మనిషి సాయం కావాలి
కుటుంబాలు చిన్నవైపోయాయి. మనిషి సాయం అవసరం కనపడుతోంది,పట్నాలలోలాగే పల్లెలలో కూడా.
కుడి చేతికి పక్షవాతం,కాలు కదులుతోంది,రోజూ ఉదయం ఒక గంట మనిషికావాలి,కూడా ఉండి నడిచేటప్పుడు తోడు.
ఓ పెద్దాయన, బయతికి ఒకసారి తీసుకెళ్ళి ఒక గంట తిప్పి తీసుకురావాలి, అంతే, తోడు కావాలి.
మరొకాయన డాక్టర్ దగ్గరకు తీసుకుపోయి,తీసుకురావాలి. దీనికి తోడు కావాలి, అక్కడ కూడా ఉండాలి.
ఒకాయన చెట్లంటే పిచ్చి,పెంచాడు,మామిడాకులు రాలుతుంటాయి. ఆకులు వారానికోసారి ఎత్తి పారబోసేందుకు మనిషికావాలి.
ఒక కుటుంబంలో నలుగురు, అంతా బిసీ, వారానికి ఒక రోజు ఇంట్లో బట్టలు వాషింగ్ మిషన్ లో వేసి ఆ తరవాత ఆరేస్తేచాలు. బట్టలు మిషన్లో ఉన్నంత సేపు ముసలామెతో కబుర్లు చెబితే చాలు.
భర్తపోయాడు ఒకతే ఐపోయింది. కొడుకు అమెరికా,కూతురు హైదరాబాదు. మనిషికావాలి కూడా ఉండి వండి పెట్టి తోడుండడానికి.
మరొకామె భర్తపోయాడు. శరీర కింది భాగం కదలడం కష్టం. ఒకడే కొడుకు బొంబాయి వాసం, తీసుకుపోలేడు. తల్లిని చూసేందుకు మనిషికావాలి.
ఇలా మానవావసరాలు పల్లెలలో కూడా పెరుగుతున్నాయి. ఇవి మా దగ్గర నేను చూచినవి.రోబోట్లు ఈ సేవలు చేస్తున్నయంటున్నారు, అందరూ రోబోట్లు కొనుక్కోగలరా? ఇటువంటి సేవలకి తగిన మూల్యం ఇస్తే పట్నాలలో మనుషులు నమ్మకమైనవారు,వెబ్సైట్ ద్వారా దొరుకుతున్నారు. కాని ఇది పల్లెలలో కష్టమైపోతూ ఉంది. రాజమండ్రి,కాకినాడ లాటి పట్టణాలను కేంద్రంగా ఇటువంటి సేవల కోసం వెబ్సైట్ ఎవరేనా ప్రారంభిస్తే బాగుణ్ణు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి