీసే తాబేలు మూడువందల సంవత్సరాలు బతుకుతుంది. ఇదే శవాసనం. 

2.6వెన్నుపై పడుకోండి ఒక కాలు పైకెత్తండి. కాలు తిన్నగా లంబంగా రాదు. ఒక తువ్వాలు తీసుకోండి. తువ్వాలు అరికాలు మీంచి వేసి రెడు చేతులతో పట్టుకుని కాలు ముందుకు లాగండి. మోకాలు వంచద్దు. ఇలాగే రెండు కాళ్ళు చేయండి.


2.7వెన్నుపై పడుకోండి.కాలుపైకాలు అడ్డంగా వేసి చాచినకాలు ముడవండి నెమ్మదిగా, రెండు చేతులతో చాచిన కాలును దగ్గరకు లాక్కోండి. తల లేస్తుంది,ఎంత లేపగలిగితే అంత మంచిది. ఇలాగే రెండో కాలూ చేయండి. 


2.8 కాళ్ళు ముడుచుకు గోడ దగ్గరగా కూచోండి. నెమ్మదిగా వెన్ను వాల్చి గోడకి సమాంతరంగా దగ్గరగా పడుకోండి. కాళ్ళు చాపండి. చాపినకాళ్ళు నెమ్మదిగా గోడపైకి చేరుస్తూ శరీరం గోడకి లంబంగా చేయండి. ముడ్డి గోడకి చేరుతుంది. కాళ్ళు గోడపైనా చాచండీ,మోకాళ్ళు వంచకండి ఇది విపరీత కరణి  అనే ఆసనం. ఇదొక ముద్ర కూడా. ఇలా ఎంతసేపైనా ఉండచ్చు. . వెన్నుకు చాలా హాయిగా ఉంటుంది.  ఊపిరి  నెమ్మదిగా తీసుకు వదులుతుండండి.

2.9 వెన్నుపై పడుకోండి,కాళ్ళు చాచండి. చాచిన కాళ్ళు దగ్గరికి ముడుచుకోండి. మడిచిన రెండు కాళ్ళనూ రెండు చేతులతో బంధించండి,తలపైకెత్తండి,వీలున్నంత. వెన్ను కొద్దిగా విల్లులా వంగుతుంది. నెమ్మదిగా వెన్నుమీద ఊగండి,ఉయ్యాలా ఊపినట్టు. వెన్నుకు మర్దనా చేసినంత శమనగా ఉంటుంది,వెన్ను నొప్పికి  మంచిది. మరోమాట పాతకాలం స్త్రీలు పిల్లలను ఆ ముడిచిన కాళ్ళపై పడుకోబెట్టుకుని ఉయ్యాలా ఊగినట్టు ఊగేవారు. దాదం దక్కచ్చి అయ్యవారక్కొచ్చి అని చిన్నగా పాడుతూ. ఇది వెన్నునొప్పికి మంచిమందంటే నమ్మలేరు.


పడుకుని కూచుని వేసే ఆసనాలన్నీ 30 సెకండ్లు వేయాలి,అనగా ముఫై అంకెలు లెక్కపెడితేచాలు. కాళ్ళతో చెప్పినం ఆసనాలు ఒకవైపొకసారి మరోవైపొకసారిగా మూడు సార్లు చేయాలి.


ఇలా చాలా ఆసనాలున్నాయి, కొన్ని చేస్తే చాలు నెమ్మదిగా వెన్నునొప్పి పారిపోతుంది. మందుల బెడదుండదు. నేను ఈ మధ్య కొంత అశ్రద్ధ చేసాను, మళ్ళీ మూడు రోజులనుంచి చేస్తుండగా చెలికత్తె నెమ్మది నెమ్మదిగా లాడీ,బేడి సద్దుకుంటోంది,పారిపోడానికి.


నిజంగా కష్టమే పడ్డాను,ఓ మనవరాలు అడగటంతో ఇదంతా రాయాల్సివచ్చింది, 4 రోజులు కూచుని చెలికత్తెతో పోరాడుతూ రాసాను. చెలికత్తె పారిపోడానికి సిద్ధంగానే ఉంది.

