Sunday, 29 January 2017

Monday, 16 January 2017

మా గ్రామ దేవత వీరుళ్ళమ్మ

మా గ్రామ దేవత వీరుళ్ళమ్మ, పేరు చిత్రంగా ఉందా? నిజమే! అమ్మవారు చేతిలో కత్తితో, ముఖంలో కరుణతో ఉంది. 

 వీరత్వం సూచించే కత్తితో అరివీరభయంకరంగా ఉంటుంది, మాకు మాత్రం చల్లని తల్లి.. తల్లి వీరులను కన్నతల్లిగా భావించి, అరివీరభయంకరంగా ఉండే కత్తితో దొరికింది కనక వీరుళ్ళమ్మ అని నామకరణం చేశారు. పుట్టని తల్లికి నామకరణం....అదీ అమ్మ గొప్ప..


Friday, 13 January 2017

Saturday, 7 January 2017

దేవుని ఊరేగింపు (ఊరెరిగింపు)

ఊరేగింపు కాదు ఆ మాట ఊరెరిగింపు. గుళ్ళో ఉండే దేవుడు కూడా ఊళ్ళో వారిని ఆశీర్వదించడానికి బయటికొస్తాడు, అమ్మ వారితో సహా అదే ఇది


పల్లకిలో అమ్మవారు

దేవుని ఊరేగింపులో కాగడా. ఏడమ చేతిలోది కాగడా కుడి చేతిలోది నూనె ’సిద్ది’ (సాధారణంగా ఆముదం)



Wednesday, 4 January 2017

కాటుక కంటి కాటు

పాము, తేలు కాటేస్తాయ్! మందుంది
కుక్కకాటుకి మందుంది.
మనిషి కాటుకి మందులేదు
డబ్బు పిచ్చి మనిషి కాటేస్తే
మందే లేదు


కన్ను కాటేస్తే?
కన్ను కాటేస్తుందా?
కాటుక కన్ను కాటేస్తే
మథురమా?మందుందా?

 ఇలాఒక విషయం మీద కత రాయమంటే దంతుర్తి శర్మగారో కత రాశారు, ఇక్కడ చూడండి.
 శ్రీ వినాయకా లాండ్రీ సర్వీస్ - http://eemaata.com/em/issues/201701/9749.html       కిందటి నెలలో


కాటుక కంటి కాటు పై కథ,కవిత చెప్పగలరా?

Sunday, 1 January 2017

ఆంగ్ల నూతన వత్సర శుభకామనలు,శుభాభినందనలు



అమ్మలు, అభిమానులు, ఆప్తులు, మిత్రులు,
హితులు,స్నేహితులు, మనవరాళ్ళు, మనవలు
అందరికి
2017 
ఆంగ్ల నూతన వత్సర
శుభకామనలు,శుభాభినందనలు