ఆహా! ఏమి తెలివి
మనదేశంలో భక్తి ఎంత ఉందో అంతా యుక్తీ ఉంది. ఒక పట్టణంలో అదో పెద్ద వీధి, వీధి చివర అక్కడో వినాయక విగ్రహం, ఎప్పుడో ఎవరికో ఆవేశం వచ్చి పెట్టేశారు. దానికో చిన్న ఆలయం, ఒక చిన్న హుండీ, ఒక ధర్మకర్తలమండలి, అన్ని హంగులూ ఉన్నాయి. వీటితో పాటు కోర్కెలు తీర్చే సిద్ధి వినాయకునికి ఒక బేంక్ అక్కౌంటూ ఉంది. ఈ ఆలనా పాలనా లేని గుడికి ఒక పూజారి, నెలకో రెండొందలిస్తే రోజూ వచ్చి విగ్రహం మీద కాసిని నీళ్ళుపోసి దీపం వెలిగించి, చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టిపోతుంటాడు, రెండు పూటలా. చవితినాడు కాస్త హడావిడి చేస్తారు, బస్, మళ్ళీ మామూలే. ఈయనో ఊరూపేరూలేని పేద వినాయకుడు, ఎందుకంటే ఆయన హుండీలో సంవత్సరం పొడుగునా చూసినా ఐదు రూపాయలు పడవు, కాని ఆ హుండీకో మిల్లర్ తాళం, గట్టి గుంజక్కరలేకా ఊడొచ్చీదే!
ఇలా రోజూ దీపం పెట్టిపోతున్న పూజారికి హుండీ మూత కొద్దిగా తెరచి ఉంచినట్టనిపించింది, పూర్తిగా తెరచి చూచాడు, ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు, నోట మాటా రాలేదు,మనసుకి చైతన్యమూ పోయింది. ఏం చూశాడూ? ఎర్ర కట్టల పాములు హుండీ పట్టనంతగా ఉన్నాయి, అవే రద్దయిన వెయ్యి రూపాయలనోట్లు. ఇప్పుడేం చెయ్యాలో తోచక ధర్మకర్తల మండలికి ఫోన్ చేశాడు, పావుగంటలో చేరిపోయారంతా వార్త తెలిసి, ఎవరేశారు? తెలీదు. జనమే జనం స్వామి పట్ల ఆ భక్తుని కున్న భక్తిని కొనియాడుతూ. మండలి ఒక నిర్ణయం తీసుకుంది, ఈ సొమ్ము స్వామి పేర బేంక్ లో వెయ్యాలని, వేశారు. ఇప్పుడేం జరుగుతుందో చూడాలి.
తెరవెనక కథ చెప్పగలరా? :)

ReplyDeleteతెరవెనుక కత కోసం "వెంకట రమణా గోవిందా గోవిందా" అన్న జిలేబి టపా చదవాలండీ :)
యెంకన్న కరుణామయుడు మాత్రమే గాదు బకాయిల్ని చలాగ్గా లాగేసుకుంటాడు కూడన్ను :)
చీర్స్
జిలేబి
జిలేబి గారు,
Deleteమీ ఎంకన్నబాబు కి ’ఉచ్చు’కోడమే తెల్సండి, ’ఇచ్చు’కోడం తెల్దు. ఉచ్చుకుని ఇచ్చుకోటంలో ఉన్న ఆనందం ఆయనకేటి తెల్సండి :)
ధన్యవాదాలు.
This comment has been removed by the author.
Deleteఅసలు సిసలైన "నొటో"రియస్ (notorious) తెలివి అండీ ఇది :)
ReplyDeleteలలిత గారు,
Deleteబలే ’పన్న్’ఏరండి,అంతే కదండీ
ధన్యవాదాలు.
