Tuesday, 3 December 2024

అమ్మకానికి లేనిది

డబ్బుతో  కొనలేనిది ఉందా?/డబ్బుతో  కొనలేనిది ఉoది


 ధన మార్జయ కాకుత్స్థ

ధన మూల మిదం జగత్!

శ్రీరాముడు. శ్రీమద్రామాయణము.


డబ్బే లోకంలో సర్వానికి మూలం సుమా!


డబ్బుతో కొనలేనిది ఉందా లోకం లో?


ఎంత డబ్బుతోనూ కొనలేనిది,అమ్మకానికి లేనిది "క్షణం ఆయుస్సు!"

11 comments:

  1. లక్కీ భాస్కర్ సినిమా చూసారా?

    ReplyDelete

  2. Bonagiri1 December 2024 at 09:35
    సినిమాలు చూడను కదండీ. చూసి దగ్గరగా నలభై ఏళ్ళ పైమాట. కొద్ది లో చెప్పెయ్యలేరూ!

    ReplyDelete
  3. నేనూ చూడలేదులెండి, బోనగిరి గారూ, అదేదో హర్షద్ మెహతా లాంటి కథ అని ఓ ఫ్రెండు అన్నాడు. అంతేనా?

    ReplyDelete
  4. శర్మ గారు,
    // “ ఎంత డబ్బుతోనూ కొనలేనిది,అమ్మకానికి లేనిది "క్షణం ఆయుస్సు!"” //

    అది ఎలాగూ అసాధ్యమే.
    అలాగే డబ్బుతో కొనలేనిది సంస్కారం కూడా అని నా అభిప్రాయం 🙏.

    ReplyDelete
  5. అన్న ! డబ్బుతో కొనసేని వెన్నొ కలవు
    ప్రేమ లనురాగ వల్లరుల్ క్షేమములును
    గౌరవములును తగు వివేకములును
    కడు మనశ్శాంతి ఆరోగ్య నడవడులును .

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete
    2. కరక్టే కదండి 🙏.
      అవునూ, ఆ ఘట్టంలో జరాసంధుడా లేక శిశుపాలుడా 🤔 ?

      Delete
    3. This comment has been removed by the author.

      Delete
    4. విన్నకోట నరసింహా రావు4 December 2024 at 10:04
      ఇది మాగధుడు జరాసంధుడు,(చైద్యుడు) చేది దేశపురాజు శిశుపాలునితో చెప్పినమాటేనండి,నేను పొరబడి తప్పు చెప్పేను మన్నించండి. మార్పుచేసేను చూడగలరు.

      Delete
  6. అందని ద్రాక్షపండ్లు పుల్లన

    డబ్బులేనిదే ఏదీ లేదండోయ్

    ReplyDelete
  7. విన్నకోట నరసింహా రావు3 December 2024 at 14:54
    వెంకట రాజారావు . లక్కాకుల3 December 2024 at 15:36

    ''బతుకుంటే బలుసాకైనా తిని బతకొచ్చని '' నానుడి కదండీ. పాపం జరాసంధుడు ఇలా అంటాడు శిశుపాలునితో రుక్మిణీ కల్యాణ ఘట్టం లో

    బతుకవచ్చు నొడల ప్రాణములుండిన
    బతుకు గలిగెనేని భార్య గలదు
    బ్రతికి తీవు భార్యపట్టు దైవ/దయ్య మెరుంగు
    వలదు వలదు చైద్య! వలదు వలదు.

    మాగధుడు జరాసంధుడు,(చైద్యుడు) చేది దేశపురాజు శిశుపాలునితో
    ప్రాణాలుంటే ఎలాగైనా బతకొచ్చు. బతికితే పెళ్ళాం సంగతి చూడచ్చు. బతుకేవు సంతోషించు భార్యసంగతి దైవమెరుగు ,వద్దు,వద్దు,కృష్ణునితో యుద్ధం వద్దు అన్నాడు.

    డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నాయండి కాని,ప్రాణాలు ముందు ఆ తరవాతే ఏదైనా కదండీ!

    ReplyDelete