Monday 15 February 2021

యతో భ్రష్టః తతో భ్రష్టః

 


భుక్త్వా శతపదం గఛ్ఛేత్

తాంబూలమ్ తదనంతరమ్

వామపార్శ్వేతు శయనమ్

ఔషధైః కిం ప్రయోజనమ్ ?.


భొజనానంతరము నూరడుగులు నడచి తాంబూలము సేవించి, ఎడమవైపు పడుకుంటే ఔషధములెందుకు?


After dinner sleep awhile. After supper walk a mile.


దేశీయమైనదేదీ నమ్మం, విదేశీయమైనది అర్ధం చేసుకోం. 

యతో భ్రష్టః తతో భ్రష్టః


10 comments:

  1. దేశీయమైనదాన్నే తెల్లవాడు చెబితే మనకి మహా నచ్చుతుంది కదండీ. దానికి తోడు స్వంత పైత్యం కూడా. భోజనం తరువాత కాదు, ముందు నడవాలి అంటాడు ఒకడు; భోజనంతో నీళ్ళు తాగకూడదు, ముందే తాగెయ్యాలి అంటాడు మరొకడు; పళ్ళు భోజనానంతరం తినకూడదు, ముందే తినెయ్యాలి అంటాడు ఇంకో మల్లన్న. గందరగోళం చేసి పారేస్తున్నారు.

    ఉభయభ్రష్టుత్వం.

    ReplyDelete
    Replies


    1. భోజనమే చేయమాకండి అని‌ ఎవడూ చెప్పడే :)

      Delete
    2. అది వైకుంఠయాత్ర అవుతుంది కదా 🙂 ?

      Delete
    3. బుజ్జమ్మా!

      కొంతమంది వాయుభక్షణ చేసేవారట. సామాన్యులకి సావకాశం లేనట్టుందే :)

      Delete
    4. విన్నకోటవారు,
      మా బుజ్జమ్మకి తప్పించి,ఇటువంటి ఆలోచనలు మరెవరికైనా వస్తాయా చెప్పండి. :)

      Delete
  2. పడిపడి తినకండి పాలీషు బియ్యంబు
    తొలిపొర తవుడు తిని , తొంగొనండి,
    తినవలసినదాన్ని తినరు గాక తినరు
    తినగ పనికిరాని తిండి తింద్రు .


    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      చెప్పినా వినరండి. కార్బ్ లెస్ రైస్ అని అమ్ముతున్నారు. క్యూలో నిలబడి కొంటున్నారు :)

      Delete
  3. కొత్త గిన్నెలో పాత పచ్చడి..
    ఇదేవిటి సామెత అనుకుంటున్నారా ఆచార్య..
    ఇపుడు ఉన్న స్థితిగతులనే తీసుకుందాం...
    నాలాంటి వాడికి కాస్త ముందు జాగ్రత ఎక్కువ.. కనుకనే ఈ కోవిడ్ కాలమున మూతిపై మ్యాస్క్ (మాస్క్) లేకుండ బయటకు వెళ్ళటం లేదు (ఉగాది నాటి నుండి).. ఇహ కొంత మంది ఐతే.. ఇక వ్యాక్సీన్ వచ్చేశాక కూడా మాస్క్ అవసరమా అంటు మ్యాస్క్ లేకుండానే తిరిగే రకం.. ఐతే వారే ఏ హాస్పిటల్ కు వెళితే అపుడు మాస్క్, శానిటైజర్ వాడండంటే మాత్రం అపటికపుడే తీసి వేసుకునే రకం.. డాక్టర్ తో సంప్రదింపులైనాక ఇంకేముంది షారా ఇవాంజేలిన్ మామూలే.. నా భార్య వాళ్ళమ్మ ఈ రెండో కోవకు చెందుతారు.. తా వేసుకోదు.. వేరేవారు వేసుకుంటే నలుగురి ముందు నవ్వులపాలవుతావు తీసేయి మంటది నన్ను.. నేను మొదటి కోవకే కట్టుబడి ఉంటున్నా కనుక.. నేను మాస్క్ తీయను.. (ఇంటిలోపల తీసేస్తా లెండి)
    సో ఇదంత ఎందుకంటే..
    మనకు మనముగా చేసుకోగలిగిన వాటికినూ కావాలనే ఓవర్ లుక్ చేసేస్తాము.. ఎవరైనా చెబితే మటుకు టక్కున వారి ఎదుటైనా సరే చేస్తాము.

