రామ నామ తారకం
భక్తి ముక్తి దాయకం
జానకీ మనోహరం
సకల్లోక నాయకం
శంకరాది శ్రవ్యమాన
పుణ్య దివ్య నామ కీర్తనం
తారంగం తారంగం
తాండవ కృష్ణ తారంగం
వేణూ నాదా తారంగం
వెంకట రమణా తారంగం
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరియని బొగడంగ వశమె హరి శ్రీకృష్ణా
హరి యను రెండక్షరములు
హరియించును పాతకముల నంబుజనాభా
హరి నీ నామ మహాత్మ్యము
హరియని బొగడంగ వశమె హరి శ్రీకృష్ణా
శ్రీరామ రఘుకుల నందన సీతాపతి
ReplyDelete~!!!~
°|°
-'-
శ్రీధర్,
Deleteరామ చరణం
మాకు శరణం
శ్రీరామ చరణం
అదె!చక్రాయుధధారి, మాధవుడు బాహాబాహియౌధ్ధత్య సం
ReplyDeleteపద గన్పట్టగ నేకచక్రమున తా బాలించు బ్రహ్మాండమున్
గదయున్ శార్ఙ్ఞము చక్రమున్ బొదివిశంఖంబూది రూపించెడిన్
మదినిండాపరమాత్మయై మెదలు రామా ! నీకు కైమోడ్చితిన్ .
ఆ కోదండము పట్టు ఠీవి , కనులం దార్తావన జ్యోతులున్
ReplyDeleteరాకాశోభలు గుల్కు నెమ్మొగము , శ్రీరాజిల్లు వక్షంబునున్
లోకాలేలు కిరీటభాస్వికలు నీలోగంటి రామా ! త్రిలో
కైకారాధననామ ! నిన్గొలిచి మ్రొక్కం గల్గు సర్వార్థముల్ .
రాజావారు,
Deleteశ్రీరామ రామ రామేతి
రమే రామే మనోరమే
సహస్ర నామ తత్తుల్యం
రామనామ వరాననే