ఆబోతుల కుమ్ములాటలో...........
1.కూసే గాడిదొచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టు.
2.కొత్త బిచ్చగాడు పొద్దెరగనట్టు.
3. అంచుకు తొగరు లేనట్టు
4.కోతికి కొబ్బరికాయ దొరికినట్టు.
5.ఆబోతుల కుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరగదొక్కినట్టు.
6.ఉండలేక సిండ కాల్చుకున్నట్టు.
7.చదవేస్తే ఉన్నమతి పోయినట్టు.
8.పెనం మించి పొయ్యిలో పడ్డట్లు.
9.అత్తమీద కోపం దుత్తమీద చూపినట్టు.
10.వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు.
11. కుండ వేరైతే గుణం వేరయినట్టు.

బులోగుం తక్కువాయె :)
రిప్లయితొలగించండికొట్టు కొచ్చేరా ?
నానుడులకు సామెతలకు వ్యత్యాస మేమిటండి తాతగారూ ?
Zilebi15 ఏప్రిల్, 2026 10:29 AMకి
తొలగించండినీ బుర్రలో గుంజు ఎండిపోయిందని😜 ఏనాడో చెప్పబడింది,నేడు కొత్తగా కాదు.
నానుడికి సామెతకి తేడా తెలిసినవారికి చెప్పపనిలేదు. తెలియనివారికి చెప్పి ఉపయోగం లేదు.😍
ఓ అంటే తాతగారికే తెలియని విషయమన్నమాట ఇది :)
తొలగించండిపోనీలెండి వేరే ఎవరైనా తెలుపు తారేమో
తాతగార్కి తెలియని విషయాలు లేవనుకున్నా:)
తొలగించండిచతుర సంభాషణ కోసం గ్రామీణ జనాల నాల్కలమీద నానుతూ ఉండేది
నానుడి . ఇందులో వ్యంగ్యం పాలెక్కువ ఉదా : తిన మరిగిన కోడి ఇల్లెక్కి కూసిందట
సామెతలంటే - ఆవిథంగా , అట్లు అని సందర్భోచితంగా ఉదహరించేవి . ఇవికూడా వ్యవహారంలోగానీ , రాతలోగానీ శ్రోతకూ పఠితకూ అవగాహనా సౌలభ్యం కోసం వాడడం జరుగుతుంది . ఉదా : వెదకబోయిన తీగ కాలికి చుట్టుకున్నట్లు .
* పండితులు మెరుగైన వ్యాఖ్య చేయగలరేమో ! చూద్దాం .
రాజావారు
తొలగించండిమీ ప్రకారము "పండి తుల్ " ఎవరు ?
పండితులన - నిరు కొమ్ముల
తొలగించండిమండితులయి , పద్యవిద్య మా సొత్తంచున్
దండిగ పోరులు సల్పెడు
చండామార్కులు , నహపు విషము తల నుండున్ .
Zilebi17 ఏప్రిల్, 2026 1:19 AMకి
తొలగించండివెంకట రాజారావు . లక్కాకుల17 ఏప్రిల్, 2026 9:46 AMకి
మరొకరితో, మీ కలహం కొనసాగించడానికి నా బ్లాగ్ వేదిక కాదు ఇది చాలా సార్లు చెప్పడం జరిగింది. 🙏
మీ ప్రకారము "పండి తుల్ " ఎవరు ?
తొలగించండిఅని తమరడిగిన ప్రశ్నకు ' నాప్రకారం '
పండితు లంటే సమాధానం - అది .
అంతే గాని ఇందులో ఎవరితోనూ క
లహం లేదు . కలహానికి కాలుదువ్వే
తత్త్వమూ లేదు . తమరు పెద్దలు ,
గమనించ ప్రార్థన . 🙏
వెంకట రాజారావు . లక్కాకుల17 ఏప్రిల్, 2026 10:46 AMకి
తొలగించండిమిమ్మల్ని ఉద్దేసించి జిలేబి మీకు వేసిన ప్రశ్న ఇది,నేను వేయలేదు, మీరు పొరబడ్డారా? ఆబోతులకుమ్ములాటలో లేగదూడల కాళ్ళు విరగదొక్కడం అంటే ఇదేననుకుంటా! శలవు.
పొరపాటు గ్రహించాను సార్ 🙏
తొలగించండికూసే గాడిద లొచ్చిరి ,
రిప్లయితొలగించండిమేసే గాడిదల గూడ మేయ నియక , తి
ట్టే సే తీరులు గంటిమి ,
ప్రాసలకై ' కూసుముండ ' వరవడి హెచ్చెన్ .
వెంకట రాజారావు . లక్కాకుల15 ఏప్రిల్, 2026 10:39 AMకి
తొలగించండిఅంతా సజాతీయులే అంటారా?
ప్రాసకోసం ఏడ్చేనే కూసుముండా అన్నారట ఒక కవివరులు. ఇదొక నానుడే, కవివరులకే చెందుతుందనుకుంటానండీ
అంతే , అంతే సారూ !
తొలగించండిపంతముతో పరుగిడి , యొరు పైబడి , తిట్టే
వింత మనిషి గాడిదయే ,
అంతా మన మంచి కనుచు నానందింతున్ .
వెంకట రాజారావు . లక్కాకుల16 ఏప్రిల్, 2026 7:33 AMకి
తొలగించండిపరోపదేశ సమయే సర్వే చ పండితః
తదాచరణ సమయే సర్వే న పండితః 🙏
ఇంతే కదుసార్! లోకం. మనం ఒక వేలు చూపుతుంటే నాలుగు మనవైపు చూపుతాయి. అంతే తేడా! ఇదో మాయా ప్రపంచం. 🙏