ఇన్ని అవస్థలు ఎవరు పడతారు, అంగుళం మాత్రలు మింగితే సరిపాయె అనుకుంటే తమ చిత్తం.

50 comments:

  1. ప్రాణాయామం, యోగా విధానాల మీద మీ వివరణ ఆసక్తి గలవారికి చాలా ఉపయోగకరం, శర్మ గారూ 🙏.

    ఈ “చెలికత్తె” కొన్ని రోజులుండి వెళ్ళిపోయే అవకాశాలుంటాయి మీరు మళ్ళీ సాహసాలు చెయ్యకపోతే. కానీ కొన్ని “ఉంపుడుగత్తెలు” ఉంటాయి (బిపి, షుగరు లాంటివి) - తగులుకుంటే జీవితాంతం వదలవు 😏.

    ఆ రోడ్ల మీద ఆటోలో ప్రయాణం లాంటి సాహసం వల్ల కూడా మీకు ఒళ్ళు హూనమై పోయుంటుంది. దాంతో మీ “చెలికత్తె” విజిలేసుకుంటూ వచ్చేసి ఉంటుంది 🙂. జాగ్రత్త, శర్మ గారు.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు1 November 2024 at 18:07
      ఉపయోగమనే చెప్పేనండి. ఉపయోగించుకునేవారి ఇష్టం.
      ఈ చెలికత్తె పోతూ ఉంటుంది,మళ్ళీ వస్తూ ఉంటుంది. నిలకడ లేదు లెండి.

      మొదటి ఆవిడ అబ్బో! ముఫై ఏళ్ళ పైగా కూడానే ఉందండి. ఇక కొత్తవిద ఈ మధ్యనే అనగా ఇల్లాలు కాలం చేసిన తరవాత ప్రవేసించింది. ఒక రోజు ఒకరు తగ్గినంత మాత్రాన ఉపయోగం లెదండి. ఇద్దరూ సమానంగా బండి నడవనివ్వరు. ఒకరు తగ్గితే మరొకరు పెరుగుతారు. ఇదింతే సార్! సవతులకయ్యం నిత్యం :)

      ప్రయాణాలు చెయ్యటమే లేదండి. చివరగా ప్రయాణం చేసినది రెండున్నరేళ్ళ కితం వాడ్ని చూసిరావడానికే! మళ్ళీ వాడిని అనారోగ్యంగా ఉన్నందుకు చూసిరావడానికే వెళ్ళేనండి. నాకు మిగిలింది వాడొకడే అత్తారింటి పేరు చెప్పి. చెల్లెలుండగా చిటుకు,చిటుకు వస్తుండేవాదు, ఆ తరవాత వచ్చాడు నన్ను చూడ్డానికి,పడిపోయాకా రాలేకపోయాడు, అందుకే ఏమైనాగానీ అని చూడ్డానికి బయలుదేరానండి.

      Delete
    2. అహఁ, సాహసం అంటే నా ఉద్దేశం అది కాదండి. విధిగా వెళ్ళి చూసిరావలసినదే. ఆటో బదులు కారు కట్టించుకుని వెళ్ళొస్తే అంత హైరానా అయ్యేది కాదేమోనని అలా అన్నాను అంతే.

      Delete
    3. విన్నకోట నరసింహా రావు2 November 2024 at 15:23
      అడుగడుగున గుడి ఉందీ అన్నట్టు అడుగడుగున గొయ్యుందీ "ఏరాయైనా ఒకటేనండి,పళ్ళు ఊడగొట్టుకోడానికి".

      Delete
    4. 🙂🙂
      నాలుగురోజులు విశ్రాంతి తీసుకోవడం వల్ల మీకు ఇప్పుడు కాస్త మెరుగనిపిస్తోందా?

      లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారా మరి, సీజన్ వచ్చిందిగా?