Deleteలాలి దాడి :)
జిలేబి
Deleteలాలి 'ధా టీజ్ ' :)
జిలేబి
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeleteగలను. వినాయకుడికి కనక బేంకులూ, సర్కారు వారూ, మంత్రివర్యులూ నోరు రెండు చేతుల్తోనూ మూసుకుని దాన్ని తెల్లగా చేస్తారు. అది వినాయకుడి ఎకౌంట్లో జేరగానే మరింత తెల్లగా అయ్యి (శుక్లాంబరధరం... శశి వర్ణం కదా మరి) అక్కడ్నుంచి హుండీలో వేసిన నల్లచేతుల్లోకి అతి మామూలుగా వెళ్లిపోవచ్చు. వినాయకుడికి ఏమీ చేతకాదు కనక ఆ రెండు పూట్లా పెట్టే బెల్లం ముక్కతో అలాగే చూస్తూ ఊరుకుంటాడు పూజారి గారి సణుగుడు రెండు పూటలా వింటూను (సమయం వచ్చేదాకా). సర్వే జనా సుఃఖినోభవంతు!
ReplyDeleteDG గారు,
Deleteకత రేఖామాత్రంగా (out line) బాగా చెప్పేరు, కత రాస్తే రక్తి కట్టించగలరు, మీరు రాస్తే బాగుంటుంది, రాయండి మరి, మీరు కాదంటే నేను చేయి చేసుకొవలసొస్తుందేమో! చేయి చేసుకోడమనేశా ఇది శ్లేషేం కాదండోయ్!
ధన్యవాదాలు.
Deleteఈ డీజీ యే 'వారా' :)
ఈమాటు వారే డీజీ యా :)
జిలేబి
వారే వీరా, వీరే వారా?
Deleteజిలేబీ వేరా సమోసా వేరా?
వారెవరో వీరెవరో?
ఎవరికి వారే యమునా తీరే
కష్టే ఫలి గారు, కష్టే బలి అంటున్నారండి TV9 వారు.
ReplyDeleteబోనగిరి గారు,
Deleteయద్భావం తద్భవతి కదా! వారికి బలే గుర్తొస్తుంది మరి.
ధన్యవాదాలు.
మిత్రులు శర్మగారు,
ReplyDeleteగాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం. ఈ సామెత మనకు తెలిసినదే కదా.
ఏమో ఎవరికి తెలుసునూ? ఆ ధర్మకర్తలమండలిలోని వారే ఆ సొమ్మును వినాయకస్వామివారి ద్వారా నలుపు వదిలించి తెల్లబరుస్తున్నారేమో. ఆనక తీరిగ్గా అదే వినాయకులవారి పైన ఖర్చు వ్రాసి చక్కగా తమతమ అక్కౌంట్లలో జమ చేసుకొనే విద్య వారికి బాగానే తెలిసి ఉంటుంది కదా. ఇంక వారికి బెంగ ఏముంటుందీ? ఇదీ వ్యవహారం అని తెలిసి అనవసరంగా ఆశ్చర్యపోవలసిన అగత్యం సామాన్యజనానికి మాత్రం ఏముంటుందీ చెప్పండి?
అన్నట్లు వినాయకులవారికి మహాఐతే మరొకొన్ని ఉండ్రాళ్ళూ మరికొన్ని బెల్లముక్కలతో కొంచెంగా వైభోగం తాత్కాలిక ప్రాతిపదికన జరుగ వచ్చును. వాటితోటే ఆయనా ఆయన భక్తగణమూ సంతోషపడక తప్పదండి.
శ్యామలరావుగారు,
Deleteసమస్యని మరో కోణంలో చూశారు, ఇదీ బాగానే ఉండి ఉంది. రేఖామాత్రంగా మీరు చెప్పిన కథా బావుంటుంది, ప్రయత్నం చేయండి. అందరూ జరిగిన కతలు చెబుతారు, జరగనున్న కత చెబితే బాగుంటుంది కదూ :)
ధన్యవాదాలు.