Thursday 18 February 2021

పొట్టెందుకు పెరుగుతుంది?

 

పొట్టెందుకు పెరుగుతుంది?


భోజనాగ్రే సదా పథ్యం 

లవణార్ద్రక భక్షణం

రోచనం దీపనం వహ్ని 

జిహ్వాకంఠ విశోధనమ్


భోజనానికి ముందు సైంధవలవణం అల్లం కలిపి నమిలితే జీర్ణ శక్తి పెరుగుతుంది,గొంతు నాలుక పరిశుద్ధమై రుచి కలుగుతుంది.


 భుక్త్వా శతపదం గచ్ఛేత్, శనై స్తేన తు జాయతే,

అన్నసంఘాతశైథిల్యం, గ్రీవాజానుకటీసుఖమ్.

భుక్తోపవిశత స్తుందం, శయానస్య తు పుష్టతా,

ఆయు శ్చంక్రమమాణస్య, మృత్యు ర్ధావతి ధావతః


భోజనానంతరం నూరడుగులేస్తే అన్నము యుక్త స్థానము చేరి శరీరానికి బలం కలిగిస్తుంది. భోజనం చేసిన వెంటనే కూచుంటే పొట్టొస్తుంది,వెంటనే పడుకుంటే శరీరంలో కొవ్వు చేరుతుంది, మెల్లగా నడచిన ఆయుర్వృద్ధి,పరుగెత్తినచో ఆయుక్షీణము.


మరో మాట భోజనానంతరము మెల్లగా నూరడుగులు నడచి వజ్రాసనంలో ఐదు నిమిషాలు కూచుంటే ఆరోగ్యం మీసొత్తే అంటారు పెద్దలు. చిత్రమైన మాటేమంటే భోజనం తరవాత యోగాసనాలు వేయ కూడదు కాని ఈ ఒక్క వజ్రాసనం మాత్రమే భోజనం తరవాత కూడా వేయచ్చు. యోగాసనాలు వేయడం తేలికైన పనికాదు, తెలిసి తెలియక ఆసనాలు వేయడానికి ప్రయత్నం చేస్తే కాళ్ళూ చేతులు నొప్పులు పుడతాయి, విరగచ్చు కూడా జాగర్త.


ఈ రోజుల్లో అందరికి పొట్టలెందుకొస్తున్నాయో తెలిసిందోచ్! భోజనం చేసిన వెంఠనే కంప్యూటర్ దగ్గర కూచోడం అలవాయిపోయింది జనాలికి చాలా కాలంగా అందుకే పొట్టలొస్తున్నాయి. పొట్ట తగ్గే మార్గం........?

24 comments:

  1. కంప్యూటర్ దాకా ఎందుకండీ? అసలు.భోజనాలు ఎలా చేస్తున్నామూ? డైనింగ్ టేబిల్ దగ్గర కూర్చునే కదా, డబ్బాలో వేసినట్లు తిండిని ముక్కు క్రింద గోతిలో వేస్తున్నాం? అది చాలు పొట్టలు రావటానికి. ఆపైన‌‌, తిండి పూర్తి కాగానే కొందరు టీవీల ముందూ మరికొందరు కంప్యూటర్ ముందూ కూలబడతారు. బ్రహ్మాండం. ఒక్కరూ పది అడుగులైనా నడవరు కదా!

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం వారు,

      నేలమీద సుఖాసనం లో కూచోగలవారెందరు సార్!తిండి తరవాత టివి లు కంప్యూటర్లు వదలనివే.తిండికి ముందో పెద్ద తతంగం నడుస్తోంది, అదే మందు,అందరూ అననుగాని, ఇప్పుడదో ఫేషను. దాని సంగతేంటి? ఇంక పొట్టలు రాక ఏం చేస్తాయి చెప్పండి

      Delete
  2. >>సైంధవలవణం

    రాతి ఉప్పా? సముద్రపు ఉప్పా? ఎంత మోతాదులో?

    ReplyDelete
    Replies
    1. చిరు డ్రీంస్ వారు,
      ఇది సముద్రపు ఉప్పు కాదండి, ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. చిన్న అల్లం ముక్క,చిటికెడు సైంధవ లవణం కలిపి నమిలితే చాలు. రోజూ అక్కర లేదు. అవసరాన్ని బట్టే. ఇది అనుభవం మీద చెప్పేదే, పూర్తి వివరాలకు ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి.