      Delete
    5. విన్నకోట నరసింహా రావు3 November 2024 at 09:12
      నాలుగురోజులకి చెలికత్తెని తరిమేసానండి. ఏ మాత్రం తేడా వచ్చినా మళ్ళీ వచ్చేస్తుందండి,ఇది మామూలయిపోయింది :)

      మాకు లైఫ్ సర్టిఫికెట్లు ఇవ్వడానికి మార్పులు చేసేరు. అందరూ ఒకసారిస్తే కష్టమవుతుందనో మరేమో! కొంతమందికి ఒక నెల మరికొంతమందికి మరొక నెల ఇలా కేటాయించినట్టుంది. నాకు మొన్నటిదాకా డిసెంబరు ఆఖ్రుకి ఇవ్వాలి. నేను మొన్న ఒక్టోబర్ లో ఇచ్చేసాను. మళ్ళీ సంవత్సరం సెప్టెంబర్ చివరిదాకా చెల్లుబాటని వెబ్ సైట్ లో నా పెన్షన్ పోర్టల్ చూబెడుతోంది. లైఫ్ సర్టిఫికట్ ఇచ్చిన మరుసటిరోజే ఈ మార్పు కనపడింది. పని తేలిక చేయడానికి ఇలా మార్చి ఉంటారనుకున్నా. ఇప్పుడంతా డిజిటల్ కనక సమస్య లేదు.

      Delete
  2. అయ్య బాబోయ్ ? ఇదేమంత చెయ్య సులభ
    మేమి ? ఉంపుడు గత్తెలే మేలు , కలిసి
    జీవితాంతము బతుకగా జేరినారు ,
    జగడములు దీర్చ వెజ్జుల చలువ గలదు .

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల1 November 2024 at 20:45
      ఉంపుడుగత్తెలు బతకనివ్వరు, చావానివ్వరు, నిత్యం చంపుతూ ఉంటారండి. వెజ్జులు మాత్రం ఏం చేస్తారు లెండి.సవతుల కయ్యం నిత్యం,అంతకంటే చావు మేలనిపిస్తారు,చంపెయ్యరు ఓ పట్టాన.

      Delete
  3. శర్మ గారు,
    జన్మదిన శుభాకాంక్షలు (నవంబర్ 04th) 💐.

    - విన్నకోట నరసింహారావు

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు4 November 2024 at 05:07
      నా పుట్టినరోజు ప్రహసనంలో ఒకటైనా పుట్టిన తారీకును గుర్తు పెట్టుకుని శుభాకాంకాక్షలు తెలిపిన మీకు అభినందన మందార మాల.

      Delete
  4. Replies

    1. bonagiri4 November 2024 at 08:26
      నా పుట్టిన రోజు తారీకును నేను మరచినా మీరు మరవకుండా,వరుస తప్పకుండా సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకుని శుభాకాంక్షలందించి నన్ను నాకు గుర్తు చేస్తున్న మిమ్ములను ఎలా సత్కరించగలను? మాట తప్పించి మరేమీ లేని పేదవాడిని, నా అభిమానాన్నే మాలగా కూర్చి మీ మెడలో వెయ్యాలని ఉంది. దానికీ అశక్తుడలాగే ఉంది.వచ్చేస్తా చెప్పకుండా అని అనేక సార్లు ఊరించినా నాకు మిమ్ములను చూసే భాగ్యం కలగలేదు. నాకంటే చిన్నవారు కనక ఇవే నా ఆశీస్సులు. దీర్ఘాయుష్మాన్ భవ, ఆరోగ్య మస్తు,ఐశ్వర్య మస్తు,సుఖినో భవంతు.

      Delete
    2. చైంచిక్ :)
      నాయభిమానము పువ్వుల
      దోయిగ నర్పించినను విదుర! నరసన్నా
      మేయమగునక్కొ మీ ఆ
      ప్యాయతకు ప్రణతులివియె శుభమ్ములు బడయన్


      Delete
  5. జ్ఞాన మొకవైపు అనుభవ ధ్యాన మొకట
    గదిసి మూర్తీభవించిన ఘనులు తమరు
    నిండు పున్నమ శశి వోలె నిగిడి వెలుగ
    జన్మదిన శుభాకాంక్షలు శర్మగారు !

    ReplyDelete
    Replies
    1. వెంకట రాజారావు . లక్కాకుల4 November 2024 at 09:18
      మాస్టారూ,
      మీ అభిమానం మాటల్లో పొంగిపొరలింది. ధన్యవాదాలు

      Delete
    2. -

      పొరలెను పొంగుచు రాజా
      పిరిమియు నాపైన మీయభిమతము గానన్
      శిరసా ‌నమామి అనుటయె
      సరియగు పద్యముల రేడు సారూ మీరే!



      Delete
  6. பிரன்த நாள்‌ வாழ்த்துக்கள்

    :)


    ReplyDelete
    Replies
    1. జిలేబిలు తినకూడదని శర్మ గారు చెప్పారు కదా, మళ్ళీ ఈ జిలేబి మాల ఏమిటి?

      Delete
    2. Zilebi4 November 2024 at 09:45
      చచ్చి బతికినట్టున్నావు ఎందుకీ కొంటె పనులు,అరవగోలా! అదేంటో తెలియదు కదా! పుట్టిన రోజునాడు నా చేత తిట్టించుకోవాలా?

      Delete
    3. bonagiri4 November 2024 at 14:18
      సార్!
      అదేం భాష,అరవమా ? మలయాలమా? జిలేబీలు తినకూడదు సార్! సుగర్ కదా! ఫేక్టరీ ఫుల్ గా పనిచేస్తోంది కదా.

      Delete
    4. -
      అరవమ్మా?? మలయాళపు
      మెరుపులకొ? వలదు జిలేబులేమాత్రము! ప
      ల్కిరి పో బోనగిరీ! తా
      త! రవంతయె యేమి గాదదవద తినుడయా


      Delete

    5. Zilebi4 November 2024 at 18:21
      ''తన ముడ్డి కాకపోతే తాటి పట్టికి ఎదురు దేకమన్నాడని '' సామెత
      నీదేంపోయింది? తీపి తినడం మానేసి నాలుగు దశాబ్దాలు ఇప్పుడెందుకులే కొత్తగా తినడం. చేదుగా ఉంటుందేమో కూడా,నాకు.

      Delete
    6. పైన చుక్కలు ఉన్నది తమిళం, లేనిది మళయాళం అట!

      Delete
    7. -
      పుట్టిన రోజు జిలేబీ
      తిట్టుకు ప్రోత్సాహమేల తింగరి బుచ్చీ
      కొట్టుడు రచ్చలవేలా
      ముట్టికి ముట్టి నిను తట్టి మూలపడేస్తా!



      Delete
    8. bonagiri4 November 2024 at 20:24
      చెప్పేదేదో తెనుగులో చెప్పక ఈ అరవం మలయాలం గోలెందుకో తెలీదండి. ఇంతకీ ఏమందో! తిట్టిందో దీవించిందో తెలీదు కదండీ!
      "అత్త తిట్టిందనేగాని కోడలుచేసిన కొంటెపని కనపడదని" సామెత సార్! నేను తిడితే తిట్టేనని యాగీ చేస్తుంది.

      Delete
  7. స్విచ్చీ బల్బూ వైరూ
    కచ్చితముగ తమరి చేత గలవని దెలియున్
    లచ్చిమి పేరైన దెలిపి
    కొచ్చెను మార్కును దుడుపుము కోవిద ! అన్నా !

    ReplyDelete
    Replies
    1. -

      స్విచ్చీ బల్బూ వైరూ
      ఖచ్చితముగ తాత వద్ద కలదయ్యరొ ని
      క్కచ్చిగ రాజన్నా! వా
      రిచ్చిన మాట మరి తప్పరెపుడు కవివరా


      నారదా

      Delete
    2. ఇద్దరు మేథావులతో
      వద్దయ్యా నాకు , తగదు వాదు , నమస్సుల్
      ఉధ్ధతులు తమరు , నా కిక
      పద్దతి గాదండి పేరు ప్రస్తావించన్ .

      Delete
    3. -
      తాతకు తెలియున్ విషయము
      లేతావాతా జిలేబి లెస్స యెవతె యెం
      చేత తనను తిట్టుదురో
      శ్రోతగ వినరా నిలిచెదరు మవునమునిగా :(




      Delete

    4. Zilebi5 November 2024 at 06:16
      "జగడమెందుకొస్తుంది జగమయ్యా అంటే బిచ్చం తేవే బొచ్చు ముండా" అన్నాడట
      ఇదీ అంతేలా ఉంది.

