మరచిపోనివాళ్ళు.
లోకంలో ఎవరూ ఎవరినీ గుర్తుపెట్టుకోరు, బంధువులు,స్నేహితులు, సంతాప సభదాకా. కొడుకులు,కోడళ్ళు;కూతుళ్ళు,అల్లుళ్ళు రోజులెళ్ళేదాకా, విధిలేక;సొమ్ములేమైనా ఉంటే పంపకాల దాకానే. ఆ తరవాత నమోనారాయణ. మరచిపోవడమే అందరి నైజం,కనపడినంతవరకే కత నడిచేది.
కాని మరచిపోని ఆఫీసర్లు ఇద్దరున్నారు.
బతికున్న కాలంలో పెన్షన్ చెల్లించే ఆఫీసరు, డిజిటల్ లైఫ్ సర్టిఫికట్ కోసం,చేయని ప్రయత్నం అంటూ ఉండటంలేదు. పెన్షనర్ కి విసుగొచ్చేలా ఎస్.ఎం.ఎస్ లు ఇచ్చి ఇచ్చి విసిగిపోతారు. వాటికి సమాధానం లేకపోతే, పెన్షనర్స్ యూనియన్లకి తెలియ జేస్తున్నారు. పెన్షనర్ బేంకు నుంచిగాని,పోస్టాఫిస్ నుంచి గాని పెన్షన్ సొమ్ము తీసుకుంటుంటే ఆ ఆఫీసులవాళ్ళకి రిమైండర్ మీద రిమైండర్ ఇచ్చి పెన్షనర్ ఇంటికి వెళ్ళండి,అతని పరిస్థితి చూడండి. లైఫ్ సర్టిఫకట్ ఇవ్వలేదు,ఇచ్చినదాని కాలం చెల్లిపోతోంది. కాలం చెల్లిన లైఫ్ సర్టిఫికట్ పై పెన్షన్ చెల్లింపు కుదరదు,పెన్షన్ ఆపేయాల్సి వస్తుంది. పెన్షనర్ కదలలేని స్థితిలో ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఏమైనా కదలలేని ఇబ్బందిలో ఉన్నా, ఇంటి దగ్గరనుంచే లైఫ్ సర్టిఫికట్ ఇచ్చే ఏర్పాటు చూడండి. కష్ట సమయంలో పెన్షన్ లేకుండా చేయకండి,అనిపోరుతున్నారు. ఇది మీ బాధ్యతకూడా, అతని పెన్షన్ అక్కౌంట్ మీదగ్గరుంది గనక అని పెద్దరికం కూడా వహిస్తున్నారు.
ఇక రెండవవారు ఇన్ కం టాక్స్ ఆఫీసరు.
మీరు ఇన్ కం టాక్స్ ఐ.టి.ఆర్ ఫైల్ చేసే సమయం దగ్గరపదుతోంది,తొందరలో చెల్లించవలసిన టాక్స్ చెల్లించండి,ప్రశాంతంగా ఉండండి.సమయం దాటితే పెనాల్టీలు పడతాయి,సొమ్ము చెల్లిOచండని ఒకటే పోరు. ఇక వీరైతే చనిపోయాకా కూడా వదలిపెట్టరు. బతికున్నకాలంలో సంపాదించిన సొమ్ముకి టాక్స్, పోయినా వసూలు చేస్తారు. పోయాకా, పోయినవారి పేరవచ్చిన సొమ్ముల మీద కూడా టాక్స్ పుచ్చుకోక వదలరు. వారసులు చెల్లించకపోతే పోయినవారి ఆస్థులు,బేంక్ ఏక్కౌంట్లతో సహా సీల్ చేసి,తమకురావలసిన సొమ్ములు వసూలు చేసుకు తీరతారు.
బతికుండగానూ పోయాకా కూడా గుర్తుంచుకునేవారు,ఇన్ కం టాక్స్ ఆఫీసరు. బతికుండగా వెంటబడి లైఫ్ సర్టిఫికట్ కోసం గుర్తుచేసి,అది పుచ్చుకుని పెన్షన్ చెల్లించే, పెన్షన్ ఆఫీసర్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి