శ్రీ శ్యామలీయంగారికి సతీ వియోగం.
ప్రముఖ బ్లాగరు శ్రీ తాడిగడప శ్యామలరావు గారికి సతీమణి శ్రీమతి శారద గారు నిన్న(5.10.2025) ఉదయం 7.43 నిమిషాలకు ఇహలోకయాత్ర
చాలించినట్లు
శ్రీ శ్యామలీయంవారి ద్వారా ఇప్పుడే తెలిసింది.
శ్రీమతి శారదగారు బహుకాలంగా డయాలిసిస్ తో ఉన్నట్టు తెలిసిన సంగతే. కొద్దికాలంగా హాస్పిటల్ లో ఉండి వెంటిలేటర్ కూడా పని చేయక, రెండురోజుల కోమా తరవాత ఇహలోకయాత్ర చాలించిన దుర్వార్త తెలిసి ఖిన్నుడనయ్యాను. మాటాడటానికి మాట పెగలలేదు.
సంతానం లేని శ్యామలీయంగారు,ఈ కష్ట సమయంలో మనసు కుదుట పరుచుకోవాలని కోరుతున్నా.
శ్రీమతి శారదగారి ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్ధిస్తూ, శలవు.
శ్రీమతి శారదగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ,
ReplyDeleteశ్రీ శ్యామలరావు గారికి, ధైర్యాన్నిచ్చి, త్వరగా ఈ బాధ నుండి కోలుకునేలా చేయమని శ్రీరామచంద్రుడుని కోరుకుంటున్నాను.
శ్రీ శ్యామలరావు గారికి ఈ వయసులో ఈ దెబ్బ తగలడం, ఇక. వంటరితనం చుట్టుముట్టడం చాలా విచారించవలసిన విషయం.
ReplyDeleteఈ వార్త ఇందాక మీరు నాకు చెప్పిన మీదట శ్రీ శ్యామలరావు గారికి ఫోన్ చేసి పరామర్శించాను.
శ్రీమతి శారద గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏.
శ్రీమతి శారద గారికి శ్రద్ధాంజలి. 🙏
ReplyDeleteఈ కష్ట సమయంలో శ్యామల రావు గారికి
ReplyDeleteరఘువీరుడు బాసట యగు గాత !
ఒంటరితనము నాకంటంచి జగదాంబ
ReplyDeleteయింటికి చేరె నాకంటివెలుగు
రెక్కలు తెగినట్టి దిక్కుమాలిన యొంటి
పక్కి నైతిని రామభద్ర నేను
బాధలుడిగి యంబవద్ద నుండెను తాను
బాధతో నేనింటి వద్ద నుంటి
సాధుశీలకు కలిగె సద్గతి నాకిట్టి
దుర్గతి ప్రాప్తించె తోరముగను
యేది జరిగిన శ్రీరామ నీదు లీల
నడుపుచుండిన యీజగన్నాటకమున
భాగమే యని యెరిగియు బాధపడక
యుండుటే నాకు చేతగాకున్న దయ్య
అంబ సన్నిధి శారద కబ్బె నిపుడు
నీవు నను బిల్చు టెన్నడో దేవదేవ
సర్వలోకేశ శ్రీరామచంద్ర భక్త
వరద నీయిఛ్ఛ యెటు లట్లు జరుగు గాక
అని విన్నవించి రాముని
పనుపున ధర నుండు నట్టి వాడను నన్నే
మని హరి నియమించిన నా
పనులను నెరవేర్చి జనెడు వాడను మరియున్
మీరు ఒంటరి కాదండి. మీ బంధుమిత్రులతో పాటు, బ్లాగు మిత్రులు కూడా మీతో ఉన్నారు. 🙏
Deleteశ్రీమతి శారద గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ. 🙏
ReplyDeleteశ్రీమతి శారద గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని కోరుకుంటున్నాను 🙏 🙏 🙏
ReplyDeleteవదిన ఆత్మకు సద్గతులు చేకూరుగాక!
ReplyDeleteఅన్నయ్యకు మేమంతా కలిగిన సంతానము వంటి వారమే..
మేమందరమూ ఉండగా అన్నయ్య ఒంటరి కాలేడు.
అందరినీ మించిన తోడు, ధైర్యం.
శ్రీరామ చంద్రుడు. ఆ దైవమే అన్నయ్య వెన్నంటి ఉండగా ఇక
ఒంటరి అగుట కళ్ళ.
శ్యామలీయం వారు,
ReplyDeleteఋణానుబంధ రూపేణా
పశు పత్ని సుతాదయః
ఋణ క్షయే క్షయంయాంతి
తత్రకా పరివేదనా.
ఇదం కాష్టం ఇదం కాష్టం
నద్యం వహతి సంగతః
సంయోగశ్చ వియోగశ్చ
కా తత్ర పరివేదనా
యావత్కాలం భవేత్కర్మ
తావత్తిష్టంతి జంతవః
తస్మిన్ఖ్షణే వినస్యంతి
తత్ర కా పరివేదనా
ఇవి మీకు తెలియనివా? కాని ఈ సమయంలో.... ఇదే జీవితం.
జరగవలసినది జరిగిపోయింది. వేదన తప్పదు,పరివేదన చెందద్దు. ఎవరేమి చెప్పినా,ఎవరెంత చూసినా, మనసులో ఏర్పడ్డ వెలితిని ఎవరూ పూరించలేరు, ఈ ఒంటరితనం తప్పదు. చివరిరోజు ఎవరికి ఎప్పుడొస్తుందో తెలియదు, జంటలో మిగిలినవారు,చివరిరోజుదాకా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోలేకపోతే హాస్పిటల్ పాలైతే చూడగల ఓపిక,తీరిక ఎవరికీ ఉండదు. మీ ఆరోగ్యం కాపాడుకోండి,మానసికంగా కృంగిపోవద్దు.(Don't get depressed). రాముడే మీకు పెద్దతోడు.
తెలియక కాదండి
Deleteస్వరసవాహీ విదుషోపి తథారూఢాభినివేశః
ప్రాణిసహజమైన ఈమరణం గురించిన నిర్వేదం విద్యావంతులకూ సహజమే. కాని వారివారి ఆధ్యాత్మిక హసాధనానుసారంగా న్యూనాతిరిక్తాలుగా ఉంటుంది. నాకు కూడా ఈ నిర్వేదం ఒక passing cloud అవుతుంది. దానికి కొంచెం సమయం కావాలి. అంతే.
Syamaliyam garu: Be brave. God will lead you. Sorry for the loss.
ReplyDelete