నెట్ కి మూడినట్టే...నా?
రష్యా యూక్రైన్ యుద్ధం నాలుగేళ్ళుగా జరుగుతూనే ఉంది. రష్యానుంచి యూరప్ దేశాలకి ఆయిల్ సరఫరా చేసే గొట్టాలు యూక్రైన్ మీదుగా ఉన్నాయి. వాటిని పాడుచేసేరు. యూరప్ కి ఆయిల్ సరఫరా రష్యానుంచి ఆగిపోయింది. రష్యాకి నష్టం చేస్తున్నామనుకుని యూరప్ కాళ్ళు నరికినట్టయి ఆయిల్ సరఫరాలేక యూరప్ అల్లాడుతోంది. ఆ గొట్టాలని సరిజేసేరు, అవి రెండురోజుల్లో ఉపయోగం లోకి రావచ్చనుకుంటున్నారు. ఇప్పటిదాకా చెల్లింపులలా కాక వేరువిఢంగా చెల్లింపులు కావాలంటోంది,రష్యా. ఇది కుదిరితే మళ్ళీ ఆయిల్ యూరప్ కి ప్రవహించచ్చు.
మరో యుద్ధం ఇరాన్-ఇస్రయెల్,అమెరికాలమధ్య రెండు నెలలుగా జరుగుతోంది. తాత్కాలిక కాల్పుల విరమణలో ఉన్నారు,ఇరు పక్షాలూ. ఎవరూ తగ్గుతున్నట్టు లేదు. ఎవరిమాట వారిదేలా ఉంది. ఇరాన్ జలసంధిని మూసేసింది. మరోపక్క అమెరికా మూసేసింది. ఆయిల్ సరఫరాలు తగ్గిపోయాయి,ప్రపంచానికి. దీనికితోడుగా యార్క్ గల్ఫ్ కి వచ్చే International OFC cables పాడుచేసి ప్రపంచాన్ని స్థంభింపజేస్తామంటో ఉంది. అదే జరిగితే మళ్ళీ శాంతి నెలకొని కేబుళ్ళు బాగుచేసేటప్పటికి ఎంతకాలం పదుతుందో. ఎన్ని దేశాలు దీనికి బలైపోతాయో తెలియదు. నెట్ కి మూడినట్టే ఉంది.
https://www.moneycontrol.com/world/iran-s-irgc-flags-undersea-cables-cloud-networks-as-potential-targets-in-persian-gulf-amid-fragile-truce-article-13896622.html
సొంత కపిత్వమా నోట్బుక్ ఎల్లమ్మ నా తాతగారూ :)
రిప్లయితొలగించండి