Sunday 3 March 2024

కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు.

 కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు.


ఇదొక నానుడి. రోగం చమ్మగా,కమ్మగా సుఖాన్నివ్వదని, వచ్చే రోగాలకి వేసుకునే మందులు తియ్యగా ఉండవు,చేదుగానే ఉంటాయి, కష్టాలే పడాలని సూచన!!!!



ఈ నానుడి అర్ధం కాలేదు చాలాకాలంగా, ఒక అనుభవంతో అర్ధమయిందా? ఏమో!

   

    పదిహేను రోజులకితం డాక్టర్ గారి దగ్గరికిపోయా. డాక్టర్ గారు బి.పి చూసి ''డబల్ సెంచరీ తగ్గనంటోందే, కిందది సెంచరీ తగ్గనంటోంది ఉప్పు తింటున్నారా''? అడిగారు. ''మీ పేస్టులో ఉప్పుందా? ప్రకటన గుర్తొచ్చి, దానిపై డాక్టర్ల జోక్ గుర్తొచ్చి నవ్వుకున్నా''!  ''అయ్యో! ఉప్పు,తీపి మరిచిపోయి ఏళ్ళయిందండీ అన్నా''! ''తగ్గిస్తాగా!! అని మందులు మార్చారు, వేసుకుంటున్నా, పదిరోజులుగా.      నిన్న డాక్టర్ గారి దగ్గరకెళ్ళా! మళ్ళీ!! "నెలకాకుండానే వచ్చారేం మళ్ళీ?'' అన్నట్టు చూసి, బి.పి  చూస్తే, అది కాస్త తగ్గి మూడర్ధ సెంచరీల దగ్గరాగింది, కిందదో పది తగ్గింది.  చూసి డాక్టర్ గారు నవ్వుకుని "ఏమిటి సమస్య?" అన్నట్టు చూసారు. ''అదివరకు మరో తెగులుకు రాత్రి వేసుకుంటున్నమందు, మధ్యాహ్నం దాకా మత్తు వదలటం లేదు. ఇప్పుడు ఉదయం వేసుకుంటున్న బి.పి మందుతో, ఆ కొద్ది సేపుకూడా కిక్  లేకపోవడం లేదు, ఇప్పుడు ఇరవైనాలగు గంటలూ మత్తే'' అని వాపోయా!  ''ఎప్పుడూ మత్తుగానే ఉంటోందండీ,బద్ధకం,నిద్ర,'' అని డాక్టర్ గారికి చెప్పుకున్నా! ఆయన నవ్వి, ''అంతా కిక్ కావాలి,కిక్ కావాలంటుంటే మీరేంటీ? రోజంత కిక్ ఉంటే''? అని, ''మీరు వేసుకునేమందులన్నీ సాధారణంగా, నెల,రెండు నెలలకి అలవాటై మత్తు కనపడదు, అందరికీ  . మీరు స్పెషల్ కదా! అందుకు ఇలా వుంటోంది. మీరు హైపర్ సెన్సిటివ్, అలవాటు పడండి,  ఈ మందులు తప్పవు, మరో కంపెనీది మార్చినా అదీ అంతే'', అని చెప్పి పంపేరు.  

మొన్న రథసప్తమి నాడే చురుక్కుమన్నాడు, భాస్కరుడు. ఆవేళ మొదలు కదా వెచ్చగా ఉన్నాడని సంబరపడ్డా. నిన్న బయటికే రాలేకపోయాను. ఏంటబ్బా! అని చూస్తే వేడి 39 కి చేరిపోయిందిట, నాలుగు రోజుల్లో వేడి 40 కి చేరబోతోందని, సూచనలందుతున్నాయి. పదిహేనురోజులకే ఇంత మార్పా అనుకున్నా! నేను నడవటం లేదని ఆయన నడవటం మానెయ్యలేదుగా, నడుస్తూనే ఉన్నాడు అనంతకాలంలో, నా లాటి భాస్కరులనెంతమందిని చూసుంటాడు, నేనాయనఒక్కణ్ణే చూసాను తప్పించి. :) అలవాటు పడాలయ్యా! అలవాటు పడాలని చెప్పుకున్నా!! నవ్వుకుంటూ. 

  కమ్మటి రోగాలు తీయటి మందులు ఉండవు, 

అంటే అర్ధమయినట్టుందా?

10 comments:

  1. మందులు చేదుగానే ఉంటాయి గానీ “తియ్యటి” రోగం మాత్రం ఒకటి తయారయిందిగా 😏.

    మీ డాక్టర్ గారు అంత ఓపికగా విని, మరెంతో ఓపికగా వివరిస్తారేమిటండీ? పాతకాలం వాడిలా ఉన్నాడు. ఇప్పుడంతా “ఆఁ, నెక్స్ట్” అనడమేగా.

    ReplyDelete
    Replies
    1. విన్నకోట నరసింహా రావు3 March 2024 at 09:55

      రోగం పేరులోనే తీపి తప్పించి బతుకంతా చేదే!!