    సందర్భోచితమో కాదో.. కాని ఒకటి అడగదల్చుకున్నా..
    ఇపుడు అబ్బాయి పుడితే వంశోద్ధారకుడు పుట్టాడంటారు, కాని అదే ముదసలి వయషొచ్చే సరికి ముసలివాడు మనకొద్దు అంటు ఎందుకంటుంటారు ఈ సమాజంలో.. మరొకటి.. అమ్మాయి పుడితే మాత్రం అమ్మెద్దాం ఎందుకు మనకు భారం అంటారు.. కాని ఆమే పొత్తిళ్ళలోనే జీవం పోసుకునే మనిషికి ఇది తగదు కదా.. అలానే ముదసలి వయసొచ్చే సరికి మాత్రం కొంత మందికి అమ్మ కావాలంటారు.. ఏం.. అహోరాత్రులు కంటిపై కునుకు లేకుండ వారి పిల్లల ఆలన పాలన చూసుకున్న తల్లిదండ్రులు.. అదే వయసు మళ్ళినాక ఎందుకని దూరం పెట్టాలనుకుంటారు.. బహుష.. ఆ ముదుసలి జంట యొక్క స్వర్గస్తులై ఉన్న తల్లిదండ్రులై ఉంటే అదే వాత్సల్యం చూపే వారేమో.. ఇపుడైతే వారి పిల్లలు వారి పిల్లల ఆలన పాలనలో ఉండి ఉంటారు.. రేపు వారికి ఇదే స్థితియా..
    అమ్మ నాన్నలకు రమారమి ముగ్గురు పిల్లలను పోషించుకోవటం భారం కాలేదు ఎపుడు.. మరి ముగ్గురు పిల్లలకు వారి తల్లిదండ్రులను పోషించుకునే స్థాయి స్థితప్రజ్ఞత ఉండదా..

    ఒక కథ ఉంది శర్మ ఆచార్య..
    ఒకానొక ఊరిలో ఓ అత్తా కోడళ్ళు ఉండేవారుట.. అత్త చాలా మంచిది.. పన్నెత్తి ఓ మాట తన కోడలికి అనేది కాదుట.. కాని ఆ కోడలికి అత్తపై ఎందుకో ఎక్కడలేని ఆక్రోషముండేదట.. స్నానం చేయించమ్మ అనంటే వేడినీటిని వీపుపై కొట్టి అరికాళ్ళతో వీపుని రుద్దేదట కావాలని.. పాపం ఆ అమ్మ లాంటి అత్త అదంత పంటిబిగువనే భరించేదట.. ఎక్కడ అబ్బాయికి విషయం తెలిస్తే వారి కాపురం చెడుతుందేమోనని దిగాలుతో.. ఒక తరం ముగిసింది.. ఆ కోడలు ఇపుడు అత్త అయ్యింది.. తన కోడలిపై అరిచేదిట.. స్నానం చేయించమని అడగనే అడిగిందిట.. ఐతే.. ఆ కోడలు సౌమ్యురాలు కావటం చేత అలానే చేయించటానికి సిద్ధం చేసిందట.. వీపు రుద్దటానికి చేతులు చాచితే అదేమి విచిత్రమో ఆ కోడలి అరికాళ్ళు తమకుతాముగానే రాళ్ళ నేలపై రాసుకుంటు ఆ అత్త వీపుపై రుద్దుకున్నాయట.. కోడలు విస్తు పోయిందిట.. అత్తకు గతం గుర్తుకొచ్చిందిట.. (ఎవరి కర్మ కు వారే బాధ్యులు)

    ~శ్రీత ధరణి

    ReplyDelete
    Replies

    1. తప్పదండీ….చేసిన తప్పుకి పనిష్ పడాల్సిందే….

      Delete
    2. శ్రీధరా
      లోకో భిన్నరుచిః. ఆడపిల్లని తేడాగా చూడటం తరవాత కాలంలో వచ్చిన జాడ్యం.

      Delete