Monday 7 December 2020

మొహమాటం లేదు.

 కశ్చిచ్చండ కోపానా మాత్మీయో నామ భూభుజామ్

హో తారమపి జుహ్వానం,స్పష్టో దహతి పావకః


మనుజులలో నెవ్వడు దగ

దనవాడనువాడు దుష్టధరణీశునకున్?

దనకయి వ్రేలిమి వ్రేల్చెడు

జనునితనువు గాల్చు వాయు సఖు డదయుండై...లక్ష్మణ కవి


దుష్టుడైన రాజుకు తనవాడనే వాడు ఎవడూ ఉండడు. అలాగే తనని అర్చిస్తున్న వానిని కూడా, పొరబాటుగా ముట్టుకున్నా అగ్ని మొహమాటం కూడా లేక కాలుస్తాడు.


రాజుకి అనగా పరిపాలకునకు తనవాడు పెరవాడనే భేదం లేక న్యాయం చేయాలి, కాని దుష్టుడైన రాజుతనవాడినైనా చంపిస్తాడు, కోపంతో. ఇదెలాగంటే నిత్యమూ  కొలిచేవానిని సహితం అగ్ని పొరబాటుగా ముట్టుకున్నా కాల్చేస్తాడు.   రాజకీయ పార్టీలు,రాజకీయనాయకులు, నటులు,నటీమణులు,ఆటగాళ్ళ అభిమానులుగా  ఎన్ని సంవత్సరాలు వీధుల్లోబడి కొట్టుకున్నా, ఎన్ని సంవత్సరాలు నిద్ర హారాలు మానుకుని కీ బోర్డ్ మీద పోరాడినా, కీ బోర్డ్ వారియర్లు గా మారినా, పరస్పరం తిట్టిపోసుకున్నా, ఎవరిగురించి ఇంత బాధపడ్డారో, వారు కనుపించినపుడు  రాజకీయ నాయకుడు, తన అభిమానులు, కీ బోర్డ్ వారియర్లను,కనీసం కన్నెత్తి చూడడు, పన్నెత్తి పలకరించడు . సరికదా! సెక్యూరిటీ వాళ్ళు ఈడ్చి పారేస్తారు,గింజుకుంటే పోలీస్ పట్టుకుపోతుంది. 

  ఇంటి దీపమేకదానని ముద్దు పెట్టుకున్నా మీసాలు కాలతాయి/మూతి కాలుతుంది  సామెత


10 comments:



  1. తనవాడన్నదెవరు దు
    ష్టునకు జిలేబి హతమార్చు సూటిగ నతడిన్
    కనికరము చూప డగ్నియు
    తన దేవతయే యటంచు తాకగ సిసుడిన్


    జిలేబి

    ReplyDelete
    Replies
    1. తమరందుకు సమర్ధులే :)

      Delete
  2. మరో సామేత..
    కాకి గూడులో కోకిల గ్రుడ్డు దాచినా
    తెలియక కాకి కోకిల గ్రుడ్డును పొదిగినా
    కాలక్రమేణ కాకి కాకి కాక మానదు
    కోకిలను కాకి చివరాఖరున తెలిసి తరమక మానదు

    ReplyDelete
    Replies
    1. ఏ గూటి పక్షి ఆ పలుకే పలుకుతుందని నానుడి :)

      Delete
  3. రాజకీయ నాయకులు, కాస్త పాటి పేరుకే  అహంకారం నిండిపోయిన ఆటగాళ్ళు నటులు నటీ”మణులు” మోడల్స్  టీవీ మీడియావారు ..వీళ్ళు నిస్సందేహంగా దుష్టరాజు లాంటి వారే. వాళ్ళకు పేరు సంపద తెచ్చి పెట్టే అనుయాయులు, సో కాల్డ్ అభిమానులు / “ఫాన్స్” (వీళ్ళను చూస్తే నాకు జాలేస్తుంటుంది) అంటే వీసమెత్తు విలువనియ్యరు. పైకి మాత్రం ప్లాస్టిక్ నవ్వులు పూయిస్తుంటారు. అయినా బుద్ధి తెచ్చుకోక ఎగబడే జనాలకు అదే సరైన శాస్తి. 

    ఇక మొహమాటం లేదు కానీ అగ్ని పవిత్రుడు కదా, సర్. ఆయనకు దుష్ట రాజుకూ పోలికెక్కడ?

    ReplyDelete
    Replies
    1. దుష్టరాజు ఆలోచన లేక తనవారినే చంపిస్తాడు, అగ్ని తనని అర్చిస్తున్నవానిని కూడా దహిస్తాడు, ఆలాగే నేటి దేవతలు తమ అభిమానులనే తన్నిస్తారు అదనుకుంటానండి సారాంశం. పోలిక చెప్పినది భర్తృహరి కదండీ

      Delete
  4. Now these keyboard warriors are getting alms of Rs5 per posts, they are now called paytm dogs..:) ... one poisonous man, PK has successfully tested in AP , now used in entire india

    ReplyDelete
    Replies
    1. లోకో భిన్నరుచిః

      Delete
  5. "కీ బోర్డ్ వారియర్స్" అంటే ఎవరండీ, శర్మ గారూ ?

    ReplyDelete
  6. విన్నకోటవారు,
    మాట బాగుందని వాడేశానండీ :)
    ఏం బాగోలేదంటారా?

    ReplyDelete