రోగార్తస్య భిషక్ దేవ
ఆర్త్యన్తే మానవో భిషక్
భవతి రాక్షసో వైద్యః
సేవామూల్య ప్రదర్శనే
రోగంతో బాధపడుతున్నపుడు వైద్యుడు దేవుడులా కనపడతాడు. అర్త్యన్తే అనగా రోగబాధ నెమ్మళించిన తరవాత, వైద్యుడు మామూలు మనిషిలా కనపడతాడు. వైద్య సేవలకి మూల్యం అడిగినపుడు మాత్రం రాక్షసునిలా కనపడతాడని భావం.
ఇది పాతకాలం నాటి మాట. నాటి రోజుల్లో అనగా నేను ఎరిగిన రోజుల్లో కూడా వైద్యుడు, రోగి ఇంటికి వచ్చి వైద్యం చేసేవాడు. మందులూ ఆయనే ఇచ్చేవాడు. పధ్యపానాలూ వివరంగా చెప్పేవాడు.అంతే కాదు, వైద్యుడు అంటే ఇంటివారిలో ఒకడనే మాట ఉండేది. చిన్నచిన్న రోగాలకి వైద్యం చేసినా డబ్బులు అడిగేవారు కాదు. సంవత్సరానికి ఒక సారి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వైద్యం చేయించుకున్నవారంతా కట్నాలని, కానుకలు చదివించేవారు. ఇవ్వలేనివారి దగ్గర అడిగేవారు కాదు.అదో సహకార జీవనం.
కాలం మారింది, కాదు మనుషుల బుద్ధులు మారేయి ఎప్పటి సొమ్మప్పుడే చెల్లించాలి, నేడు.డాక్టర్ దగ్గరకే రోగిపోవాలి. అక్కడ ఒక కార్డ్ రాయించుకోవడంతో ఫీజు మొదలవుతుంది. ఈ కార్డ్ కి కూడా ఖరీదుంటుంది అది వందో ఆ పైమాటో, డాక్టర్ని బట్టి.నేటి డాక్టర్లు ఎక్కువ మంది తేనెటిగల్లాటివారు. కొద్దికొద్దిగా సంగ్రహిస్తారంతే, చిన్నచిన్న వైద్యాలకి, అదే పెద్దదైతే కార్పొరేటే :)
పై శ్లోకం మా వాట్సాప్ గ్రూప్ లో డాక్టర్ గారు పెట్టినది. ఇదేoటి ఆయన ఇలాటి టపా వేశారని మిత్రుణ్ణి కనుక్కుంటే తేలినదేమంటే, కరోనా మొదలుగా డాక్టర్ గారు వాట్సాప్ లో రోగిని చూస్తూ అత్యవసర వైద్యం చేసేరు. అది గత రెండేళ్ళుగా జరిగిపోతూనే ఉంది కాని ఎక్కువమంది కన్సల్టేషన్ కూడా చెల్లించలేదని తెలిసింది. ఔరా! జనం, అనుకుంటూ ఒక సారి భుజాలు తడుముకున్నా! నా దగ్గర నుంచి డాక్టర్ గారికి ఇవ్వవలసినది ఉండిపోయిందేమోనని. సరి చూసుకున్నా! అన్నీ రాసుకుంటా కనక.
ఇటువంటి వారు కూడా ఉన్నారా? ఉన్నారు అక్కడక్కడా!
మీ డాక్టర్ లాంటి వారు చాలా అరుదుగా ఉంటారండీ. వైద్యో నారాయణో హరి అని అటువంటి వారి గురించే అంటారేమో?
ReplyDeleteఈనాటి ప్రైవేట్ హాస్పిటల్స్ లో గేటు దగ్గర నుండి అందరూ రాక్షసులే. పైగా ఒళ్ళు పొగరొకటి. మొహం ప్లసన్నంగానూ ఉండదు. తుమ్మల్లో పొద్దు గుంకినట్లు మొహాలు. అడిగిన దానికి సవ్యంగా జవాబూ ఉండదు, చాలాసార్లు అసలు జవాబే ఉండదు.
.
అటువంటి ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ఒకసారి నేను అన్నాను నిర్లక్ష్యానికి గురవడానికి వేల రూపాయలు కట్టి మీ హాస్పిటల్ కు రావడం దేనికి, గవర్నమెంటు హాస్పిటల్ కు వెడితే బోలెడంత నిర్లక్ష్యం, విసురుబాటు ఉచితంగా దొరుకుతాయి … ఫ్రీ ఫ్రీ ఫ్రీ.