      Delete
    2. నాగేశ్వర రావుగారు.
      ధన్యవాదాలు.

      Delete

  3. చెవి నిల్లు గట్టుక ’ సెల్ ఫోను ‘ విడువదు
    నిద్దుర చెఱుపక ‘ నెట్టు ‘ విడదు
    శ్రీవారు దిట్టక ’ టీవీలు ‘ విడువరు
    పది యడుగుల కైన ‘ బండి ‘ విడదు
    పన్నెండు దాటినా ‘ పడకలు ‘ పిలువవు
    పొద్దున్న లేవంగ బుధ్ధి గాదు
    ఉరుకులు పరుగులు – ఓరుముల్ తక్కువ
    సంతృప్తి యన్నది సుంత లేదు

    పనికి రాని ‘ ఇగో ’ లతో బతుకు నిండి
    మనసు , దేహము కృతకమై మారి మనిషి
    సహజ శారీర ధర్మము చచ్చి పోయి ,
    స్పందనల చురుకు కోల్పోయె బతుకు బండి .

    ReplyDelete
    Replies

    1. ఏదో తిన్నామా రిలేక్స్ గా అమెజాన్ లోనో ఆహా లోనో ఓ మూవీ చూద్దామా కొంత పని నుండి బయట పడి అనుకుంటే~


      అబ్బబ్బా విడువరుగా
      దెబ్బల వేయంగ! కొంత తేరుకొనంగా
      జబ్బల కుదేయ విడువరు
      దబ్బున మీదపడి తప్పు తప్పని తిట్లున్!



      నారదా
      వింటున్నారా స్వామి?


      జిలేబి

      Delete
    2. రాజావారు,
      అరటిపండు వలచి పెట్టినట్టు చెప్పేరు, చిలక్కి చెప్పినట్టూ చెప్పేరు.వద్దన్న పని చేయడమే నేటి లక్షణం సార్!
      ధన్యవాదాలు.

      Delete


  4. హేవిటో తాతగారి సైంధవలడ్డుల్ ! హాయిగా తిననివ్వరు కదా కొంతసేపైనా రిలేక్స్ గా కూర్చొని టీవీ చూడనివ్వరుగా
    మధ్యలో డైనింగ్ టేబుల్ మీద చిర్రుబుర్రులు ఆపై నెట్ పై విసుర్లు!

    ఈ ఫెసిలీటీస్ వుండ బట్టేకదా ఇంటర్నెట్ లో ఇన్ని విన్నాణపు రహస్యాలను తెలిపేస్తున్నారు కట్, పేష్టులు చేసేస్తూ?


    అబ్బబ్బ! అంతా ఓల్డు మేళము ంంంం వా:)



    జిలేబి

    ReplyDelete
    Replies
    1. బుజ్జమ్మా!
      టివి ఎదురుగా డైనింగ్ టేబులూ, దాని మీద లేప్ టాప్, బస్.... టిఫిన్ చేసిన చెయ్యి కడుక్కోడానికి కూడా సింక్ దాకా వెళ్ళద్దు. కొంత కాలం తరవాత మన చెయ్యి ఉన్నచోటునుంచి పక్కన పెట్టేందుకు మరొకరొస్తారు, ఎంత సుఖం :) అలాగే కానీ కుందనం.

      Delete
    2. మోడరన్ బామ్మోయ్,
      NOVOTEL వాళ్ళు ''చద్దెన్నం'' అమ్ముతున్నారట.
      సింగపూర్ లో ''చద్దెన్నం'' హోటల్ పెట్టేడం టే కాదు పొమ్మన్నావు.

      Delete
  5. మోడ్రన్ బామ్మకు
    ఓల్డ్ రెసిపీ

    పచ్చిమిర్చి చింతపం డుల్లిపాయకు
    ఉప్పుసేర్చిదంచి ఉడుకుమెడుకు
    అన్నమందు కాస్తవెన్నతో తినిచూడు
    అమృతమన్న నేదొ అర్థమగును .