      Delete
  8. -
    చుక్కలు గల పువు బోడెం
    చక్కగ మలయాళమౌత! జాంగ్రీ తమిళం
    బిక్కడి జిలేబి వ్రాతల్
    పక్కా! బో నగిరి పలుకు బంగరు తాతా!



    ReplyDelete
  9. *ఎంత డబ్బు వెచ్చించిన ఔషదాలయాల్లో అందు బాటులో లేని దివ్య ఔషధాల రకాలు ఈ క్రింది విషయం చదివితే దొరుకుతాయి.*

    *బ్రహ్మ ముహూర్తంలో లేవడం ఒక ఔషధం*

    *సూర్య నమస్కారంలు ఒక ఔషధం*

    *నిత్య అగ్నిహోత్రం ఒక ఔషధం*

    *ప్రాణాయమం  ఔషధం*

    *ధ్యానం  ఔషధం*

    *ఉదయం/సాయంత్రం నడక  ఔషధం.*

    *ఉపవాసం  ఔషధం.*

    *కుటుంబం తో కలిసి భోజనం చేయడం  ఔషధం.*

    *నవ్వు మరియు హాస్యం కూడా ఔషధం.*

    *గాఢ నిద్ర  ఔషధం.*

    *అందరితో కలిసి మెలిసి మెలగడం  ఔషధం.*

    *సంతోషంగా ఉండాలని నిర్ణయించుకోవడం  ఔషధం*

    *మనస్సులో సానుకూలత  ఔషధం.*

    *ఆధ్యాత్మిక జీవనం ఔషధం*

    *అందరికీ మంచి జరగాలని కోరుకోవడం ఔషధం.*

    *ఇతరుల కొరకు ప్రార్థించడం ఔషధం.*

    *అలింగనం  ఒక  ఔషధం*

    *పరోపకారం దివ్య ఔషధం*

    *మనసుకు నచ్చిన వారితో ముచ్చట్లు దివ్య ఔషధం*

    *ఆత్మీయులను తలుచుకోవడం ఒక ఔషధం*

    *కొన్నిసార్లు, నిశ్శబ్దం ఔషధం.*

    *ప్రేమ ఇతరులకు పంచడం ఔషధం.*

    *ఇక చాలు అని తృప్తి చెందడం ఔషధం*

    *ఈ ఔషధాలన్నీ  పూర్తిగా ఉచితం....*

    *ప్రతి ఒక్క  “మంచి” మనిషితో మనసువిప్ఫి మాట్లాడడం దివ్య ఔషధం*

    *ఇవన్నీ  ఏ మoదుల దుకాణములో దొరకవు.*

    *ఇవన్నీ మనలో మనమే సృష్టించుకోవాలి అంటే కొద్దిపాటి సమయం సాధన చేయాలి*

    ReplyDelete
    Replies
    1. భో! ఔషధ గిరి :(

      Delete
    2. bonagiri6 November 2024 at 08:29
      బోనగిరి గారు,
      మీతో పూర్తిగా ఏకీభవిస్తాను.
      అన్నీ ఆచరించలేకపోయినా కొన్నైనా ఆచరిస్తే ఆనందం.

      Delete

    3. Zilebi6 November 2024 at 08:38
      అధిక విద్యావంతప్రయోజకులైరి అన్నారు శేషప్పకవి. తమరు దేశాన్నొదిలేసినా దేశం మిమ్మల్ని వదిలెయ్యలేదు. దేశంలో కొచ్చి వేక్సిన్ వేయించుకో అంటే విమానం ఖర్చులకి వెనక తీసి ప్రాణం మీదకి తెచ్చుకున్నావు. డాలర్లుగాని,చైనా వేక్సిన్ గాని నిన్ను కాపాడలేదు. మాకు నీ మీద ....,అదే చావక చెప్పేం,నువ్వు వినవు అధికవిద్యావంతుడవుగదా!

      Delete

    4. Zilebi6 November 2024 at 08:38
      నువ్వు ఆచరించవు నాకు తెలుసు. నీదంతా dy/dx కదా

      Delete
    5. ఎంత గొప్పగా చెప్పారు ! సుంతయు మన
      బోనగిరి గారి మాటలు , పొల్లు బోవు ,
      ఆచరించుచుంటిమిగ , కొన్నైన రోజు ,
      ఐన , కొత్తగా గనపడె ననుట నిజము .

