Friday 26 February 2021

ఊపిరున్నంత వరకు పోరాడు.


 Courtesy:What's app

ఆశావాదం

2 comments:

  1. దీనినే మా మాతృకలో "చాల్ మాల్‌డీ రామ్ ఛ" అంటారు ఆచార్య. సుదూర తీరాల దారిని చూసి ఖంగు తిని ఆగిపోతే ఇహ ఓటమిని చవిచూసినట్లే.. పంచభూతాలు ఏవి వాటి తీరు తెన్నులు మార్చుకోలేవు.. కాలానుగుణంగా సాగిపోవటమే కొత్త బాటకు నాంది.. బతుకు బాటకు పునాది..

    రెండు సంఘటనలు చెబుతాను ఆచార్య.. మేముండే కాలనిలో కూరగాయలకు కొదవలేదు కాని పండ్లకు గాను మూడు కాలనీలు దాటాలి. ఐతే ఓ రోజు వస్తు దారి మరచిపోయా.. వేరే దారి గుండా వెళదామంటే ఫోన్ కూడా లేదాయే.. అపుడు నాకు నేనుగానే ఓ దారిలో ముందుకేగాను.. ఇంకేముంది ముందు లోతైన మురికి కాలువ అది దాటితే అటుగా మా కాలని కి దారి.. ఇహ అలానే ముందుకు వెళ్ళి ఫెన్సింగ్ పిల్లర్, కల్వర్ట్ పైప్ లను పట్టుకుంటు ఆ కాలువ దాటి ఇంటి దారి పట్టుకున్నా..

    మరొకటి ఇటలిలో బుత్రియో దరి దానియేలి మెక్కానికి ఎస్పీఏ టూర్ కని మా నాన్నగారు తొమ్మిదేళ్ళ క్రితం ఫ్రియులి వెనెజియా గుయిలి వెళ్ళొచినపటిది.. రాత్రి ఏడెనిమిది గంటల సమయంలో లోకల్ గా సైట్ సీయింగ్ కై నాన్నగారితో పాటు మరొక ఫ్యామిలి హోటల్ క్రిస్టాలో బయటకు వచ్చి.. ఆ ఫ్యామిలి ఫ్రెండ్స్ ఎవరో అక్కడే ఉంటే రాత్రికి అక్కడే ఉండిపోయారట.. నాన్నగారేమో ఎందుకులే అని తిరిగి హోటల్ కు వచ్చేదామని వస్తూ దారి మరచిపోయారుట.. ఏమైన అడుగుదామంటే ఇటాలియన్ రాదాయే.. గూగూల్ మ్యాప్స్ ఉన్న ఫోన్ అపటికి లేదాయే.. ఖంగు తిని అటు ఇటు చూస్తు పక్కనే వాక్వే పై నిలబడ్డారుట.. ఇంతలోనే ఎవరో తెలుగువారే కాకపోతే వేనిస్ లో స్థిరపడ్డవారే.. మీరు ఇండియన్ లా ఉన్నారే.. ఎక్కడికెళ్ళాలని అడిగారట తెలుగులోనే.. వేంటనే నాన్నగారు "హోటల్ క్రిస్టాలో, పియజాలే గాబ్రియేలే ది'యనున్జియో, ౪౩, ౩౩౧౦౦ వుదిన్, బుత్రియో, ఫ్రియులి వెనెజియా గుయిలి, ఇటాలియ" అన్నారుట.. దగ్గరుండి మరి దింపి వచ్చారట..!

    ReplyDelete
  2. శ్రీధరా!
    అదృష్టం చెప్పలేం! దేశం కాని దేశంలో రాత్రి వేళ ఒక భారతీయుడు అందునా తెనుగువాడు పలకరించడం, అదీ దిక్కు తోచని వేళ చెప్పుకోతగ్గదే!

    ReplyDelete