      మా డాక్టర్ గారికి సమయం వత్తిడి ఎక్కువ. ఓపిక ఎక్కువ, యువకుడే,50 లోపు. మా వాకింగ్ క్లబ్ మెంబరు కూడా. టెన్నిస్ బాగా ఆడతారు. అంతా సుగర్ పేషంట్లే, హాస్పిటల్ పేరే సుగర్ హాస్పిటల్. డాక్టర్ గారి దగ్గరకి పేషంటును పంపేలోగా లాబ్ సుగర్ రిపోర్టు,బి.పి,బరువు వగైరాలన్నీ చెక్ చేసి నోట్ చేసి ఫైల్ లో వేసి ఫైల్ చేతికి ఇచ్చి, అప్పుడు లోనికి పంపుతారు. నేనైతే డాక్టర్ గారి సమయం తినెయ్యకుండేందుకు నా సొద పేపర్ మీద సంక్షిపంగా రాసి,ఆ పై వ్యాయామం చేస్తున్నది,తీసుకునే ఆహారంలో మార్పులుంటే అవి, గత మూడు నెలల రిపోర్టులు సుగర్,బి.పి లు, ఇంటి దగ్గర నెలలో వారానికొకసారి నోట్ చేసిన సుగర్,బిపి రీడింగులు, నోట్ చేసి ఫైల్ లో వేస్తా! లోపలకెళితే అవసరమైనవి ఆయన చదువుకోడానికి పట్టే సమయం ఒక నిమిషం. ఆపైన మిగిలిన సమయమంతా నా అనుమానాలు తీర్చడం,సలహా ఇవ్వడం, ప్రిస్క్రిప్షన్ రాయడం,ఇలా జరిగిపోతుంది. డాక్టర్ గారు మాట్లాడ్డానికే ఎక్కువ సమయం తీసుకునీలా చేస్తాను. ఇదీ ఆసలు కిటుకు. :)

      Delete
  2. Black Turmeric try cheyanDi

    ReplyDelete
    Replies
    1. Zilebi3 March 2024 at 14:50
      సూచనకి, రొంబ సంతోషం!
      ప్రయోగాలు చేసే వయసుకాదుగా!ఐనా ప్రయత్నిస్తా, వీలును బట్టి.
      నల్ల పసుపు వాడకం ఆంధ్రాలో లేదు. ఉత్తరాదిని,ఈశాన్య రాష్ట్రాలలో హెచ్చు. సర్వరోగ నివారిణిగా వాడుతారుట.

      Delete
    2. ఆంధ్రాలో నల్ల పసుపు వాడకం లేకపోవచ్చు కానీ అసలా దినుసు ఆంధ్రాలో దొరుకుతుందా (దుకాణాల్లో) శర్మ గారు?

      Delete
    3. విన్నకోట నరసింహా రావు5 March 2024 at 07:41
      పల్లెలలో దొరికే సావకాశమే లేదండి. పట్నాలలో అనుమానం, మహా పట్నాలలో దొరకచ్చు. నేడన్నిటికి ఆన్ లయనే కదా! :)

      Delete
    4. నిజానికి నల్ల పసుపు అంటేనే విచిత్రం గా ఉంది. నల్లగా ఉంటే పసుపు ఎలా అవుతుంది ?🤔

      Delete
    5. అటువంటి పదాన్ని ఆంగ్లమున oxymoron అందురు 🙂.

      Delete
    6. బుచికి7 March 2024 at 15:30

      నల్ల అనేమాటకి తెనుగులో ఒక రంగు అని అర్ధం ఉంది. మనకి అరవ సంపర్కమూ ఎక్కువే కదండీ! అరవంలో నల్ల అంటే మంచి అని అర్ధం ఉన్నదట. దీన్ని హిందీలో కాలీ హాల్దీ అంటారట. దీని పుట్టుక హిమాలయాలు. ఒక అద్భుత మూలిక. బహుతక్కువగా దొరికేది. ఒడిషాలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. పంటకూడా అక్కడే ఎక్కువ.ప్రత్యేక వాతావరణ పరిస్థితులలోగాని పండదు. ఎందుకో మన దగ్గర ఇది వాడుకలో లేదు. నలుపు నాణ్యమని మనకో నానుడి. ఇది అల్లం కుటుంబానికి చెందినది. పర్పుల్ కలర్ బచ్చలిరంగులో ఉంటుంది పచ్చిగా ఉన్నపుడు,ఎండబెడితే నలుపుకి మారుతుంది. చాలా మంచిదని ఉత్తరాదివారు దీనిని విరివిగా వాడతారని తెలుస్తోంది.చ్దాలా వ్యాధులకి మందుగా చెబుతున్నారు.

      Delete
    7. విన్నకోట నరసింహా రావు7 March 2024 at 18:39
      :)

      Delete