      Delete

    6. sarma 6 November 2024 at 10:05
      శర్మ గారు,
      // “ నువ్వు వినవు అధికవిద్యావంతుడవుగదా!” //

      “….. డవుగదా!” …. అంటే “జిలేబి” గారు పురుషులని మీరు చెప్పకనే చెప్తున్నారా, శర్మ గారు?

      Delete
    7. విన్నకోట నరసింహా రావు6 November 2024 at 18:48
      గులేబకావళి సినిమాలో అనుకుంటా ఎం టీ వోడు పిల్లిగడ్డం పెట్టుకుని ఆటకొస్తాడు,జమున గుర్తించలేకపోవచ్చు గాని ప్రేక్షకులు గుర్తించరుటండీ. మొహంమీద గుడ్డకప్పుకున్నంతలో పోలికలెక్కడికిపోతాయి సార్! ఈ శాల్తీ కూడా అంతే.

      Delete
    8. శర్మ గారు,
      అంతేనంటారా?
      మన బండి దొర అన్యాయమైపోయాడే పాపం ! బామ్మా బామ్మా అంటూ గారాలు పోతుంటాడు కదా.

      Delete

    9. విన్నకోట నరసింహా రావు7 November 2024 at 12:29
      బండి దొర ఒక్కరేకాదు ముద్దొచ్చినప్పుడు ఈ కొఱవిదయ్యాన్ని అందరూ చంకనెక్కించుకున్నారండి.

      Delete
  10. "డవు" , "రాల" నలే! అంటే
    సువదన కాదు మగవారు సుమ్మీ అనెడ
    ర్థవివర ణయొ? సందేహ
    మ్మువచ్చె నరసన్న గార్కి ముదిత జిలేబీ!

    ReplyDelete
    Replies
    1. Zilebi7 November 2024 at 00:22
      డవు రాలవు కాదు ఈ మధ్య కరోనా తో గినా రాలిపోయిందా? :)

      Delete
    2. అన్నా ! సమజయ్యిందే !
      అన్నన్నా ! యింతదనుక అతి వనుకున్నా ,
      మన్నన లేదే , మిత్రుల
      కన్నుల గప్పంగ , నెంత ఘనుడో దెలిసెన్ .

      Delete
  11. ఎంత గొప్పగా చెప్పారు :)

    అవును! కట్టు పేష్టు బాపురె భళిభళి!
    స్వాస్థ్యమునకు చేయ చక్క నైన
    యతనములివి! జీవులార యోగ మరియు
    ధ్యాన మే మనకు పరమ సుఖమగు!


    ReplyDelete
    Replies

    1. Zilebi7 November 2024 at 04:08
      నువు కట్టు,పేస్టూ కాకిరెట్టలు దెచ్చి అందరి నెత్తినా వేయచ్చు. మంచి మాట చెబితే కట్టు,పేస్టు అంటూ యాగీ చెయ్యడం నీ నైజమేగా!
      నీ నోట మంచిమాట రాదు,పొరబాటున వచ్చిందో ప్రళయం వచ్చి తీరుతుంది,నీ జాతకమంతా! :)

      Delete
    2. కట్, పేస్ట్ కాదు. కాపీ, పేస్ట్ వాట్సాప్ నుండి.

      Delete
    3. bonagiri7 November 2024 at 10:13
      బాలాదపి సుభాషితం అని పెద్దల మాట,మంచిమాట చిన్నపిల్లలు చెప్పినా వినాలి. ఇటువంటి కొఱవిదయ్యాలు వినవనుకోండి. మీరు చెప్పినమాట కట్ పేస్టైనా,కాపీ పేస్టైనా తప్పేంలేదు. మీరు ఫీల్ కావద్దు.

      Delete
    4. :)

      ఆయ్ కాపీ అయినా కాఫీ అయినా మాకిష్టమేనండి :)

      బాల యైన మంచి పలుకు బంగరుమూట
      ఛీత్కరించ దగును చెడు పలుకుల
      బోనగిరి జిలేబి బుర్రలో గుజ్జు లే
      దయ్య త్రోసిపుచ్చు దాని వ్యాఖ్య :)



      Delete