Monday, 27 October 2025

తుఫాను ముందు నిశ్చలత.

 తుఫాను ముందు నిశ్చలత.


తుఫాను ముందు వాతవరణం చాలా నిశ్చలంగా ఉంటుంది. స్థంభించిన చిన్నెలు కనపడతాయి,చూసే కన్నూ,మనసూ ఉండాలి. ప్రకృతి చిన్నబోతుంది. ఈ రోజు ఉదయానికే ప్రకృతి స్థంబించింది. ఆకాశం పూర్తిగా మేఘావృతమై రాత్రిని తలపిస్తోంది. చిన్నచినుకు ప్రారంభమైనది,ఇదే తుఫానుకు సంకేతం. 

తుఫానుకోసం తీసుకోవలసిన జాగరతలు అనంతం, శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం,అందుచేత వ్యక్తి భద్రత ముఖ్యం, ఆ తరవాతది ఆస్థి భద్రత. చాలా జాగరతలు చాలా సార్లు చెప్పేను, మళ్ళీమళ్ళీ చెప్పే ఓపికలేదు.

1.పాలు,నీళ్ళు జాగరత చేసుకోండి. కరంటు ఉండకపోయే సావకాశాలే హెచ్చు.

2.పిల్లలు,మందులు జాగరత. 

3.ఇంటిపైన,బయట చుట్టూ పారేసిన పనికిరాని వస్తువులు ఎగిరిపోకుండా చూడండి.అవి ఎగిరిపోతే నష్టం కాదుగాని ఇతరులకు హాని కలిగించచ్చు. 

4.సెల్ ఫొన్ ల్లో రిఛార్జి ఉందో లేదో చూసుకోండి. అనవసరంగా సెల్ ఉపయోగించద్దు. 

5.మీభద్రత కావలసినవారితో పంచుకోండి. 

6. అనవసరంగా బయట తిరగద్దు.  

7. కొంత సొమ్ము దగ్గరుంచుకోండి,అవసరం కావచ్చు.

8.ముసలి,ముతకల్ని గమనించండి.


జాగరతలు  అనంతం, ప్రమాదం  చెప్పిరాదు సుమా!

No comments:

Post a Comment