Tuesday, 2 July 2024

డబ్బుతోనే ఉందయ్యా! అంతా!!!

 ధనమూలమిదం జగత్


త్యజంతి మిత్రాణి ధనైర్విహీనమ్ 

పుత్రాశ్చ దారాచ సుహృద్జనాశ్చ

తమర్ధవంతమ్ పునరాశ్రయంతి

అర్ధోహి లోకే మనుషస్య బంధుః

(ఆచార్య చాణక్య)


డబ్బులేనివాడిని భార్య,కొడుకులు, మిత్రులు,  మంచివాళ్ళు కూడా  వదిలేస్తారు. డబ్బు సంపాదిస్తే మళ్ళీ వీరంతా చేరతారని చాణక్యుని మాట.


డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడనీ ఈసడించారో కవి. నడపీనుగు వచ్చెనంచు భార్య ఈసడిస్తుందన్నారు మరొకరు. 

అంతెందుకు? ధనమూలమిదం జగత్ అన్నాడు లక్ష్మణుడు.  డబ్బు సంపాదించు అంతా చుట్టూ చేరతారు మళ్ళీ!


ఎప్పుడు సంపదగల్గిన

అప్పుడు బందుగులు వత్తురది ఎట్లన్నన్

దెప్పలుగ చెఱువు నిండిన

గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ!


డబ్బుతోనే ఉందయ్యా! అంతా!!! 

5 comments:

  1. ఏల వృద్ధాప్యములో ఈ డబ్బు గుర్తు కొచ్చెను ?


    ReplyDelete
  2. టకా ధర్మః టకా కర్మః
    టకాహి పరమంపదమ్
    టకా యస్యగృహే నాస్తి
    హాటకా టకటకాయతే

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం2 July 2024 at 13:41
      మొదటి మూడు పంక్తులూ అర్ధమైనట్టున్నాయి గాని చివరిది అర్ధం కాలేదండి.

      Delete
    2. మీరు ౭౫ శాతం మార్కులతో ప్యాసయ్యేరు :) కంగ్రాట్యులేషంసు

      Delete
  3. Zilebi2 July 2024 at 11:55
    పుట్టకముందు అమ్మ కడుపులో ఉన్నప్పటినుంచి అవసరమైన డబ్బు చచ్చిన తరవాత కూడా కావాలి,అవసరం. అందులో కూరుకుపోకు, మరి లేవవు .

    ReplyDelete