    ReplyDelete
    Replies
    1. రాజావారు,
      బలే రెసిపి గుర్తు చేశారు, ఇవేళ అదే, మధ్యాహ్న భోజనంలో

      Delete

  6. .... పచ్చిమిర్చి చింతపం డుల్లిపాయకు
    ఉప్పుసేర్చి ...

    నోరూరితే సరిపోతుందాండి ? :)


    ఆ తరువాయి అల్సరో అల్సరని బాధ పడడానికా రాజావారు :)


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. ఏమి ఊరినా మోడరన్ బామ్మకి పిజ్జాలూ బర్గర్లే గతి, రాజావారు చెప్పినదేం తినగలవులే. పచ్చి మిర్చి తింటే అల్సరొస్తుంది, ఉల్లిపాయ తింటే జలుబు చేస్తుంది, చింతపండు తింటే కీళ్ళు పట్టేస్తాయి, ఇంక నువ్వు తినేదేముంది లే :)అమ్మో వెన్నా బాబోయ్! రక్తనాళాలు మూసుకుపోవూ :)

      Delete
  7. "నా పొట‌్ట‌ నా ఇష్టం" అని రెస్టారెంట్ పెట‌్టారంట‌, రాజమండ్రి లో..

    ReplyDelete
    Replies
    1. బోనగిరిగారు,
      బతక నేరిస్తే .....అంతె సార్

      Delete
  8. బోనగిరి గారు,
    రాజమండ్రీలోనే "పొట్ట పెంచుదాం" అనే పేరుతో అయితే రెస్టారాంట్ పెట్టారని విన్నాను (వాట్సప్ ఫార్వర్డ్ ల సౌజన్యం). రాజమండ్రీలోని జాంపేటలో ఉందట. వ్యాపార తాపత్రయాలు పలు రకాలు. 😀

    "పొట్ట పెంచుదాం" రెస్టారాంట్ (రాజమహేంద్రవరం)

    https://telugu.samayam.com/andhra-pradesh/rajahmundry/east-godavari-potta-penchudaam-restaurant-in-rajahmundry-hotel-name-goes-viral-on-social-media/articleshow/80404777.cms

    ReplyDelete
    Replies
    1. విన్నకోటవారు,
      చూశానుగాని మరచానండి. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు

      Delete
  9. ఏదవసర మనుకుంటే
    ఆదాని పెరుగుదల తనువందున పెరుగున్
    ఏదాని అవసరం బిక
    లేదనుకో అది తొలంగునట చిత్రముగాన్ .

    ReplyDelete
  10. రాజా వారు,
    ఎవరికేది కావాలో అదే కోరుకుంటారు సార్ :)

    ReplyDelete
  11. ఏదేమైనా.. పనీరు తో ఏ వంటకమైన, పెరుగు ఉంటే చాలు సుమి నాకు.. వీటి ముందు నాన్ వెజ్ లేవైనా బలాదూరే..
    టాప్ ౨: పనీర్ (పనీర్ మలై కోఫ్తా, పనీర్ మటర్ మసాల, చిల్లి పనీర్, అచారి పనీర్, బటర్ పనీర్, పాలకూర పనీర్, పనీర్ టిక్కా, పనీర్ ఘీ రోస్ట్)
    టాప్ ౧: పెరుగు (ఆవు పెరుగు మరీ పులిసింది కాదు, మరీ పులియనిదీ కాదు, లస్సి విథ్ నో షుగర్, మజ్జిగ చారు, కచాంబరూ, మిష్ఠి దోయి, మట్కా ధై, చుమ్మ తైర్, అల్లం, ఉప్పు, మిర్చి కలయికలో చల్ల ముంత)
    దావత్ గ్రీన్ ఓల్డ్ మూడు గంటల పైచిలుకు నానబెట్టిన బాస్మతి బియ్యం, బఠాణి, క్యారెట్, క్యాప్సికం, కలగల్సిన వేడి వేడి ఫ్రీ ఫ్లోయింగ్ వెజ్ బిర్యాని.. వాహ్..

    ReplyDelete
    Replies
    1. శ్రీధరా!
      ఎవరి కడుపు వారిష్టం :)

      Delete