లప్ప లప్పనియేవు
లప్పనాదనియేవు
లప్ప నీ దెటులౌను చిలకా.....అయ్యో!
కొబ్బరి చిప్పయే నీ గతి చిలకా
లప్పయే సుఖమనీ
లప్పయే బతుకనీ
లప్పెనక పోయేవు చిలకా......ఖర్మ!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా
చిప్ప చిప్పనియేవు
చిప్పకాదనియేవు
చిప్పయే నీ గతీ చిలకా...అవునూ!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా
కాని కాలామొచ్చి
కళ్ళు మూసుకుపోయి
నీ బతుకు తెలియవే చిలకా...వహ్వా!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా
ఒళ్ళు పెరిగీ పోయి
మెడ తిప్ప లేకుంటె
చిప్పయే నీగతీ చిలకా...నిజమే!
కొబ్బరి చిప్పయే నీ గతీ చిలకా
ఒళ్ళు పెరిగీ పోయి
కళ్ళు మూసుకుపోయి
పిచ్చెక్కినప్పుడూ చిలకా...రామరామ!
కొబ్బరి చిప్పయే నీగతీ చిలకా
ఒళ్ళు పెరిగీ పోయి
బుఱ్ఱ పెరగాకుంటే
అప్పుడూ నీగతీ చిలకా...అయ్యయ్యో!
కొబ్బరి చిప్పలే నీ గతీ చిలకా
లప్పెక్కువైతేను
అతిమూత్ర వ్యాదొస్తె
చిప్పయే నీకు గతి చిలకా...శాభాషూ!
కొబ్బరీ చిప్పయే నీకు గతి చిలకా
చిప్పనూ కాదనీ
లప్ప సంపాదిస్తే
లప్ప నీ వెంటవదు చిలకా........అయ్యో!
కొబ్బరీ చిప్పయే నీగతీ చిలకా
కొడుకులూ కోడళ్ళు తన్ని తగిలినవేళ
ఆత్మీయులెవ్వరూ ఆదరించని వేళ
రామ నామమే నీగతీ చిలకా....అంతే! అంతే!!
కొబ్బరిచిప్పలే నీ గతీ చిలకా
లప్పకాదనుకునీ
చిప్పయే బతుకంటె
తిప్పక్కడున్నదే చిలకా...నిజమా?
నీ బతుకు తిప్పక్కడున్నదే చిలకా
కాని కాలంలోన
కట్టెలే నీ తోడు
కాని కాలమొచ్చి కట్టెలే లేకుంటె
చిప్పలే నీ గతీ చిలకా
కొబ్బరి చిప్పలే నీగతీ
మొద్దులే నీ గతీ
డొక్కలే నీ గతీ
కమ్మలే నీ గతీ
ఆకులే నీ గతీ
గులకలే నీ గతీ
పుచ్చెలే నీగతీ
దయ్యపు పుచ్చలే నీ గతీ చిలకా
దయ్యపు పుచ్చలూ లేకుంటె
పాతరే నీగతీ చిలకా
నిలువు పాతరే నీ గతీ చిలకా
ఉప్పు పాతరే నీ గతీ చిలకా
🙂🙂
ReplyDelete“కన్యాశుల్కం” నాటకంలో గురజాడ వారు వ్రాసిన “ఇల్లు ఇల్లనియేవు, ఇల్లు నాదనియేవు, నీ ఇల్లు ఎక్కడే చిలుకా” తత్వం శైలిలో వ్రాశారండీ 👌.
చివరకు కొబ్బరిచిప్పలు కట్టెలకు ప్రత్యామ్నాయం అని వాటిని ఎంచుకున్నారా ఈ తత్వానికి? బాగుంది, సార్.
🙏
Deleteరౌండ్, షాలో, లైట్ వుడ్ విథ్ ఫైబర్ ఆల్ ఇంక్లూసివ్.. ఐతే ఈ కొబ్బర కాస్త ఎండితే అపుడు చమురు సైతం ప్యూర్.. అంతే గదా శర్మాచార్య.. ఎలా ఉన్నారు..!
ReplyDeleteఅదేమి విడ్డూరమో.. కొబ్బరి ఫ్యామిలి లైన్ అనగా కొబ్బరి చెట్టు కు కాండం మొత్తం పీచు కాని చిప్ప మాత్రం కర్ర, తాటి చెట్టు కాండమంత డొల్ల, తాటి ముంజలు మాత్రం ఒకటి రెండు మూడు.. ఒక్కోసారి నాలుగు క్యావిటి గల పీచు పానియం, ఐతే గీయితే ఈ టాతి, రిబ్బకో మినహా ఈత ఐతే అసలు మొత్తం చెట్టు ముళ్ళ పంది మల్లే ముళ్ళ కాండం, అక్కడక్కడ గుత్తిలో లేత బంగారు రంగులో ఈత కాయలు..!
😀Thank you sir. 🙏
Deleteఎవరినో తిడుతున్నట్టున్నారు...
ReplyDelete😀🙏
Delete