YVR, కాలక్షేపం కబుర్ల బ్లాగులో ఒక సంఘటనని రాసాను అదే ’నాకు నచ్చిన పెళ్ళి’. అది కథలా అనిపించిందొక మిత్రులకు, ఐతే మనం కతలు కూడా రాయగలమనమాటనుకుని నిజంగానే ఒక కత రాసాను అదే ’చెల్లుబాకీ". బ్లాగులోనే వేసాను. ఇది చూసిన మిత్రులొకరు జాల పత్రికకి పంపి ఉంటే బాగుండేదంటే, చూదాం లే అనుకున్నా! చాలా కాలం ’రాసుడు’ కార్యక్రమం ఎత్తి కట్టేసాను. ఒక సంఘటనతో చెయ్యి దురదెత్తి మరో కత రాసాను. జాల పత్రిక వారు దాన్ని ప్రచురించారు.
ఈ లోగా ఎన్నికలొచ్చేసాయి. ఒక సంఘటనతో మరో కత రాసాను. ఘాటెక్కువైపోయిందని ప్రచురించి ఉండరు. సరేనని మూలపడేసాను.
కాలక్షేపంకబుర్ల బ్లాగులో ఇప్పటికి 1115 టపాలయ్యాయి. ఒక్కటపాతో అది మూసెయ్యచ్చని చూస్తున్నా. ఈ కత బ్లాగులో ఇప్పటిలో వెయ్యడం ”మంచిపనికాదని”...... :) అదండి సంగతి
ReplyDeleteఅపుడే చెప్పెనురా ము
ళ్లపూడి వెంకట రమణ, భళా చాయ్ వాలా
యె ప్రధానమంత్రి గా తా
ను ప్రముఖ సేవకునిగా యినుమడించునురా!
జిలేబి
ముళ్ళపూడి వారిది ముందు చూపు కదా
Deleteఈ కథ ఎక్కడ దొరుకుతుంది?
ReplyDeleteనెట్ లో ప్రయత్నించాను,దొరకలేదండి. ఎవరేనా చెబుతారేమో చూడాలి.
Deleteగురువుగారికి, బ్లాగ్ మిత్రులకి -
ReplyDeleteటీ వాలా కధ ఇక్కడ దొరికింది. http://kathanilayam.com/story/11165
డౌన్లోడ్ చేసుకోవచ్చుు. 🙏🙏🙏
yvr
Deleteలింకిచ్చి మంచి కత చదివించినందుకు ధన్యవాదాలు.
ఇలాటిదే ఒక రాజకీయ కత రాసి జాల పత్రికకి పంపేను. గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చేసిందండి.
గురువుగారూ నమస్సులు. ఆనా"టీ"వాలాకి, ఈనా"టీ"వాలాకీ తేడా తెలుసుకుందామని వెతికాను. దానితోపాటు కధానిలయంలో ఇంకా ఎన్నో కధలు దొరికాయి.
Deleteమీ కధ మీ కాలక్షేపం కబుర్లలో పెడితే జాలపత్రికలలో కంటే ఎక్కువ మందికి చేరుతుందని అనుకుంటున్నాను.
Deleteరాసిందెవరని దాన్ని బట్టి వుంటుందండీ ప్రచురణ
ప్రచురించండీ మీ బ్లాగులోనే చదివి కామెంట్తాం :)
నారదా!
జిలేబి
YVR,
Deleteకాలక్షేపం కబుర్ల బ్లాగులో ఒక సంఘటనని రాసాను అదే ’నాకు నచ్చిన పెళ్ళి’. అది కథలా అనిపించిందొక మిత్రులకు, ఐతే మనం కతలు కూడా రాయగలమనమాటనుకుని నిజంగానే ఒక కత రాసాను అదే ’చెల్లుబాకీ". బ్లాగులోనే వేసాను. ఇది చూసిన మిత్రులొకరు జాల పత్రికకి పంపి ఉంటే బాగుండేదంటే, చూదాం లే అనుకున్నా! చాలా కాలం ’రాసుడు’ కార్యక్రమం ఎత్తి కట్టేసాను. ఒక సంఘటనతో చెయ్యి దురదెత్తి మరో కత రాసాను. జాల పత్రిక వారు దాన్ని ప్రచురించారు.
ఈ లోగా ఎన్నికలొచ్చేసాయి. ఒక సంఘటనతో మరో కత రాసాను. ఘాటెక్కువైపోయిందని ప్రచురించి ఉండరు. సరేనని మూలపడేసాను.
కాలక్షేపంకబుర్ల బ్లాగులో ఇప్పటికి 1115 టపాలయ్యాయి. ఒక్కటపాతో అది మూసెయ్యచ్చని చూస్తున్నా. ఈ కత బ్లాగులో ఇప్పటిలో వెయ్యడం ”మంచిపనికాదని”...... :) అదండి సంగతి
ReplyDeleteవాలా కతనే కనుగొని
జాలము లో లంకె నిచ్చి చదవన్ వైవీ
చాలా మందికి సాయము
బాలా చేసిరి సలాము పరిపరి చేయన్ :)
జిలేబీయము :)
ఇటువంటివి అడిగితే వెతికి లింక్ లివ్వడం మా అరవపాటి కి అలవాటు. పాటీకి ఓపికతగ్గినట్టుంది :)
Deleteఓపికంతా పద్యాలు కట్టడంలో వినియోగమవుతున్నట్లుంది కదా శర్మ గారు. పద్యాలు .... మీమీదను, నామీదను, వైవీమీదను, మరెవరైననూ వారి పద్య తాడనానికి అతీతం కాదు.
Delete
Deleteమీపై నా నాపైనా
నాపై వైవీ పయిన సునాయాసముగా
తాపీగా నితరులపై
టోపీ వేసెడు పదముల టుమిడి జిలేబీ :)
జిలేబి
విన్నకోటవారు,
Deleteఎవరిమైనా పద్యాలు కట్టేస్తారు! కొత్తగా కచికి నామధేయం కూడా ధరించారట, :)