మన జనాలకు ఒక గట్టి అభిప్రాయం ఉన్నట్లుంది. చిన్న దుకాణం వాడి దగ్గర నుండి పెద్ద వ్యాపారాల వరకు కూడా అందరూ తాము దేశాన్ని ఉద్ధరించడానికి వ్యాపారం చేస్తున్నాం అనుకుంటారేమో బహుశ?
విదేశాల్లో నవ్వుతూ దోపిడీ చేస్తారు. మన దగ్గర మొహం సీరియస్ గా పెట్టుకుని దోపిడీ చేస్తారు
విన్నకోటవారు,
Deleteనూటికి ఎనభైఐదు నలతలు వైద్యుడు అక్కరలేకనే సరిపోతాయి, మన ఆహార వ్యావహారాలు బాగుంటే, కొన్నిటికే వైద్యుని అవసరం, కాని మనం అన్నిటికి వైద్యునిపైనే ఆధారపడిపోతున్నాం. కొత్తని ఆహ్వానించి మంచిని తీసుకోవాలి, అలాగే మనదైన దానిని వదులుకోకూడదు, కాని మనం మనదైనదానిని నమ్మటం లేదు, గచ్చాకు పుచ్చాకూ వైద్యం అని నవ్వితే చంకలెగరేసేము, మన వైద్యాన్ని చంపుకున్నాం. కొత్తదానికి లోకువైపోయాం. గచ్చకాయ ఋతుశూలకిచ్చే మందులో వాడతారు, ఇక పుచ్చకాయ చెప్పక్కరలేదు, వేసవిలో చలవ చేస్తుంది, ఇక మనం ఉమ్మేసే గింజలలో మన దేహానికి కావలసిన ఖనిజలవణాలున్నాయి, ఒమేగా ౩ వగైరాలూ ఉన్నాయి. ఆ గింజలవాడకం లేదు. ఎన్నని అనుకోగలం. పాత కొత్తల మేలు కలయిక మంచిదనే సంగతి మరచి మనదైన దానిని చంపుకుంటే ఇలాగే కదా జరుగుతుంది.
ధన్యవాదాలు.
అదేవిటి శర్మాచార్య.. వైద్యో నారాయణో హరిః అని కదా ఉంటుంది..
ReplyDeleteఅదేమో గాని..
నిజంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉంచుకునే వారు వైద్యులతో స్నేహంగి మెలుగుతారు.. జైలైనా, ఆసుపత్రైనా వెళ్తాను అనాలంటా.. వెళోస్త అనుకూడదూట..
చిన్న దుకాణం వాడు.. నా భార్య బిడ్డలకు ముపూటల నాలుగు వేళ్ళు నోటికందేలా.. వచ్చిన మొత్తం ను తపాల జమ ఖాత తెరిచి..
.. మదుపు చేస్తారు. పెద్ద దుకాణం వాడైతే సరుకుల డిమాండ్ బట్టి జీయస్‌టీ దట్టించి మరీ జేబులకు చిల్లు పెట్టి వచ్చిన సొమ్ములో పదో వంతు మదుపు జేసి పప్పు కూడబెడతాడు. ఇదే కలియుగములో జరిగే తంతు..!
Deleteశ్రీధరా!
Deleteచిన్న డాక్టర్ కి ఫీస్ ఇవ్వడానికి ఏడుస్తాం, కార్పొరేట్ లో బిల్లు కళ్ళు తిరిగేలా ఉన్నా చెల్లిస్తాం. ఏం చేస్తాం! మనం మారం సోదరా!
ధన్యవాదాలు.
అవును శర్మ గారు.
ReplyDeleteచిన్న వ్యాపారుల దగ్గర కూరగాయలు కొనడానికి గీచిగీచి బేరమాడుతాం. అదే కూరగాయలకి సూపర్ మార్కెట్లో వాడు వేసిన అధిక బిల్లును బేరమాడం కదా.
చిన్న వ్యాపారి బడుగు జీవి, సూపర్ మార్కెట్ వాడు ఆడంబరం చేసేవాడున్నూ.
విన్నకోటవారు,
Deleteచిన్నవాళ్ళంటే లోకువా! సూపర్ మార్కెట్ లో ఐతే బేరమాడితే ఆ కొన్నావులే అని సేల్స్ గర్ల్ ఒక లుక్కేస్తదేమో అని, ఎవరేనా చూస్తే పరువు పోద్దని........ :)